Thought Economics- War and Peace- Part 12-End

శాంతి- హార్థిక ఆలోచనలు

భాగం-12

ఈ వ్యాసములో సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల   ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు నలుగురు  మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో పాల్గొన్నారు. వారు:

1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్

2. డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది, విద్యావేత్త

3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ  అధ్యక్షులు, క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)

4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ  అధ్యక్షులు)

5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)

6. బెన్ ఫెరెఙ్క్జ్  ( మాజీ  ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం )

7. బెర్టీ ఆహార్న్ (మాజీ  ఐరిష్ ప్రధాన మంత్రి)

వీరితో మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి చర్చించి తెలుసుకుందాం.

 

 

ప్రశ్న 40. శాంతియుత ప్రపంచ నిర్మాణం కోసం మీ సందేశమేంటి?

అధ్యక్షులు మార్టి అతిసారి: మన తప్పుల నుండి నేర్చుకొమ్మని తర్వాత తరానికి నేను చెబుతాను. చరిత్ర నుండి మనం ఏమీ నేర్చుకోలేదని నాకు ఆందోళనగా ఉంది. మనం కొన్ని సందర్భాలకు ఎలా చేరుకున్నాము అనేది మనం గమనిస్తే అటువంటి సందర్భాలను రాకుండా పూర్తిగా నియంత్రించే అవకాశం ఉన్నది.  ఈ రోజు యూరోప్ లో ప్రజారంజక ఉద్యమాలకు  ఎంత మద్దతు లభిస్తోందో మనం గమనిస్తే మేధోపరమైన చర్చలు ఎంతమాత్రమూ లేవని నాకనిపిస్తోంది. నిజాలు తెలుసుకొనుట చాలా ముఖ్యం. ఒక సందర్భాన్ని మనం బాగా విశ్లేషించాలి. దాని వెనక కారణాలను అన్వేషించాలి. నా తర్వాత తరం మరింత తెలివితేటలు కలవారు. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. 

లేక్ వాలేశా:  మా తరం పాత పాత్రలను, రూపాలను ధ్వంసం చేసింది. యూరోప్ సరిహద్దులను తెరిచాము, యూరోపును ఏకం చేశాము, మీ తరాలకు కొత్త యుగాన్ని ప్రారంభించాము. ఈ కొత్త యుగానికి కొత్త వ్యవస్థలు కావాలి, కొత్త ఆలోచనలకు తెర తీసాము. దీని కోసం మొత్తాన్ని పునర్నిర్మించుకోవాలి. ఇదే సమయంలో సాంకేతికత పెరిగి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయగల సామర్థ్యం పెరిగిపోయింది. అందువలన దేశాలను ఏకం చేసి శాంతిని నెలకొల్పవలసిన అవసరం ఉంది.   

మారినా కాంతకుజినో: మానవత్వం పరిమళించే కథలను నేను పంచుతుంటూ ఉంటాను, ఎందుకంటే మన కాలంలో ద్వేషం సులభంగా సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో కొందరిని రాక్షసులుగా ఒక సెకనులోనే చిత్రీకరించి ప్రేరేపిస్తారు. అప్పుడు మీరు మాతో లేరంటే అర్థం మాకు వ్యతిరేకమనే భావన పెరుగుతుంది. రిచర్డ్ రోర్ అన్నట్లు “మన బాధను మార్చకపోతే దాన్ని తప్పనిసరిగా దానిని (బాధను) ప్రసారం చేస్తాము”.   

బెన్ ఫెరెఙ్క్జ్: యుద్ధం తర్వాత మేము బెర్లిన్ లోని నాజీ సైనిక అధికారులు గర్వంగా ప్రదర్శించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నాము. ఇందులో ఎంతమంది యూదులను, జీప్శీలను, ఇతరులను చంపిన వివరాలను పేర్కొన్నారు. వారు హత్య చేశామని పేర్కొనలేదు, తొలగించామని పేర్కొన్నారు. నేను ఈ నివేదికలను క్రోడీకరిస్తే దాదాపు 10 లక్షల మందిని చంపేశారని తేలింది. నేను ఈ సాక్ష్యాలతో నా పై అధికారితో కలసి న్యూరెంబర్గ్ వెళ్ళాను. అక్కడ కొత్త విచారణ ప్రారంభించాలని చెప్పాను. ఆయన కుదరదని చెప్పారు. అయితే ఆయన మీ పనిలో భాగంగా చేయటానికి వీలవుతుందా అని ప్రశ్నించారు. నేను వీలవుతుందని చెప్పాను. ఆ విధముగా నేను చీఫ్ ప్రాసెక్యూటర్ అయ్యాను. నాకప్పుడు 27 ఏళ్ళు.   

ఒక శాశ్వత అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పాటుకు 50 ఏళ్ళు కృషి చేశాను. అది ఇప్పుడు హేగ్ లో ఉంది. దానికి మొదటి వాదన  వచ్చినప్పుడు నన్ను విచారణ చివరి భాగమునకు రావలసినదిగా ఆహ్వానించారు. 92 ఏళ్ల వయస్సులో నేను హాజరయి విచారణ చివరి దశలో పాల్గొన్నాను.  నాకిప్పుడు 98 సంవత్సరాలు, ఇప్పుడు కూడా నేను హేతుబద్ధ మానవ ప్రపంచ నిర్మాణానికి ప్రతి నిముషం వెచ్చిస్తున్నాను. మనం యువతరం యొక్క మనసులను, మేధస్సును మార్చాల్సిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయానికి వారే రంగస్థలం, వారు చెప్పాలి యుద్ధం వద్దని. ఇంతకు మునుపటి  కంటే ఇప్పుడు ప్రపంచం ప్రమాదకరమైనది. కంప్యూటర్ ద్వారా ప్రపంచమంతటి కరెంటును ఆపేయగల సత్తా మనకు ఉంది. నేటి ఆయుధాలు అందరినీ చంపేయగల శక్తిని కలిగి ఉన్నాయి. అందువలన వివాదాలను పరిష్కరించగల విధానాలు మన దగ్గర ఉండాలి. యుద్ధ నినాదాన్ని తుంగలో తొక్కి శాంతి విధానాలకు తెర తీయాలి. యుద్ధం నరకంతో సమానం అని నేను అనుభవం ద్వారా తెలుసుకున్నాను.   

మన ప్రభుత్వాలు యుద్ధం ఆపటానికి ప్రయత్నించటం లేదు, మన దౌత్యవేత్తలు ఎవరు పెద్ద ఆయుధాన్ని నిర్మిస్తున్నారూ అని చూస్తున్నారు. ఇది నా సమస్య కాదు. కానీ యువజనులు మాత్రం మేల్కొని, తమ వానిని వినిపించి, వీటిని ఆపాలి. నేటి యువతరానికి నేను ఒకటే చెబుతున్నాను “ ఎప్పుడూ తమ ప్రయత్నాలను ఆపవద్దు”.  అదొక్కటే నేను వారికి ఇవ్వగల ఒక గొప్ప సలహా. అయితే నేను ఆశావాదిని. గత కాలంలో ఏర్పాటు చేసిన న్యాయస్థానాలు, మానవ చేతన పురోగతి చూస్తుంటే నా ఆశలు పెరుగుతున్నాయి. మనం మంచి ప్రగతిని సాధిస్తున్నాము. కానీ మనం వెళ్లవలసిన గమ్యం చాలా దూరంలో ఉంది. ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. సమస్యలను మనం అధిగమిస్తూ వెళ్ళాలి. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుండి మనం మంచి ప్రగతినే సాధించాము.  మనకు న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రపంచంలోని అనేక విశ్వ విద్యాలయాల్లో అంతర్జాతీయ న్యాయం బోధిస్తున్నారు, మానవ హక్కులపై అనేక తీర్మానాలు చేశారు. మానవ హక్కుల తీర్మానాలను గౌరవించకపోయినా వాటి ప్రభావం కొంత ఉంది.

ప్రశ్న 41. తదుపరి తరానికి మీరిచ్చే సందేశం ఏమిటి?

బెర్టీ ఆహార్న్: ఒక మేధావి అన్నట్లు “నీ శత్రువుతో శాంతిని నెలకొల్పుతావు, నీ మిత్రుడితో కాదు”. ప్రతి దేశం ప్రజాస్వామ్య విలువలతో వెలుగొందాలి, అలాగే వివిధ భావాల ప్రజలను గౌరవించాలి. ప్రజలు తమ వాదాలను శాంతియుతంగా వినిపించే హక్కులు కలిగియుండాలి. సమాజం విజయవంతంగా నడవాలంటే బహిరంగ చర్చ, చర్చ పట్ల సమభావం, స్వేచ్ఛాయుత ప్రసార మాధ్యమాలు, విశ్వ విద్యాలయాలలో స్వేచ్చ తప్పనిసరిగా ఉండాలి. వాక్స్వాతంత్ర్యం, చర్చలు, వాదాలు సంఘర్షణను దూరం చేస్తాయి. అంతే కానీ శాంతి దానంతట అదే రాదు. ఎన్నికలప్పుడు తక్కువ మంది  ఓటర్లు వోటు వేస్తున్నారంటే నాకు విచారంగా ఉంటుంది. స్వేచ్ఛాయుత ప్రపంచం ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులందరూ ఒక్కటే అని ప్రజలు భావించుట వలన కొంతమంది ఓటు వేయట్లేదు. ఇలా పరిస్తితి కొనసాగితే సంఘర్షణలు తప్పని సరిగా జరుగుతాయి. చాలా వరకు ప్రపంచంలో జరుగుతున్నది ఇదే.      

రచయిత ముగింపు మాట

“యుద్ధమనేది ఒక సాంస్కృతిక సంఘటన” అని అలెక్జాందర్ మోసేలే అంటూ “ దానిని మనిషి ఆలోచనల నుండి పుట్టేది కాదని భావించడాన్ని తిరస్కరించాలి”. అదేదో యాధాలాపంగా జరిగేది కాదు. మనమే మన సాంస్కృతిక, రాజకీయ చర్యల ద్వారా సృష్టిస్తాము. గతంలో జరిగిన యుద్ధాల చరిత్ర లోని విజయాల (విజయాలుగా భావించబడే వాటి ) నుండి స్ఫూర్తి పొంది మనం యుద్ధాలకు  దిగుతాము. మన యుద్ధ సంస్కృతి మనలను యుద్ధాలకు ప్రేరేపిస్తుంది. అది మన శరీరంలోనే ఉంటుంది. కానీ యుద్ధమనేది మనకు ఉన్న ఎంపికల, నమ్మకాల ఉత్పత్తి.  నమ్మకమంటే నేర్చుకున్న, వేరేవారి నుండి తీసుకున్న, అనుకరించిన, భావాలు,  వాదించిన, విమర్శించిన విషయాలనుండి నేర్చుకున్న వాటితో కూడినది. కాబట్టి యుద్ధమనేది ఒక భావాత్మక వ్యవస్థ. దాని ఆలోచనలు మనం నేర్చుకున్న హేతువు నిర్మాణాల్లో ఉన్నాయి. తర్వాత యుద్ధమనేది ప్రపంచం పాటించే ఒక రీతిగా మనం భావిస్తాము. అది మన సమస్యలను పరిష్కరించే సాధనంగా మనం భావిస్తాము. మన ఉనికికి చిహ్నంగా కూడా భావిస్తాము.

యుద్ధమనేది మనకు వేరుగా ఉండదు. అవి మన తోటి మానవాళితో మనం చేసే ఎంపికలే. దానికి రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక కారణాలేవో ఉండవచ్చు. వీటికి తోడు మనకున్న అంతులేని స్వార్థం కూడా ఉండవచ్చు. ఇప్పుడు వీటిని వదులుకోవాల్సిన సమయం వచ్చింది. శాంతి అనేది అదేదో భవిష్యత్తులో జరిగే అద్భుతంగా మనం భావించటం సహజం. శాంతి ఎడారిలో ఒయాసిస్సు గా భావించడం కూడా జరుగుతుంది. అలా కాకుండా వర్తమానంలో భాగంగా శాంతిని మనం చూడాలి.     యుద్ధం అనేది ఏదో దుష్ట శక్తులు మనపై దాడి చేసి మన సహనానికి పరీక్ష పెట్టారని అని చెప్పి,  వారిపై ద్వేషం మనపై రుద్దారనీ మనం గమనించాలి. మానవజాతి ప్రారంభ  వయస్సులో మనకు నేర్పబడినవి. యుద్ధ ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పి మనలను ప్రేరేపించారనీ మనం తెలుసుకోవాలి.   

ఇప్పుడు మనం ప్రారంభం వయస్సులో లేము, వయోజనులయ్యాము. సమసమాజం నిర్మించుకోవటానికి అవసరమైన సాంకేతికత, జ్నానము, వ్యవస్థలు ఇప్పుడు ఉన్నాయి. శతాబ్దాలుగా జరిగిన మారణహోమానికి స్వస్తి పలకవలసిన సమయం ఆసన్నమైనది. ఉనికిలో మానవులు యుద్ధము యొక్క అంతాన్ని చూడవలసిన సమయం ఆసన్నమైనది. 

ముగిసింది

https://peacesimplified.blogspot.com/

మూలం:

https://thoughteconomics.com/war-and-peace/

రచయిత: వికాస్ షా

Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War and Peace- Part 7

Reality of War by Dalai Lama - Translated to telugu