Thought Economics- War & Peace- Part 10
శాంతి- ‘హా’ర్థిక ఆలోచనలు
భాగం-10
ఈ వ్యాసములో సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం
సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు
నలుగురు మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో
పాల్గొన్నారు. వారు:
1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్
2. డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది, విద్యావేత్త
3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ అధ్యక్షులు, క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)
4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ అధ్యక్షులు)
5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)
6. బెన్ ఫెరెఙ్క్జ్
( మాజీ ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం )
7. బెర్టీ ఆహార్న్ (మాజీ ఐరిష్ ప్రధాన మంత్రి)
వీరితో మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి
చర్చించి తెలుసుకుందాం.
ప్రశ్న 32. విశ్వ దృక్కోణాలు మనకు ఎందుకు అవసరము?
బెన్ ఫెరెఙ్క్జ్: విమాన రంగం, టెక్నాలజీ వలన ప్రపంచం
చిన్నదిగా మారుతున్నది. వీటివలన ప్రజలు అనేక మూలలనుండి ఒకరితో ఒకరు మాట్లాడగల్గుతున్నారు.
కలిసి పని చేస్తున్నారు కూడా. మనం “ఒకే గ్రహం” స్థితికి చేరుకున్నాము. కాబట్టి మనం
జాతీయవాదం, ఇంకా చిన్నగా ఆలోచించకుండా “ఒకే గ్రహం” కోణంలో ఆలోచించవలసి
వస్తుంది. మన నిర్ణయాలు కూడా అదే దిశలో ఉండాలి. ఆధునిక సమాజం యొక్క సహజ పరిణామం. ఇంటర్నెట్, టెలివిజన్, ఇతర సమాచార ప్రసార సాధనాలు ప్రజలను కలుపుతున్నాయి.
నిరక్షరాస్యత, తమ భవిష్యత్తును తామే ఎంపిక చేసుకొనలేకపోవుట నెమ్మదిగా
తగ్గిపోతుంది. రాబోయే 25-30 సంవత్సరాలలో ఎక్కడి పిల్లలైనా ఒకే ప్రదర్శనలను వీక్షిస్తారు.
ప్రపంచం మారింది. కానీ మన ఆలోచనా విధానమే ఇంకా మారలేదు. అందుకనే మనం ఒక విచిత్ర పరిస్థితిలో
ఉన్నాము.
ప్రశ్న 33. విశ్వ విలువలపై ప్రపంచం ఏకమయ్యే అవకాశం ఉందా?
లేక్ వాలేశా: అలా జరుగుతుంది.
మంచి ఆనందకరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే ప్రపంచ
శాంతి అవసరమని తెలుసుకోటానికి ఎన్ని యుద్ధాలు చేయవలసి వస్తుందనేదే ముఖ్యమైన ప్రశ్న.
మనము ఉమ్మడి విలువలను రూపొందించు కొనటమే మన ఆశయం కావాలి. ఎన్నో మతాలు, సంస్కృతులు, రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి, మనం వాటిని అర్థం చేసుకోవాలి. దానికి సమయం పడుతుంది. కానీ అది జరుగుతుందని
నా నమ్మకం. ప్రపంచమనే ఒకే దేశంలో ఒకే జాతి- అదే మానవ జాతి.
ప్రశ్న 33. తర్వాతి తరానికి ఉన్న గొప్ప కలతలేమి?
లేక్ వాలేశా: నన్ను
కలవర పెట్టేది- జనరంజకత. దానితో పోరాడటం మనం నేర్చుకోవాలి. నీవు ఏది కావాలంటే అది మాట్లాడితే
దాని పర్యవసానాలు దానికి ఉంటాయి. జనరంజక విధానాలను పాటించే వారు గెలిచి పెద్ద ఎత్తున
అధికారంలోకి వస్తే సమాజాలకు చెడు పరిణామాలు సంభవిస్తాయి. మనం ప్రతి ఒక సమస్యకు ఒక సమాధానం
వెతికి, కొత్త ప్రపంచానికి కొత్త వ్యవస్థను ఏర్పాటు
చేసుకుని, ఈ ప్రపంచాన్ని అందమైనదిగా తయారు చేసుకోవాలి.
ప్రశ్న 34. శాంతికి నిజమైన నిర్వచనం ఏది?
డాక్టర్ శిరీన్ యెబడి: తగు గౌరవంతో మానవులు సమాజంలో జీవించటానికి కావలసిన
నిబంధనలు, పరిస్థితుల సమాహారమే శాంతి. కేవలం భద్రతే
సరిపోదు. శాంతికి కావలసిన నిబంధనలలో భద్రత ఒకటి. మానవ ఔన్నత్యాన్ని తగ్గించే ఏ పరిస్థితి
అయినా, అది పేదరికం అయినా నిరంకుశత్వం అయినా, శాంతికి భంగం కలిగించేవే.
ప్రశ్న 35. శాంతిని నెలకొల్పటంలో విద్యా వ్యవస్థ పాత్ర ఏమిటి?
బెర్టీ ఆహార్న్: నేను
స్కూల్ లో ఉన్నప్పుడు పౌర శాస్త్రం పాఠ్యాంశముగా ఉండేది. అది చాలా ముఖ్యమైన విషయం.
ఎవరి రాజకీయాలో నాకవసరం లేదు కానీ, రాజకీయాలు మాత్రము
చాలా ముఖ్యం- ఎందుకంటే అభిప్రాయాలు ఉండటం, ఓటు హక్కు ఉండటం, దాని ద్వారా రాజకీయాలలో మార్పు తీసుకురాగలగటం
- ఇవన్నీ చాలా ముఖ్యం. ప్రపంచంలో చాలా దేశాలలో సుస్థిర ప్రజాస్వామ్యాలు లేవు. ఈ ప్రాంతాలను
సందర్శిస్తే జీవితం ఎంత మంచిదో తెలిసొస్తుంది. మన స్వేచ్ఛను,
మన వాక్స్వాతంత్ర్యాన్ని మనం గౌరవించుకోవాలి. మన ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకపోతే, రాజకీయాలలో మనం ఆసక్తిని కోల్పోతే, మనకు నియంతృత్వమే
రాగలదు.
ఇంకా ఉంది
https://peacesimplified.blogspot.com/
మూలం:
https://thoughteconomics.com/war-and-peace/
రచయిత: వికాస్ షా
Comments
Post a Comment