Reality of War by Dalai Lama - Translated to telugu
యుద్ధ వాస్తవం
ప్రపంచం లోని అత్యధిక
హింసకు యుద్ధం, పెద్ద పెద్ద సైనిక వ్యవస్థలే ముఖ్య కారణం. ఈ వ్యవస్థల
ఉద్దేశము రక్షణ లేదా ప్రమాదం కలిగించడం. ఈ వ్యవస్థలు మానవాళిని అంతమొందిస్తాయి.
అందుకే అవి ఏర్పడ్డాయి. యుద్ధం యొక్క వాస్తవాన్ని మనం ఆలోచించి అర్థం చేసుకోవాలి. మనమందరమూ
సైన్యం దాడిని ఉత్సుకతో,
అందమైనదిగా భావిస్తాము. ఇది మనుష్యులకు తమ సామర్థ్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించేందుకు ఒక అవకాశంగా భావిస్తాము. సైన్యము చట్టబద్ధంగా
ఏర్పడినవి కాబట్టి యుద్ధము మనకు సమ్మతంగా భావిస్తాము. మనం యుద్ధాన్ని ఒక నేరపూరిత
చర్యగా, యుద్ధానికి సమ్మతించడం నేర స్వభావంగా మనం భావించము.
ఈ రకంగా మనం జ్ఞాన ఒత్తిడి కి (brain wash) గురయ్యాము. నిజానికి యుద్ధం అంత
అందమైనదీ, ఆకర్షణీయమైనది కాదు. యుద్ధం అనేది వికృతమైన ఒక
భూతం. విషాదం, బాధలకు గురి చేయడమే దాని నైజం.
మానవ సమాజానికి నిప్పు వంటిది యుద్ధం. దానికి
ఇంధనం జీవులు. నిప్పు యొక్క వివిధ రూపాలతో జరిపే ఆధునిక యుద్ధం మనకు ఉత్సాహంగా
అనిపించడం మనం కూడా conditioned అయ్యామని అర్థమవుతున్నది. దీనికి తోడు మనం ఈ ఆయుధం బావుంది, ఉత్తమ సాంకేతికతకు ఆ ఆయుధం మంచిదని భావిస్తూ ఉన్నాము. ఇక్కడ ఏ ఆయుధమైనా అది మానవులను కాల్చి వేస్తుందని తెలిసి కూడా మన
భావనలు అదే మూసలో ఉంటాయి. నిప్పు త్వరగా వ్యాపించినట్లే యుద్ధం కూడా
వ్యాపిస్తుంది. ఏదైనా ప్రాంతంలో బలహీనంగా ఉంటే, ఉన్నత
సైన్యాధికారి అక్కడకు అదనపు బలగాలను పంపిస్తారు. దీనర్థం జీవించి యున్న మనుషులను
నిప్పులోకి విసిరేసినట్లే. మనం “జ్ఞాన ఒత్తిడి” కి గురవటం వలనే సైనికుల బాధలు మనకు
కనిపించవు, బాధకు గురిచేయవు. ఏ సైనికులు గాయపడాలని కానీ, చనిపోవాలని కానీ అనుకోరు. సైనికుల అయినవాళ్ళు కూడా తమ వారికి ఎటువంటి
హాని జరగాలని కోరుకోరు. ఒక వేళ హాని జరిగితే అది మరో పదిమందికి కూడా బాధ
కలిగిస్తుంది. నిజానికి మనం యుద్ధం వలన జరిగే విషాదానికి భయకంపితులమై పోవాలి, కానీ మనం
గందరగోళంకు గురి అవుతున్నాము.
ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడూ నేను కూడా
సైన్యం వైపు ఆకర్షితులయ్యాను. సైనిక యూనిఫాం అందంగా కనిపించేది. సమ్మోహనం వాటితోనే
ప్రారంభమయ్యింది. చిన్నగా ఉన్నప్పుడు ఆడే
ఆటలు పెద్దయ్యాక సమస్యలకు దారి తీస్తాయి. మనుష్యులను చంపటం మీద ఆధారపడినవి కాక
అనేకమైన ఇతర మంచి ఆటలు ఎన్నో ఉన్నాయి. మనం యుద్ధం పై ఆసక్తి చూపనప్పుడు, మన పిల్లలు యుద్ధం గురించి ఆటలపై
ఆసక్తిని పెంచుకోవటం చాలా దురదృష్టకరం. మొదటి సారి ఎదటి వ్యక్తిని చంపినప్పుడు తాము చాలా అసౌకర్యంగా భావించామని
కొంతమంది పూర్వ సైనికులు చెప్పారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా అలవాటు కొలదీ చాలా
సాధారణంగా అనిపించిందని వారు చెప్పారు.
యుద్ధ సమయాల్లో మాత్రమే కాక ఇతర సమయాల్లో కూడా
సైనిక వ్యవస్థలు వినాశనాన్ని సృష్టిస్తాయి. వాటి రూపకల్పన లోనే మానవ హక్కుల
ఉల్లంఘన ఉంది. దీనివలన ఎక్కువ నష్టం సైనికులకే జరుగుతుంది. ఎప్పుడైతే సైన్యం
విశిష్టతను,
క్రమశిక్షణ ప్రాముఖ్యతను, శత్రువులను జయించాలని అనే
భావనలను పై అధికారి సైనికులకు
విశదీకరిస్తాడో అప్పుడే సైనికుల హక్కులు తీసివేయ పడతాయి. అప్పుడే వారు తమ
వ్యక్తిగత భావాన్ని మొదటగా, ప్రాణాలను చివరిగా కోల్పోతారు.
ఒకసారి సైన్యం శక్తివంతంగా మారితే తమ దేశ ఆనందాన్నే హరించేస్తుంది.
ప్రతి సమాజంలోనూ వినాశకర భావాలున్న వ్యక్తులు
ఉంటారు. అలాంటివారు తమ కోరికలు తీర్చే సంస్థలపై ఆధిపత్యం వహించాలని కోరుకుంటారు.
సమాజం ఆమోదించిన సైనిక వ్యవస్థ లేకుంటే ఈ విపరీత భావాలున్న వ్యక్తులు ఇతరులకు హాని
కలిగించలేవు. శక్తివంతమైన సైన్యం ఉంటే నియంతృత్వం సమీపంలోనే ఉందన్నమాట. నియంతృత్వం
మనకు సరిపోదు అనుకుంటే దానికి ప్రధాన కారణం బలమైన సైన్యం అని గుర్తించాలి.
మిలిటరీ వ్యవస్థ ఖర్చుతో కూడినది. సైనిక బలం
ద్వారా శాంతిని సాధించాలంటే అది సమాజం మీద వ్యర్థమైన భారం పెడుతుంది. అనవసరమైన
ఆయుధాల మీద ప్రభుత్వాలు అతి పెద్ద మొత్తాలలో ఖర్చు పెడుతున్నాయి. చివరికి అవి ఏవీ
వాడరు. అవన్నీ కేవలం భయం పెంచడం తప్ప, దేనికి పనికి రాక విలువైన
శక్తిని, మానవుల తెలివితేటలను వృధా చేస్తున్నాయి.
యుద్ధాలను సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ
బుజ్జగించటాన్ని నేను ప్రోత్సహించటం లేదు. వేరే వారి అధర్మ దూకుడు కు ఎదురుగా
బలమైన stand తరచూ తీసుకోవాలి. వెను తిరిగి చూస్తేనే, మనం గతం లో
తీసుకున్న నిర్ణయాలు తప్పా, ఒప్పా తెలుస్తాయి. యుద్ధం అంటే
హింస, హింస ఊహించలేని పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే మనం
యుద్ధాన్ని రాకుండా ఆపాలి.
ప్రచ్చన్న యుద్ధానికి వస్తే దాని తర్వాత నిజమైన
శాంతి రాలేదు. శాంతిని కాపాడేందుకు సైనిక వ్యవస్థను/ ఆయుధాలను కలిగి వుండటం
తాత్కాలిక ఫలితాలనే ఇస్తుంది. ఇరు పక్షాలు ఒకరినొకరు నమ్మనంత కాలం శక్తి సమతులనను ఏ చర్యైనా ప్రభావితం
చేయగలదు. సహజమైన నమ్మకమే చిట్ట చివరి వరకూ
శాంతినిస్తుంది.
మూలం https://www.dalailama.com/messages/world-peace/the-reality-of-war
Comments
Post a Comment