Thought Economics- War and Peace- Part 7
శాంతి- ‘హా’ర్థిక ఆలోచనలు
భాగం-7
ఈ వ్యాసములో సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం
సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు
నలుగురు మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో
పాల్గొన్నారు. వారు:
1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్
2. డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది, విద్యావేత్త
3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ అధ్యక్షులు, క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)
4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ అధ్యక్షులు)
5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)
6. బెన్ ఫెరెఙ్క్జ్
( మాజీ ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం )
7. బెర్టీ ఆహార్న్ (మాజీ ఐరిష్ ప్రధాన మంత్రి)
వీరితో మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి
చర్చించి తెలుసుకుందాం.
ప్రశ్న 19: ఘర్షణను నివారించటంలో ముఖ్య భాగాలు ఏవి?
ప్రొఫెసర్ జోడీ విలియమ్స్: ఇతర ఎంపికలున్నాయని
ప్రజలకు నచ్చ చెప్పటం, యుద్ధాన్ని గొప్పదిగా కీర్తించడాన్ని ఆపివేయడం-
ఈ రెండూ ముఖ్య కార్యాలు. మాకు అమెరికా చరిత్రను చెప్పినప్పుడు మాకు అమెరికా సాధించిన
విజయాలు గురించి గొప్పగా చెప్పారు.
ఇవాల్టి రోజున అలా జరిగితే “జెనోసైడ్:
జాతి విధ్వంసం” అని అంటున్నారు. ఇది చాలా కష్టతరమైన పని. మనకేమో గతంలో జరిగిన యుద్ధాలన్నింటినీ
గొప్పగా చేసి చూపించి పౌరాణికాలు చెప్పారు. ఏ దేశము తమ చరిత్రను నిజాయతీగా చూడటానికి
ఒప్పుకోదు. ఎలా చూసిన గతమంతా నిర్దాక్షిణ్యమైన మారణ కాండలే. యుద్ధం
చేసిన వారు హీరోలు కావచ్చును, కానీ యుద్ధం మటుకు
వీరత్వం కాదు. యుద్ధం కొద్దిమందితో కూడిన బృందం తీసుకునే రాజకీయ నిర్ణయం. ఇందులో వేరేవారి
పిల్లలను చంపడానికి ఉసి గొల్పుతారు.
చాలా మంది రాజకీయ నాయకులు శాంతి కావాలంటే యుద్ధం తప్పని సరి
అని వాదిస్తారు. అతి చిన్న విద్యా స్థాయి నుండి ఘర్షణ నివారణ, శాంతి కోసం పని చేస్తున్న వారి గురించి, శాంతి అంటే ఏమిటి అనే అంశాలపై విద్యను అందించాల్సిన అవసరం ఉంది. యుద్ధం కోరుకోకుండా ఎవర్నైనా ఆపాలంటే ముందర వారి
కడుపులను నింపాలి. వారికి మంచి చదువుకు ఏర్పాట్లు చేయాలి. వారికి మంచి గుర్తింపు ఉన్న
ఉద్యోగం వచ్చేటట్లు చూడాలి. భవిష్యత్తుపై చక్కని
ఆశ ఉండేటట్లు చేయాలి. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు.
యుద్ధం ద్వారా లాభపడుతున్నవారు, యుద్ధం లేకపోతే
నష్టపోతారు. అందుకే శాంతిని కోరుకోరు.
ప్రశ్న 20 : శాంతిని నెలకొల్పడంలో
క్షమాపణ పాత్ర ఏమిటి?
మారినా కాంతకుజినో: విరిగిపోయిన
బంధాలను కలపడానికి, క్షీద్రమైన సమాజాలను బాగుచేయటానికి క్షమాపణ
ఒక ముఖ్యమైన అంశము. ఏదైనా శాంతిని నెలకొల్పే ప్రక్రియలో ముఖ్య పాత్ర వహించడమే కాకుండా, ఒక్కోసారి విడిపోయిన సమాజాలను ముందుకు తీసుకువెళ్తుంది. పుండు పట్టిన బాధకు
మందు లాగా క్షమాపణ పని చేసి, అమానవీకరణ తొలగేలా చేస్తుంది. రెండు
పక్షాలు “సమానతను సాధించటం” అంటే భయాధారిత
ఆలోచనలను పెంచు కోవచ్చు. ఇటువంటి సమయాలలో సహానుభూతి, సంధి, క్షమాపణ చాలా పనికొస్తాయి.
విశాలమైన స్థాయిలో అంటే దేశము, రాష్ట్రము స్థాయిలో చూస్తే రెండు లేక ఎక్కువ వైరి పక్షాలు ఉన్నప్పుడు దేశ
భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చును, ఉదా: దక్షిణ ఆఫ్రికా. క్షమాపణ
అనేది ఒక బహుమతిగా ఇస్తేనే దానికి విలువ, అది ఒక బాధ్యతగా భావించకూడదు.
సంభాషణ ద్వారా దీన్ని సాధించాలి. అందరూ తమకు సమానంగా ఘర్షణ వలన బాధ కలిగిందని భావించాలి.
అన్నీ పక్షాల ఉమ్మడి బాధను అన్నీ పక్షాలు అర్థం చేసుకోవాలి.
బెన్ ఫెరెఙ్క్జ్: క్షమించడం
అనేది ఒక క్లిష్టమైన భావన. ఎవరు క్షమించాలి? ఎక్కడ? ఎప్పుడు? ఎవరికి? ఎందుకోసం? అనే ప్రశ్నలు ముఖ్యంగా ఉదయిస్తాయి. మనకు సమాధానాలు లేకపోవచ్చు.
అయితే శాంతి కొరకు శత్రువుతో సంభాషణకు సిద్ధమవుట అనేది ప్రతీకార చర్యలకు వ్యతిరేకం.
ప్రతీకారం ఇంకా ప్రతీకారాన్ని కోరుతుంది. ప్రపంచంలో ఉన్న ఘర్షణలకు ఇవే మూల కారణం.
“క్షమించు- మరచిపో” అంటే నీవు మరచిపోలేని నేరాలను
క్షమించలేనని కాదు. నీవు నింద వేసే వ్యక్తులు కూడా మనుషులేనని, వారికి కూడా భావాలు, రాజీలు ఉంటాయని వారి వైపునుండి కూడా ఆలోచించాలని క్షమాగుణం చెబుతుంది. నీ మానసిక సమతుల్యం కోసం పాత నేరాల గురించి ఆలోచించకుండా
భవిష్యత్తును మెరగుపరచటం కోసం ఆలోచించాలి.
ప్రశ్న 21 : క్షమించక పోవడం వలన
జరిగే ప్రభావమేమిటి ?
మారినా కాంతకుజినో: “క్షమించము-
ద్వేషించము” అనే ఆలోచన సంభావ్యమే. ఇక్కడ క్షమించటంలోని నిర్వచనాలు, సంక్లిష్టతలు గురించి ఆలోచించి అది ప్రజలకు ఏ విధంగా అర్థమవుతున్నదని గమనించాలి.
క్షమించడానికి వ్యతిరేకం ద్వేషం, కోపం తెచ్చుకోవడం. ప్రజల వాణిని
వినిపించడం కోసం, తమ అస్థిత్వం మరల వెనకకు తెచ్చుకోవడం కోసం, అన్యాయంను ఎదురించడం కోసం కోపం పనికి వస్తుంది. కానీ దీర్ఘ కాల కోపం మనకున్న
శక్తినంతటినీ తోడి వేస్తుంది. కనుక ద్వేషం
నీ మానసిక, భౌతిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. దీర్ఘ కాల బంధాలను
కోపం, ద్వేషం ప్రభావితం చేస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే క్షమించడం
అనేది ఒక మంచి ప్రజా ఆరోగ్య సాధనం. నీలో క్షమా గుణం ఉంటే నీవు సంతోషంగా, ఆనందంగా ఉంటావని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. నీ బంధాలు కూడా గట్టిగా, మెరుగ్గా ఉంటాయని చెబుతున్నాయి. నీవు జీవించే కాలం పెరుగుతుందని కూడా అధ్యయనాలు
చెబుతున్నాయి.
ప్రశ్న 22 : క్షమించడం వలన వ్యక్తి
మీద, నేరస్తుల మీద, బాహ్య ప్రపంచం మీద ప్రభావమేమిటి ?
మారినా కాంతకుజినో: మనం ఎక్కువ
ప్రేమించేవారే మన వలన బాధ పడే అవకాశం ఎక్కువ. ఇది ఒక వైరుధ్య భావన. సంఘర్షణ తీర్మానమనేది
విజయవంతమైన బాంధవ్యానికి చాలా ముఖ్యం. అన్నీ రకాల స్నేహాలలో క్షమించడం అనేది ఒక నిరంతర, పరస్పర ప్రక్రియ.
వ్యక్తిగత
బంధాలలో క్షమాగుణం అనేది ఒక కందెన వంటిది. రాజీ పడడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మనమందరం
సృష్టించుకున్న ఈ ప్రపంచానికి మనమందరం సమాన బాధ్యత వహించాలి కాబట్టి ఈ ప్రపంచాన్ని
మనమందరం కలసి మరమ్మత్తు చేయాలి.
ఇక
నేరస్తుల విషయానికొస్తే క్షమాపణ పెను మార్పు తీసుకురాగలదు, పునరావాసం కల్పించగలదు. అహింసా మార్గానికి, సంస్కృతికి ద్వారం తెరవగలదు.
ఇంకా ఉంది
https://peacesimplified.blogspot.com/
మూలం:
https://thoughteconomics.com/war-and-peace/
రచయిత: వికాస్ షా
Comments
Post a Comment