Why peace is so difficult?
శాంతిని నెలకొల్పడం ఎందుకంత కష్టం?
గత దశాబ్దంలో
జరిగిన 90% పౌర యుద్ధాలన్నీ అంతకు ముందే యుద్ధాలు జరిగే దేశాలలోనే జరిగాయని ప్రపంచ
బ్యాంకు పరిశోధనలో తేలింది. మళ్ళీ యుద్ధం జరగటానికి, శాంతి ప్రక్రియను మరింత బలపరచటానికి ఏం చేయాలి?
కొలంబియాలో
ఈ మధ్య జరిగిన శాంతి ఒప్పందాన్ని ప్రపంచం హర్షిస్తున్నది. కానీ నిజమైన శాంతిని నిర్మించడం
ఇప్పుడు మొదలవుతున్నది. శాంతి ఒప్పందం మీద సంతకాలు చేసిన పిమ్మట కాగితం మీదైతే సంఘర్షణ
ముగిసినట్లే కానీ ఆ ప్రాంతంలో ఏ ప్రభావం ఉండక పోవచ్చును. యూరోప్ లో 20వ శతాబ్దంలో జరిగిన
యుద్ధాలన్నీ మనం గమనిస్తే రాత్రికి రాత్రే ఉద్రిక్తతలు తగ్గకపోవటం వలన విభజన గాయాలు
మానటానికి దశాబ్దాలు పట్టింది. శాంతిని నిర్మించడమంటే దుకాణానికి వెళ్ళి వస్తువును
కొన్నంత సులభం కాదు. శాంతికి నాలుగు స్తంభాలుంటే అవి: భద్రత, రాజకీయ ఫ్రేమ్ వర్క్, సామాజిక, ఆర్థిక పునాదులు, సయోధ్య & న్యాయం. వీటిలో ఏవీ డబ్బుతో కొనలేము.
యుద్ధం
నుండి శాంతి మార్గం ఏదో సాంకేతిక కార్యక్రమం కాదు, అది ఒక ఉన్నతమైన రాజకీయ ప్రక్రియ.
అందులో ప్రాధాన్యతలు, విధానాలు కలిసి ఉండాలి. ఒకే పరిష్కారం అన్నీ
శాంతి ప్రక్రియలకు పని చేయదు. ఒక చోట పని చేసే విధానం ఇంకొక చోట పనిచేయక పోవచ్చును, ఎందుకంటే ఎవరి అవసరాలు, ప్రాధాన్యతలు, ఘర్షణ తర్వాత సందర్భంతో వ్యవహరించే తీరు వేర్వేరు.
గత ఘర్షణల
నుండి మనం ఏమి నేర్చుకున్నాము?
స్థూలంగా
మనం మూడు విషయాలను నేర్చుకోవచ్చును.
1. సందర్భం మీద కఠినమైన,
నిరంతర విశ్లేషణ చాలా అవసరం.
సంక్షోభ
సందర్భం మీద సరైన అవగాహన లేకుండా ఘర్షణ జరిగిన తర్వాత కొత్త పౌర వ్యవస్థలు ఏర్పరచిన
తర్వాత అంతర్జాతీయ సంస్థలు తమ శాంతి ప్రక్రియలతో
ముందుకు వెళతారు. సరైన అవగాహన కావాలంటే దేశంకు సంబంధించిన సుదీర్ఘమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక లక్షణాలు అర్థం చేసుకోవాలి. సంఘర్షణ చరిత్ర, అధికార, ప్రత్యర్థుల మధ్య సంబంధ, బాంధవ్యాలు, శాంతి కాముకులను గుర్తించుట, ఘర్షణను ప్రేరేపించే అంశాలను
స్పష్టంగా గుర్తించుట మొదలగువన్నీ ఇందులో భాగమే. శాంతి పాఠాన్ని నిర్మించే వారందరూ
సంక్షోభ సంక్లిష్టత నుండి బయటపడకపోతే ఎంత ప్రణాళికలు రచించినా వ్యర్థమే. సున్నితంగా
వ్యవహరించటం శాంతి ప్రక్రియలో ముఖ్యమైన అంశం.
2. స్థానికుల యాజమాన్యంలో,
నాయకత్వంలో శాంతిని నెలకొల్పాలి
బయటి
వారు మార్పును సాధించలేరు. స్థానికులే మార్పును సాధించగలరు. గణనీయమైన మార్పు రావాలంటే
స్థానికుల అభిప్రాయాల ఆధారంగా అసమానతల సమస్యలను, గుర్తింపు, సామాజిక పగుళ్లను సునిశితంగా పరిశీలించాలి. శాంతి ఒప్పందాన్ని ఒక గోడలో ఇటుకల
లాగా పేర్చాలి. స్థానికులైన (పోరాడిన వారు, శాంతి నిర్మాతల) వారి
పని ఈ ఇటుకల చుట్టూ సిమెంటులాగా ఉంటుంది. సిమెంటు లేకపోతే గోడ నిలబడదు.
తరచుగా
అంతర్జాతీయ సంస్థలు సాంకేతిక దృక్పథంతో కొంతమంది అధికారులను కొంతమంది పోరాడేవాళ్లను
కలిసి వాళ్లతోనే వ్యవహారాలను నడిపిస్తారు. దేశంలో జరిగిన భయానక పరిస్థితులను విస్మరిస్తారు.
శాంతిని నెలకొల్పాలంటే అన్నీ స్థాయిల/రంగాల లోని అధికారులను, కింది స్థాయి వ్యక్తులను/ సంస్థలను, మతపరమైన సంస్థలను భాగస్వామ్యం చేయాలి. దేశంలోని సామాన్య పౌరులు, స్త్రీలు, యువత, వృద్ధులు, జాతి/నమ్మకం/సమూహాల నాయకులు అనగా సంక్షోభం వల్ల ప్రభావితమైన అందరినీ దేశ పునర్నిర్మాణ
దశలో పాల్గోనేటట్లు చేయాలి. వారి పాత్ర పూర్తిగా లేకుంటే శాంతిని నెలకొల్పే ప్రక్రియ
పైపై పూతగా ఉంటుంది.
3. శాంతిని నెలకొల్పే ప్రక్రియ ఐక్యమైన సామూహిక చర్యలుగా ఉండాలి
ఈ విషయంలో
ఐక్యరాజ్యసమితి ముందుగా ఆలోచించాలి. ముఖ్యంగా పౌరులను రక్షించటం, శాంతిని నెలకొల్పటం దాని ప్రధాన కర్తవ్యం. కానీ దాని నిర్మాణం
ఇప్పుడు ఈ ఆశయ సాధనకు సహకరించటం లేదు. ఒక వైపు వారి సిబ్బందికి స్థానిక సందర్భం మీద
అవగాహన లేకపోగా, ఇంకొక వైపు శాంతిని నెలకొల్పేందుకు వారికి సాంకేతిక
అవగాహన కూడా లేదు. దాతలు, దేశీయ బృందాలు, మిషన్ల సహకారంతో ప్రణాళికలను రచించే
సామర్థ్యం కూడా ఉండట్లేదు. వివిధ దశలలో వివిధ పాత్రధారుల మధ్య సమాచారం పంపిణీ కూడా
బలహీనంగా ఉంటోంది. శాంతిని నెలకొల్పే ప్రక్రియ బలంగా ఉండాలంటే, విజయవంతంగా జరగాలంటే అందరి మధ్య సహకారం గట్టిగా ఉండాలి.
మూలం: https://www.odi.org/publications/10757-why-peacebuilding-so-difficult-achieve
Comments
Post a Comment