Thought Economics- War & Peace- Part 9
శాంతి- ‘హా’ర్థిక ఆలోచనలు
భాగం-9
ఈ వ్యాసములో సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం
సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు
నలుగురు మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో
పాల్గొన్నారు. వారు:
1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్
2. డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది, విద్యావేత్త
3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ అధ్యక్షులు, క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)
4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ అధ్యక్షులు)
5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)
6. బెన్ ఫెరెఙ్క్జ్
( మాజీ ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం )
7. బెర్టీ ఆహార్న్ (మాజీ ఐరిష్ ప్రధాన మంత్రి)
వీరితో మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి
చర్చించి తెలుసుకుందాం.
ప్రశ్న 28: గొప్ప రాజకీయ, సామాజిక నాయకుల లక్షణాలు ఏవి?
లేక్ వాలేశా: ఈ ప్రపంచంలో
మార్పు తెచ్చిన ప్రతి ఒక నాయకునికి ఒకే ఒక ఆశయం ఉంటున్నది. వారి సమయం, శక్తులను అంతా ఆ సమస్యలను తీర్చటానికి
వినియోగిస్తారు. వారి లక్షణాల గురించి చెప్పలేము కానీ అది నాయకత్వం వహిస్తున్న సందర్భం మీద ఆధారపడి వుంటుంది. అంశమును బట్టి ఉదాహరణకు
కమ్యూనిజంను ఎదుర్కొంటానికి, వాతావరణ మార్పును పరిష్కరించటానికి
విభిన్న నైపుణ్యాలను వినియోగించవలసి వస్తుంది. ఒక్కోసారి అదృష్టం పాత్ర కూడా ఉంటుంది.
ప్రశ్న 29: శాంతిని నెలకొల్పటానికి ప్రజాస్వామ్యం ఎలా ఉపయోగపడుతుంది?
డాక్టర్ శిరీన్ యెబడి: ఒక సమాజంలో
శాంతిని నెలకొల్పాలంటే ప్రజాస్వామ్యం చాలా ముఖ్యం. అయితే ప్రజాస్వామ్యాన్ని స్పష్టంగా
నిర్వచించాలి. ఎన్నికలలో గెలుపే ప్రజాస్వామ్యం కాబోదు. చాలా మంది నియంతలు ప్రజాస్వామ్యంలో
ఎన్నుకోబడి అధికారంలోకి వచ్చారని గుర్తుంచుకోండి. కాబట్టి మానవ హక్కుల ప్రాతిపదికగా
ఉన్న ప్రజాస్వామ్యం లోకి అధికారం లోకి వచ్చి వుండాలి. ఎన్నికల కాగితాల ద్వారా, ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన పార్టీలకు న్యాయ సమ్మతి రాదు. వారికి ఓటు, మానవ హక్కులను గౌరవించుట ద్వారా చట్ట పరమైన అధికారం వస్తుంది. మనం మానవ హక్కుల
ఆధారిత ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకొన్నట్లైతే యుద్ధాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకుంటాము.
ప్రశ్న 29: సంఘర్షణ తర్వాత, పాలన విధమైన సంస్కరణలు, ప్రజాస్వామ్యాన్ని
వెంటనే నిర్మించాలా?
అధ్యక్షులు మార్టి అతిసారి: పాలనా
వ్యవస్థను వెంటనే నిర్మించలేము. అది వీలు కాదు. పరిశోధనలు ఏమి చెబుతున్నాయంటే ప్రపంచంలో
ఎక్కడా పరిపాలన వ్యవస్థలు సరిగ్గా లేవు. ఇది చాలా సుదీర్ఘ ప్రక్రియ. యుద్ధం జరిగిన
తర్వాత అధికారం లోకి వచ్చిన ప్రజలు – సాధారణంగా యుద్ధంలో గెలిచిన వారై యుంటారు. వారు
వారి స్నేహితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటారు. వారికి పెద్దగా విషయాలు తెల్వదు
కనుక వారు వృత్తి నిపుణులను వారి స్నేహితులకు
సహాయకులుగా నియమిస్తారు. బాగా పని చేసే వ్యవస్థలను నిర్మించటానికి చాలా డబ్బు ఖర్చయ్యింది
కానీ ఫలితాలు మటుకు చాలా తక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి. సింగపూర్ స్థాయికి ఊత్తర
కొరియా, సియెరా లియోన్, సోమాలియా, రష్యా, వెనెజూలా చేరుకోవాలంటే 350-500 సంవత్సరాలు పట్టవచ్చును.
గట్టిగా చెప్పాలంటే అవి చేరుకోలేక పోవచ్చును.
ప్రశ్న 30: సంస్కృతి, మతాలకు శాంతిని నెలకొల్పటంలో పాత్ర ఏమిటి?
డాక్టర్ శిరీన్ యెబడి: అన్నీ
సంస్కృతులను అర్థం చేసుకోవడం మానవ గౌరవాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. మానవ గౌరవం
శాంతికి బాటలు వేస్తుంది. నేను పాటించే సంస్కృతినిగానీ, మతాన్ని గానీ గౌరవించని సమాజంలో నేను
నివసిస్తున్నట్లైతే, నాకు ఆ సమాజంలో గౌరవం లేనట్లే.
లేక్ వాలేశా: మా శాంతి
ప్రయత్నాలలో మతం చాలా ముఖ్యమైన భాగం. సంగీత, చిత్రలేఖనం, మతం, సంస్కృతి ప్రజలను ఏకం చేస్తాయి. వాళ్లందరినీ ఒకేలా
ఆలోచించేలా తోడ్పడతాయి. ప్రజలు ఏకమైనప్పుడు వారు ఏది కావాలంటే అది నిర్మించుకుంటారు.
ప్రశ్న 31: శాంతికీ, భద్రతకు ఏమన్నా తేడా ఉందా?
ప్రొఫెసర్ జోడీ విలియమ్స్: ఎప్పుడూ
హింస జరిగేటప్పటి కంటే సుస్థిర శాంతి ద్వారా ఎక్కువ భద్రత కలుగుతుంది. హింస మరింత హింసను
ప్రోత్సహిస్తుంది. అమెరికా ఎక్కడైతే గతంలోనూ, ఈ మధ్యలోనూ దాడి జరిపిన
చోట్లనుండి ప్రతి స్పందన ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? రోజు వారీ
జీవన భద్రత నుండి దేశ భద్రత గురించి మనకు మెరుగైన అవగాహన వస్తుంది. ప్రజలు సామాన్యంగా
భద్రతతో కూడిన భవిష్యత్తును, ఆదాయ భద్రతను కోరుకుంటారు. ప్రజలు
సామాన్యంగా తమ రోజు వారి జీవితాన్ని గురించి ఆలోచిస్తారు, అంతే
కానీ అల్ ఖాయిదా గురించి ఆలోచించరు. అత్యధిక ప్రజలకు వారికి కావలసిన కనీస అవసరాలను
ఏర్పాటు చేస్తే ప్రపంచంలో భద్రత ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలోని అసమానతలు కూడా తగ్గిపోతాయి.
ఇంకా ఉంది
https://peacesimplified.blogspot.com/
మూలం:
https://thoughteconomics.com/war-and-peace/
రచయిత: వికాస్ షా
Comments
Post a Comment