What went wrong after World War 1?
మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత విఫలమైన శాంతి నుండి ఏం నేర్చుకున్నాము?
యుద్ధం వెనక ఉన్న క్లిష్టమైన మూలాలను పట్టించుకోక పోవడము శాంతి
చర్యల ఫలితాలను పరిమితం చేస్తాయి.
వెర్సై ఒప్పందం జరిగి 100 సంవత్సరాలు అయ్యింది. ఈ ఒప్పందం వలనే జర్మనీ, మిత్ర పక్షాల మధ్య
యుద్ధం అధికారికంగా ఆగింది.
అయితే ఈ ఒప్పందం వలన మేలు కంటే కీడే ఎక్కువ జరిగింది. ఈ ఒప్పందం శాంతిని నెలకొల్పటం
కంటే రెండో ప్రపంచ యుద్ధానికి ఎక్కువ దారి తీసిందనే చెప్పవచ్చును. దీనికి చాలా
కారణాలు ఉన్నాయి. తమ అన్నీ సైన్య శాఖలను విపరీతంగా తగ్గించుకోవటానికి, తమ భూభాగాన్ని 13
శాతం తగ్గించటానికి, తమ కాలనీలను పూర్తిగా కోల్పోవటానికి, శిక్షించేటట్లు ఉన్న పరిహారాలను చెల్లించేందుకు,
అన్నింటికి మించి యుద్ధం మొత్తానికి తామే బాధ్యత తీసుకోటానికి ఏ సార్వభౌమ దేశమైనా ఎన్నటికీ ఒప్పుకోదు.
అన్నింటిలో ముఖ్యంగా పరిహారాలను చెల్లించటమనేది సమిష్టి జర్మనీని
బాగా దెబ్బ తీసింది. “యుద్ధ పశ్చాత్తాప నిబంధన” గా జర్మనీలో పేరుపొందిన ఈ నిబంధన
నియంతృత్వ నిబంధనగానే భావించబడినది. జర్మనీ ప్రతినిధుల బృందానికి పారిస్ లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జర్మన్లు సంతకం
చేయకపోతే దాడి చేస్తామని బెదిరించారు. కనుకనే ఈ నిబంధన, అక్రమ శాంతి
ఒప్పందానికి గురి చేశారని, దాని వలన వచ్చే కోపం, కుడి, ఎడమలా అతి వాదానికి దారి తీసి నాజీలు, బొల్శెవిక్ లు పెరగటానికి ఆజ్యం పోశాయి.
వెర్సై ఒప్పందం తర్వాత ఈ తీవ్ర వాదం రాకుండా ఆపగలిగే పరిస్థితి
ఉంది. 1923 లో జర్మనీ అధిక ద్రవ్యోల్బనాన్ని అనుభవించింది. అప్పుడే ప్రజా
స్వామ్యంగా ఎన్నుకోబడిన జర్మన్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నించాడని యువ
అడాల్ఫ్ హిట్లర్ ను జైలుకు పంపించారు. 1920 లలో ఎన్నో ఆశావాద సంఘటనలు జరిగాయి.
ఫ్రాన్స్- జర్మనీ సరిహద్దులకు సంబంధించి జరిగిన , 15 దేశాల మధ్య
1928 లో జరిగిన కెల్లాగ్ బ్రేయాండ్
ఒప్పందాలు ముఖ్యమైనవి. ఇవన్నీ వెర్సై ఒప్పందాన్ని నిలబెట్టటానికి, జర్మనీని అంతర్జాతీయ శాంతి పరిధిలోనికి తీసుకు రావటానికి పనికి వచ్చేవే.
1919 లో శాంతి ఒప్పందాన్ని తీర్చి దిద్దేవారిని తిట్టుకునే ముందు
మనం ఆ ఒప్పందం రెండు యుద్ధ పక్షాల మధ్య జరిగిందని గుర్తించాలి. తర్వాత ప్రపంచంలో
వచ్చిన మార్పులు ఊపిరి తీయలేనివి. జర్మనీ, ఆస్ట్రో-హంగరీ, రష్యన్
సామ్రాజ్యాలు కుప్ప కూలాయి. ఆ తర్వాత వచ్చినవి తేలికగా చీలిపోయే బలహీన ప్రజా
స్వామ్యాలు. వీటన్నింటి మధ్య స్పర్థలు
ఉంటూనే ఉన్నాయి.
ఈ వాతావరణంలో కొత్తగా ” నానా జాతి సమితి” ని ఏర్పాటు చేసిన పారిస్
శాంతి కాముకులను అభినందించాల్సిందే. ఈ సమితి ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ స్పర్థలను
నిర్వహించటం, న్యాయపరంగా తీర్పు చెప్పటం. అమెరికా ఈ వ్యవస్థ బయట ఉండటం ఈ ఒప్పంద కారుల
తప్పు కాదు. తక్కువ వనరులతో ఈ సమితి నిలచిన కొద్ది కాలము,
కొన్ని మంచి/ గట్టి దౌత్యపరమైన నిర్ణయాలు
తీసుకుంది. ఫిన్లాండ్- స్వీడెన్ మధ్య,
దామ్జిగ్ పట్టణం విషయంలోనూ, తూర్పు యూరోప్ లో అనేక దేశాలకు
ఆర్థిక వ్యవస్థలు రూపొందించుటలోనూ మంచి పనులు చేసింది.
అయితే వెర్సై ఒప్పందం జర్మనీ పై విధించిన మానసిక నష్టం ముందు ఇంతకు
ముందు పేర్కొన్న లాభాలన్నీ దిగదుడుపు అయ్యాయి. 100 సంవత్సరాల క్రితము జర్మనీ
బృందము పారిస్ వచ్చినప్పుడు చేసింది ప్రాయశ్చిత్తము కాదు, కేవలం తిట్లు
తినడమే వారికి జరిగింది. యుద్ధం
మొత్తానికి వారే జవాబుదారీ అన్నట్లు వారిని చూశారు.
అడాల్ఫ్ హిట్లర్ దీనిని సాకుగా తీసుకుని వెర్సైల్లెస్ ఒప్పందం
నుండి జర్మనీకి విముక్తి కల్పించే
ఉద్దేశముతో తన రాజకీయ ప్రచారం చేశారు. పరిహారాలను చెల్లించడం వలన తమ ఆర్థిక
వ్యవస్థ కుప్పకూలడం కారణం వలన ఆయన అధికారం లోకి వచ్చారు. జర్మనీ సైన్యాన్ని బలపరచి, రైన్ లాండును, ఆస్ట్రియాను తమ లోకి కలిపేశారు. ఈ ఆక్రమణలు,
పరిహారాలను నిలుపుటలు వెర్సై ఒప్పందం కు వ్యతిరేకమే.
చరిత్రను తిరగ రాయాలనే ఉద్దేశంతో 1941లో యుగోస్లేవియాను ఓడించిన
తర్వాత బోస్నియా రాజధానిని ప్రవేశించి వ్యాపార హక్కును సంపాదించారు. దానితో “దక్షిణ శ్లావులు”
మళ్ళీ పరాయి పాలనలోకి వచ్చారు. ఈ చర్యలతో యుద్ధ మేఘాలు మరలా కమ్ముకున్నాయి.
జర్మనీ మీదే మొత్తం నింద వేయడం వలన జరిగిన నష్టాన్ని చూశాం కదా!
ఈసారి ఇరాన్ లో కానీ, చైనాపై గానీ
అమెరికా చర్యలు తీసుకుంటున్నప్పుడు ఈ
ఉద్రిక్తతలకు ఎవరు దారి తీశారని లెక్కలు వేయడం మంచిది.
మూలం: https://www.washingtonpost.com/outlook/2019/06/27/what-we-can-learn-failed-peace-world-war-i/
Comments
Post a Comment