TWO Countries: Two lives

రెండు దేశాలు: రెండు జీవితాలు


టాటా ఎలెక్ట్రిక్, టాటా కన్సల్టెన్సీ వంటి దిగ్గజ సంస్థలకు నాయకత్వం  వహించటమే కాకుండా ఆధునిక భారత నిర్మాణానికి ఫకీర్ చంద్ కోహ్లీ   ఎంతో సహకారం అందించారు. వారి జీవితాలను సింహావలోకనం చేసుకున్న సందర్భంలో ఆయన, ఆయన భార్య స్వర్ణ్ కొహ్లి, మన వివాదాస్పద పక్క దేశమైన పాకిస్తాన్ తో వారి అనుబంధాన్ని ఇక్కడ పంచుకున్నారు.  


FCగా పేరు పొందిన ఈయన ఇప్పటి పాకిస్తాన్ లోని రావల్పిండి లో జన్మించారు. అమ్మది సేథీ ల వంశం. వాళ్ళ వంశంలో అందరూ కాంగ్రెస్ లో నాయకులు మాత్రమే కాకుండా ధనిక వర్గాలకు చెందిన వారే. అలాగే వారు స్వాతంత్ర్య పోరాట యోధులు కూడా.

FC పెషావర్ లో పెరిగారు. పెషావర్ పెద్ద సైనిక కేంద్రం. ఎక్కువ బ్రిటిష్ సైనిక అధికారులు అక్కడ ఉండేవారు. బాల్యంలో విద్యాభ్యాసం పెషావర్ లోనే జరిగింది. లాహోర్ లో పట్టభద్రులయ్యారు. హిందువులు, ముస్లిములు కలిసి అక్కడ చదువుకునేవారు.

“నేను చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు నాన్న చనిపోయారు, అది నాకు పెద్ద దెబ్బ.నేవీ లో చేరదామని ప్రయత్నిస్తే నాకు అవకాశం వచ్చింది. అదే సమయంలో కెనడా లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ చదివేందుకు స్కాలర్ షిప్ వుండే ఒక ప్రకటన నా దృష్టిలోకి వచ్చింది. దరఖాస్తు చేయగా ఆ అవకాశం కూడా నాకు వచ్చింది. నేవీ వదలి కెనడాకు వెళ్ళాను.    


 

మాకు పెషావర్ లో వ్యాపారం ఉండేది, అందులో వందల కొద్దీ ఉద్యోగులు పని చేసేవారు. మాది పెద్ద విలాసవంతమైన ఇల్లు. 1946 లో నేను సంయుక్త/అవిభక్త  భారత్ ను వదలి కెనడా చేరుకున్నాను. MIT లో చదివిన తర్వాత కొద్ది కాలం జనరల్ ఎలక్ట్రిక్ లో పని చేసి 1951 లో ఇండియా తిరిగి వచ్చే సమయానికి భారత్ విడిపోయింది. ఈ విభజన వలన మా కుటుంబానికి పెద్ద దెబ్బ తగిలింది . ఇంతలో నాకు టాటా నుండి ఉద్యోగ అవకాశం వచ్చింది. అందుకు నేను ఇండియాకు వచ్చి ఇక్కడే ఉందామనుకున్నాను. 

జనవరి 1947లో సమస్యలు ప్రారంభమైనప్పుడు, నా సోదరుని కుటుంబాలు సెలవులకై ముస్సూరీ (వ్యాపార శాఖ అక్కడ ఉంది) వెళ్లారు. మా అమ్మతో పాటు సోదరుడు కూడా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. అక్కడి స్థానిక గవర్నర్ సోదరుని ఇంటికి వచ్చి, పెషావర్ వెళ్లిపొమ్మని సూచించి రెండు టికెట్లు కొని చూపించారు. మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు. కానీ తర్వాత మరెప్పుడైనా రావచ్చని నచ్చ చెప్పిన తర్వాత తన నగల కోసం వెళ్ళేందుకు ఒప్పుకుంది. తక్షణమే బయలుదేరి వెళ్లారు.

1970 లలో నాకు పాకిస్తాన్ మరొకసారి సందర్శించెందుకు అవకాశం లభించింది. ఆ సమయంలో నేను రీజియన్ టెన్ అనే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సంస్థకు డైరెక్టర్ గా ఉండేవాడిని. జపాన్ నుండి మిడిల్ ఈస్ట్ వరకు పాకిస్తాన్ తో సహా నా భూభాగంలో ఉండేది. నాకు పాకిస్తాన్ వెళ్లాలని ఉండేది కాదు. అయినా సరే నేను పాకిస్తాన్ వెళ్ళాను, లాహోర్, రావల్పిండిలో సమావేశాలకు హాజరయ్యాను. కానీ పెషావర్ వెళ్ళి ఇల్లు చూడాలని ఉండేది. నా భార్య కూడా నాతో పాటు వచ్చి సమావేశాలకు హాజరయ్యింది. తన బాల్యం ఎక్కువగా రావల్పిండి లో జరిగింది కాబట్టి తనకు కూడా తన ఇల్లు సందర్శించాలనే కోరిక ఉండేది.”

 

స్వర్ణ్ కొహ్లీ:

“నేను రావల్పిండిలో జన్మించాను, మా తాత గారు  సుప్రసిద్ధ న్యాయవాది. మా నాన్న గారు చక్కెర సాంకేతిక నిపుణులు. పెద్ద అన్నయ్య న్యాయవాది, తమ్ముడు బీమా రంగంలో ఉండేవారు. సంవత్సరానికి రెండు సార్లు రావల్పిండిలో అందరం కలిసేవాళ్లం.

 తిరిగి రావల్పిండికి

నా భర్త FCకు పాకిస్తాన్ ను సందర్శించే అవకాశం వచ్చింది. తనకు ఇష్టం లేకున్నా మేమిద్దరం వెళ్లాము. సమావేశం ఒక రోజు కరాచీలో, ఒకరోజు ఇస్లామాబాదులో, రెండు రోజులు లాహోర్ లో జరిగాయి. ఇస్లామాబాద్ నుండి రావల్పిండి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నాతో పాటు మిగతా ఆడవాళ్ళు కూడా రావాలని అనుకున్నారు.  ముందుగా పిండిలోని “కంపెనీబాగు”కు (ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసిన తోట)కు వెళ్లాము. మా ఇల్లు దీనికి ఎదురుగానే. ఇప్పుడు దీన్ని లియాకట్ ఆలీ బాగ్ అంటారట. నాకు అన్నీ గుర్తుకు రావటం ప్రారంభమయ్యింది. మా నాన్న గోర్దన్ కళాశాలలో ఉండేవారు. మా ఇల్లు కళాశాల పక్కనే. తీరా వెళితే మా ఇల్లు కనపడలేదు. మేము కిర్పా రామ్ సాహ్నీ ఇంటికి వెళ్లాము. ఆ ఇంటి సంరక్షకురాలు  మేము ఇండియానుండి వచ్చామని గుర్తించారు.  తమ ఇంటి యజమాని ఒక ఆడ డాక్టరని, ఆసుపత్రికి వెళ్లిందని చెప్పారు. ఆవిడ హోలీ ఫామిలీ ఆసుపత్రిలో పని చేస్తుందని చెప్పగానే మేము అక్కడే పుట్టామని గుర్తుకొచ్చింది.


ఆ ఇంటి సంరక్షకురాలు మాకు తేనీరు, బిస్కట్లు అందించింది. మా ఇల్లు గురించి చెప్పగానే  .ఆ రంగురంగు అద్దాల ఇల్లా? అని అడిగింది. అవునని చెప్పగానే ఆ ఇల్లును పడగొట్టి పెద్ద హోటలు కట్టారని చెప్పింది. ఇది నన్ను తీవ్రంగా నిరాశపరిచింది.


సాయంత్రం సమావేశ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం చర్చకు రాకుండా చూసుకున్నాను. అయితే ఒక మిత్రుడు తాను కూడా మా ఇంటిలో కొంత కాలం ఉన్నామని, తర్వాత 25 సంవత్సరాలు విదేశాలకు వెళ్లామని చెప్పారు. ఆయన బంధువులు ఒకరు డాక్టరని, వారి ఇల్లే మేము చూసిందని తెల్సింది.

తర్వాత రోజు వారి డాక్టరు బంధువు మాకు ఫోన్ చేసి నాతో మాట్లాడింది. తనకు కూడా మా ఇల్లు గురించి తెలుసంది. మా ఇంట్లో నివసించిన కుటుంబం సభ్యులు వెళ్లిపోగానే మిగిలిన వారు దానిని హోటలుగా మార్చారని చెప్పింది. మరలా రావల్పిండి వచ్చినప్పుడు తన  ఆతిథ్యం తప్పక తీసుకోవాలని చెప్పింది.

పెషావర్ సందర్శన

తదుపరి సంవత్సరం మేము మరలా సమావేశం కొరకు నా భర్తతో పాటు మరలా పాకిస్తాన్ వెళ్ళేందుకు, పెషావర్ వెళ్ళేందుకు అవకాశం వచ్చింది. మేము వెళ్లాము. ఆ ఇల్లు పెద్ద, పెద్ద స్థలంలో ఉంది, కానీ అక్కడ చాలా దుకాణాలు వచ్చాయి. దానిని ఒక మాల్ లాగా తీర్చిదిద్దారు. కొంత మంది కిర్పా రామ్ & బ్రదర్స్ గురించి విన్నామని, అంతగా తెలియదని చెప్పారు. తమతో భోజనం చేయమని వారు కోరారు. మేము సున్నితంగా నిరాకరించాము. మరికొంత మంది కూడా మమ్ములను భోజనానికి ఆహ్వానించారు.

మేము వెళ్ళిన చివరిది ఒక ఆడవాళ్ళ శాలువాల దుకాణం. FC నన్ను శాలువా కొనుక్కోమని కోరారు. నా దగ్గర చాలా శాలువాలు ఉన్నాయని చెప్పాను. దుకాణదారు కూడా “ మీరు మీ మెట్టినింటికి వచ్చారు కదా, శాలువా తీసుకోండి” అన్నారు. నేను విభజన తర్వాత పెళ్లి చేసుకున్నాను అలాగే మెట్టినింటికి వెళ్లలేదు అప్పటిదాకా! అయితే దుకాణదారు డబ్బు తీసుకుంటానికి  నిరాకరించారు.  ఒప్పించి 10% డబ్బులిచ్చి మేము బయటపడ్డాము. అక్కడ దుకాణదారులందరూ అందరూ మాకు వీడ్కోలు చెప్పారు.  మేము ఇండియా నుండి వచ్చామని తెలిసినా మా దగ్గర డబ్బులు ఆశించలేదంటే వారు మంచివారని తెలుస్తోంది.

తర్వాత సంవత్సరం మేము మళ్ళా పాకిస్తాన్ వెళ్లినప్పుడు లాహోర్ ను సందర్శించాము. మిత్రులు లుఫ్తుల్లా గారు మాకు స్వాగతం చ్ప్పారు. మేము లాహోర్ నుండి పిండీ కి విమానంలో వెళ్ళాం. లుఫ్తుల్లా గారి డాక్టరు  చుట్టాలింటికి వెళ్లాము. అక్కడ అల్పాహారం తీసుకుని టాక్సీలో పెషావర్ వెళ్లాము. వారితో సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయి.

26/11 తర్వాత లుఫ్తుల్లా గారు ఫోనీ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మీ గురించి ప్రార్థనలు చేస్తామన్నారు. “

మూలం: https://seniorstoday.in/history/two-countries-two-lives/

https://peacesimplified.blogspot.com/


Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War and Peace- Part 7

Thought Economics- War & Peace- Part 9