Thought Economics- War & Peace part 6

శాంతి- హార్థిక ఆలోచనలు

భాగం-6

ఈ వ్యాసములో సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల   ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు నలుగురు  మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో పాల్గొన్నారు. వారు:

1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్

2. డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది, విద్యావేత్త

3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ  అధ్యక్షులు, క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)

4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ  అధ్యక్షులు)

5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)

6. బెన్ ఫెరెఙ్క్జ్  ( మాజీ  ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం )

7. బెర్టీ ఆహార్న్ (మాజీ  ఐరిష్ ప్రధాన మంత్రి)

వీరితో మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి చర్చించి తెలుసుకుందాం.

 

 

ప్రశ్న 16:  క్షమించడము అంటే ఏమిటి?

మారినా కాంతకుజినో: ప్రతి ఒక్కరూ క్షమించడాన్ని విభిన్న కోణాలలో ముఖ్యంగా తమ వ్యక్తిగత కోణంలో  చూస్తారు కనుక ఈ ప్రశ్నకు సమాధానమివ్వడం కొంచెం కష్టమే. క్షమార్హం యొక్క పరిమితి, అవకాశాలు అనేవి  సందర్భం, విషయం మీద  ఆధారపడి యుంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే మనం మార్చలేని విషయాలపై శాంతిని కుదుర్చుకొనటమే క్షమించడం. అయితే ఇది అసంపూర్ణమే. ఎందుకంటే క్షమించాలంటే సహానుభూతి, అధిక ఉత్సాహం రెండు పక్షాలలో ఉండాలి. జరిగిన నష్టాన్ని, గాయాన్ని శాంతపరచే శక్తి కలిగినదే క్షమాగుణం.

అయితే దీనిలో ఎన్నో ఊహలు, భావనలు, సిద్ధాంతాలు ఉంటాయి. ఇతరుల తప్పులను  క్షమించడం ఒక బలహీనమైన లక్షణంగా కొంతమంది భావిస్తారు. అయితే దీనినే ఒక మానసికంగా బలమైన చర్యగా, నైతికంగా సర్వోన్నతమైనదిగా  భావించే వారు కూడా ఉంటారు. అయితే క్షమించదమనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఘర్షణ తాలూకు అసహనాలు, కోపతాపాలు మనలను పీడిస్తూ ఉంటాయి. క్షమించకుండా కూడా ముందుకు వెళ్లొచ్చనే వారు ఉంటారు. అయితే క్షమించడమనేది ఒక మానసిక స్థితి అనేది నా భావన. క్షమించాము అని చెప్పి పగతీర్చుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ఎన్నటికీ క్షమించను అని చెప్పి గతాన్ని మార్చి పోయే అవకాశం కూడా ఉంది. క్షమించడమనేది ఒక బాధ నిర్వహణ వ్యూహంగా మనం పరిగణించవచ్చును, ప్రతీకార వలయం నుండి బయటపడేసే చర్యగా కూడా మనం భావించవచ్చును. విరిగిన హృదయాలను కలపడటమే కాకుండా, ముక్కలైన బంధాలను అతుకుతుంది. క్షమించడం మనకు ఒక తీర్మానాన్ని, నిర్ణయాన్ని, స్వేచ్ఛను ఇస్తుంది. భవిష్యత్తును గతం ప్రభావితము చేయకుండా కాపాడుతుంది.

 

         

ప్రశ్న 17:  క్షమించడము ప్రక్రియను ఎలా ప్రారంభిస్తారు?

మారినా కాంతకుజినో: నిర్ణయాత్మక క్షమాగుణం, భావాత్మక క్షమాగుణం అనేవి ఉంటాయి. బాధను నివారించే ఇతర చర్యలెవీ పని చేయనప్పుడు, క్షమించదమే ఒక ఎంపిక అవుతుంది. ఒకరన్నట్లు “ నేను ఇంకొకరిని క్షమించకపోతే నన్ను నేనే అంతం చేసుకోవాల్సి వచ్చేది.” ఇక్కడ నేను క్షమించే గుణం యొక్క ఐదు లక్షణాలను పేర్కొంటున్నాను:

1.     1. స్వీయ అవగాహన: మనిషిలో  ఉండే చీకటి భాగాలు: భయం, కోపం, సిగ్గు, దుఖం – వీటి నుండి పారిపోకుండా ఉండటం చాలా ముఖ్యమైనది. మనలో ఉన్న చీకటిని గురించి మనం తెలుసుకుంటే ఇతరుల చీకటి గురించి మనకు అవగాహన కలుగుతుంది. కాబట్టి మనలను మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం.  

2.     2. కుతూహలము/ఆసక్తి: ఇది చాలా ముఖ్యమైన అంశం. మన ఊహలను “ఎందుకు?” అని ప్రశ్నిస్తుంది. క్షమించేటప్పుడు మనస్సు బాహ్యంగా ఆలోచించాలి. అప్పుడు మన దృక్కోణాలు విశాలంగా అయ్యి, తప్పొప్పులకు దూరంగా ఆలోచింపచేస్తుంది.

3.     3. సహానుభూతి: కుతూహలం అవగాహనకు దారితీస్తే, అవగాహన సహానుభూతికి దారి తీస్తుంది. ఎదుటి మనిషి చర్మంలోకి ప్రవేశించి, దేహం అంతా తిరిగితే గాని వారిని అర్థం చేసుకోలేము.

4.   4.   పగ, ఆగ్రహాలను వదలివేయుట: ప్రతీకారాన్ని తీర్చుకోటానికి గల కారణాలను వదలి, నీ చీకాకులు, సాకులను వదలివేయాలి.

5.   5.   అర్థవంతం: నీవు పడిన ఇబ్బందులు, బాధలకు ఒక ప్రయోజనం, ప్రాముఖ్యతలను ఆపాదించుకోవాలి. ఎక్కడైతే గాయాలున్నాయో అక్కడే బహుమతి ఉంటుంది అనే నానుడి ఊరికే లేదు. పగ, ప్రతీకారాల బాట నుండి జీవితానికి పెద్ద ప్రయోజనం వెతికే ఆలోచనల నుండి క్షమాగుణం పుడుతుంది. ఈ ప్రయోజనం మరలా మనకు జీవితాన్ని, విశ్వాసాన్ని, సమాజం పట్ల అనురాగాన్ని కలగచేయాలి.         

 

ప్రశ్న 17:  కొన్ని చర్యలు క్షమార్హం కావా?

మారినా కాంతకుజినో: క్షమాగుణం చాలా వివాదాలతో కూడిన గుణం. చాలా వరకు వ్యక్తిగతం కూడా. కొన్నిసార్లు షరతులతో కూడినది. కొంతమంది సారీ చెప్పించుకుని క్షమిస్తారు. క్షమాగుణం ఆత్మ స్వస్థత చేకూర్చి,  స్వాధికారత చేకూర్చే సాధనం. అయితే ఒకరికి క్షమార్హం కానిది ఇంకొకరికి కావచ్చును.   

ఒకరు (ఏవా కోర్) నాజీ డాక్టర్ల గురించి ఇలా అన్నారు: “ వాళ్ళకు అర్హత ఉందని కాదు, నాకు అర్హత ఉందని నేను క్షమిస్తున్నాను." క్షమించుట అనేది కేవలం స్వయంగా స్వస్థత చేకూర్చేందుకు, స్వాధికారత చేకూర్చేందుకు సహకరిస్తుంది. అది ఒక అద్భుతమైన ఔషధం. అది ఉచితము, ఎటువంటి ఉప ప్రభావాలు (side effects) ఉండవు. ఫ్రెంచ్ వేదాంతి జాక్స్ డేరిడా అన్నట్లు క్షమించలేక పోవడాన్ని క్షమించడమే పెద్ద తప్పు. ఎప్పటికీ అర్థం చేసుకోలేని, వదలివేసిన తప్పులను మనం ఎప్పటికీ పరిష్కరించలేము.     

ప్రశ్న 18:  ప్రతీకారానికి ప్రత్యామ్నాయం క్షమాగుణమా ?

మారినా కాంతకుజినో: ఉత్తర ఐర్లాండులో IRA బాంబు వేసినప్పుడు తల్లిని కోల్పోయిన జూడ్ వైట్ ఇలా అన్నది: “నా తల్లి హత్యకు ప్రతీకారం నా క్షమాగుణమే! ఎందుకంటే అది నాకు శక్తినిస్తుంది.” దీన్నిబట్టి క్షమాగుణం ప్రతీకారం కావచ్చని తెలుస్తున్నది. కొంతమంది నేరస్తులు వారు చేసిన నేరాలతో ఉక్కిరిబిక్కిరి చేసి అదే బంధాలలో ఉంచాలని చూస్తారు, క్షమాగుణం ఆ బంధాలను తెంచేస్తుంది. ఒక సామూహిక హత్యోదంతంలో తన ఆరేళ్ళ బిడ్డను కోల్పోయిన స్కార్లెట్ లెవీస్ ఇలా అంటుంది ”ఒక పెద్ద కత్తెరతో నా బంధాలను తెంచేసి, నాకు ఒక శక్తిని క్షమాగుణంతో  ఇచ్చినట్లుంది”. ఒకరిని క్షమించిన తర్వాత వారు నా బుర్రను స్వాధీనం చేసుకోవటం మానేసినట్లుంది. “ నీ శత్రువులను క్షమించేయి. అంతకంటే వేరొకటి మరింత బాధపెట్టదు” అని ఆస్కార్ వైల్డ్ అన్నారు.     

లేక్ వాలేశా:  క్షమాగుణం ఒక అందమైన చర్య, కానీ దానిని చేయటం అంత సులభం కాదు. కొన్నిసార్లు ప్రజలు ఎక్కువ హింసను అనుభవించారు, కుటుంబాలను, ఇళ్లను, ఆరోగ్యాలను   కోల్పోయారు.  క్షమించమని వాళ్ళను కోరటం అంత సులభం కాదు. కొన్నిసార్లు ప్రతీకారం తీసుకోకపోవటం కూడా క్షమాగుణంగా భావించాలి.   

 

ఇంకా ఉంది

https://peacesimplified.blogspot.com/

మూలం:

https://thoughteconomics.com/war-and-peace/

రచయిత: వికాస్ షా


Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War & Peace- Part 9

Thought Economics- War and Peace- Part 7