Thought Economics- War & Peace- Part 3

శాంతి- హార్థిక ఆలోచనలు

భాగం-3

ఈ వ్యాసములో  సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల   ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు నలుగురు  మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో పాల్గొన్నారు. వారు:

1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్

2. డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది, విద్యావేత్త

3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ  అధ్యక్షులు, క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)

4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ  అధ్యక్షులు)

5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)

6. బెన్ ఫెరెఙ్క్జ్  ( మాజీ  ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం )

7. బెర్టీ ఆహార్న్ (మాజీ  ఐరిష్ ప్రధాన మంత్రి)

వీరితో మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి చర్చించి తెలుసుకుందాం.

 

ప్రశ్న 3: ఘర్షణ, హింస మానవ నైజము లో భాగమా?

డాక్టర్ శిరీన్ యెబడి: దాడి, అసూయలు   ఎలాగైతే మానవుల్లో ఇమిడి ఉన్నాయో, హింస, యుద్ధం కూడా అలాగే ఉన్నాయి. విద్య, శిక్షణల  ద్వారా లోన ఇమిడి వున్న ఈ సంచలనాల్ని అదుపులోకి తేవచ్చును, నివారించవచ్చును. దురదృష్టవశాత్తూ ప్రస్తుత ప్రపంచంలో చరిత్ర పాఠాలు యుద్ధాలను కీర్తిస్తున్నాయే గానీ ఖండించుట లేదు. ప్రస్తుత పరిస్థితి మార్చాలంటే పాఠశాల విద్య స్థాయి నుండే మార్పులు మొదలు పెట్టాలి.

అధ్యక్షులు మార్టి అతిసారి: ఘర్షణ, హింసలు  మానవ నైజంలో భాగం కాకుంటే మనం ఈ ఘర్షణలు, కొట్లాటలు, యుద్ధాలు  చూసే వాళ్ళం కాదు. అయితే ఘర్షణలకు కొన్ని వ్యావహారిక కారణాలున్నాయి. కొంతమంది తమ భూమిని, నీరును వాతావరణ మార్పుల ద్వారా లేదా దురాక్రమణల ద్వారా  కోల్పోయి ఉండవచ్చును. ఆయుధాలు పట్టటమే దీనికి పరిష్కారం కాదు కానీ అలా ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవచ్చును.  

ప్రశ్న 4: సాధారణ మనుషులు ఈ దుర్మార్గాలు ఎలా చేస్తారు ?

బెన్ ఫెరెఙ్క్జ్: యుద్ధమనేదే చట్ట విరుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులు యుద్ధాన్ని సాధారణంగా లెక్క పెట్టె వారు కాదు, ఎందుకంటే వారికి వారి ప్రాణం మీద తీపి ఎక్కువ. ఆ పరిస్థితుల్లో వారిని కట్టి పడెసే నిబంధనలు పెద్దగా ఉండవు కనుక వారికి తోచినట్టు చేస్తారు. అది ఎదుటి దేశ సైనికుల్ని చంపటమే కాకుండా, మహిళలను బలాత్కరించటం కూడా వుంటుంది. బలాత్కారం లేకుండా యుద్ధం గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. ఎందుకంటే మామూలు సమయంలో ఉన్న సామాజిక నియమాలు యుద్ధ సమయంలో వర్తించవు కనుక.

కనుక చట్టబద్ధమైన సమాజం కావాలంటే చట్టాలు చేయాలి కానీ యుద్ధాలు కాదు.   

 

ప్రశ్న 5 : ఘర్షణను కానీ యుద్ధాన్ని కానీ ఎప్పుడైనా సమర్థించవచ్చా?

ప్రొఫెసర్ జోడీ విలియమ్స్: మనం సిరియా యుద్ధాన్ని గమనిస్తే అక్కడ సిరియా రసాయనిక ఆయుధాలను వాడింది. కానీ అమెరికా ఆ సాకును చూపించి తన హద్దులను దాటింది. వారికి వేరే మార్గం లేదా? మధ్య తూర్పు, ఉత్తర ఆఫ్రికా, లిబ్యా, యెమెన్, సోమాలియా, ఇరాక్ దేశాల సమస్యలలో అమెరికా పాత్ర అనుమానాలను, సందేహాలను రేకెత్తిస్తోంది. ఆయా ప్రాంతాలతో సంబంధం ఉన్నవాళ్లు అమెరికాది  దురాక్రమణ గానే, ఎటువంటి నైతికత లేనిదిగానే  చూస్తారు.  

డాక్టర్ శిరీన్ యెబడి: నా జీవితంలో ఇంతవరకు సమర్థించ తగ్గ యుద్ధాన్ని నేను చూడలేదు, నా దృష్టికి రాలేదు. గత 20 సంవత్సరాలు గమనిస్తే ఎక్కడైనా యుద్ధం జరిగితే ఆ ప్రాంతంలో మరలా అక్కడ శాంతి రాలేదు. ఉదాహరణకు ఇరాక్, లిబ్యా, ఆఫ్ఘనిస్థాన్  

అధ్యక్షులు మార్టి అతిసారి: తమను తాము కాపాడుకోటానికే అయితే యుద్ధాన్ని సమర్థించ వచ్చును. నా దేశంలో నేనే స్థాన భ్రంశము పొందినవాడిని. సోవియట్ యూనియన్ ఫిన్లాండు పై దాడి చేసినప్పుడు నాకు రెండేళ్ల వయసు. మేము 11% భూమిని కోల్పోయాము. మా కుటుంబంతో కలిపి 4 లక్షల మంది ఫిన్లాండులోని వేరే ప్రదేశానికి మేము వలస పోవాల్సి వచ్చింది. అది మా హక్కు. మా తోటి దేశాలు అలా చేయలేక పోయాయి. మిమ్మల్ని మేము రక్షించుకున్నామని నాకు గర్వంగా వుంది.

1918లో మాకు పౌర యుద్ధం జరిగింది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చును. రైతులకు భూమి లేదు, అసమానతలు పెరిగిపోయాయి. రాజకీయంగా అందరికీ సమాన ప్రాతినిథ్యం ఇస్తూ, కలుపుకుపోతూ, మేము ఆ పరిస్థితి నుండి బయటపడ్డాము.  ఎవరైతే ఓడిపోయారో , పదేళ్ల తర్వాత వారే అధికారంలోకి వచ్చారు. సమానత్వం కోసం ఒక పార్టీనే వాదించినా ప్రతి పార్టీ దానిని ఆమోదించింది.

 

లేక్ వాలేశా: హింస ఎప్పుడైనా చెడు ఎంపికే. నేను ఎప్పుడూ శాంతికోసం ఆలోచిస్తాను. కానీ ప్రపంచంలో తాను జీవించటానికి వేరేవారిని చంపాల్సిన పరిస్థితి రావచ్చు. అలా జరగకుండా మనం వారికి మన మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.

మారినా కాంతకుజినో: నేను శాంతివాదిని కాదు. ఆత్మ రక్షణ కోసం తిరగబడాల్సి రావచ్చు. అధికారమే లక్ష్యంగా వ్యక్తులు దాడికి, హింసకు పాల్పడుతూ వుంటారు. ఆ పరిస్థితి ప్రతీకారం తీసుకునే విధంగా నీ దారి మారుస్తుంది. దాడికి గురైన వారు దాడి చేస్తారు. సద్దాం హుస్సేన్ ఎటువంటి వాడైనప్పటికీ ఇరాక్ పై బాంబులు కురిపించి దానిని ప్రజాస్వామ్యంగా మార్చగలమనుకోవటం కేవలం అపోహే. ఎందుకంటే ప్రజలు తిరిగి ప్రతిస్పందిస్తారు. హింస నిరర్థకతను గమనించే నేను  ది ఫర్గివ్ నేస్స్ సంస్థను ఏర్పాటు చేశాను. దీనిలో భాగస్వాములు తమ కథలను వినిపిస్తారు. మా వాదన నెల్సన్ మండేలా వాదన కంటే భిన్నం కాదు. 1985లో ఆయన  హింసకు కారణం అప్పటి జాతి వివక్ష పాటించే ప్రభుత్వానిదే అన్నారు. ఐర్లాండు సమస్యలో కూడా ఇదే కోణం కనిపిస్తుంది.   

ఇంకా ఉంది

 

మూలం:

https://thoughteconomics.com/war-and-peace/

రచయిత: వికాస్ షా

https://peacesimplified.blogspot.com/


Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War & Peace- Part 9

Thought Economics- War and Peace- Part 7