Thought Economics- War & peace- Part 2
శాంతి- ‘హా’ర్థిక
ఆలోచనలు
భాగం-2
ఈ
వ్యాసములో కొన్ని సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం
సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు
నలుగురు మరి ఇంకొక ముగ్గురు ఈ
ఇంటెర్వ్యూలో పాల్గొన్నారు. వారు:
1.
ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, అధ్యక్షులు , నోబెల్
విమెన్స్ ఇనీషియేటివ్
2.
డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది,
విద్యావేత్త
3.
ప్రెసిడెంట్ మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ అధ్యక్షులు, క్రైసిస్
మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)
4.
లేక్ వాలేశా (పోలాండ్ మాజీ అధ్యక్షులు)
5.
మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)
6.
బెన్ ఫెరెఙ్క్జ్ ( మాజీ ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్
యుద్ధ నేరాల న్యాయస్థానం )
7.
బెర్టీ ఆహార్న్ (మాజీ ఐరిష్ ప్రధాన
మంత్రి)
వీరితో
మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి
చర్చించి తెలుసుకుందాం.
ప్రశ్న 2: యుద్ధం, సంఘర్షణలు సమాజంలో ఎందుకు ఉంటాయి?
డాక్టర్ శిరీన్ యెబడి: మానవాళికి ఒక గొప్ప ఆదాయ/ లాభ సాధనం యుద్ధం. యుద్ధం అనేక సంక్షోభాలను పరిష్కరించింది. ధనికులు మరింత ధనికులు అవటానికి
అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయారు.
ప్రెసిడెంట్ మార్టి అతిసారి: యుద్ధాలకు అనేక కారణాలుంటాయి. మా ఖండంలో
కూడా గత కొద్ది కాలంలో యుద్ధాలు జరిగాయి. యుద్ధాలనేవి అభివృద్ధి చెందుతున్న దేశాలకే
పరిమితం కాలేదు. అయితే మా దేశంలో (ఫిన్లాండ్) ఎందుకు జరగలేదనేది గమనించాల్సిందే. మేము
గత 70 సంవత్సరాలుగా శాంతిగానే ఉన్నాము. మేము
చాలా వరకు ఏక గ్రీవంగా ఉన్నాము. వ్యవస్థలు, అధికారులు తమ కోసం పనిచేస్తున్నారని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.
ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం ఉంది. మాకు 80%
మంది మద్దతు ఉంది.
ప్రపంచం లోని మిగతా చోట్ల అధికారం కోసం విపరీతమైన కోరికలు ఉన్నాయి.
వారి కోరికలు యుద్ధాలకు, ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఐక్య రాజ్య సమితిలో ఒక బాధ్యతను తీసుకు రావటానికి
మేము కొద్ది కాలం క్రితం ప్రయత్నించాము. దీంట్లో మాకు పెద్ద విజయం రాలేదని ఇక్కడ ఒప్పుకుంటున్నాము.
అయితే దీని వెనక సూత్రం చారిత్రాత్మకమైనది. అది ఏంటంటే, ప్రభుత్వాలు తమ ప్రజలను కించపరిస్తే, అంతర్జాతీయ సమాజం తన పాత్రను పోషిస్తుంది, పోషించడము తన బాధ్యత.
మీరు వేసిన ప్రశ్నను తిరగేసి, కొన్ని దేశాలలో గొడవలు ఎందుకుండవని అడిగితే అక్కడ
చక్కని, న్యాయమైన సమాజాల నిర్వహణ నడుస్తున్నది. చాలా ఎక్కువ అసమానతలుంటే
అక్కడ హింస జరగటం మామూలే. ఎక్కడైతే చక్కని
న్యాయబద్ధమైన సమాజాలుంటే అక్కడ తక్కువ హింస ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.
మారినా కాంతకుజినో: ప్రేమ, నష్టాలకు మనం అలవాటు
పడ్డాము కాబట్టి ఘర్షణ, హింస మన సమాజంలో జరుగుతున్నాయి. మనం ప్రేమించినవారిని
పోగొట్టుకుంటే లేదా మన వ్యక్తిత్వం కోల్పోతే లేదా మన ఇల్లును మనం కోల్పోతే మనం ప్రతీకారం
తీసుకోవాలని కోరుకుంటాము. నష్టం, ప్రమాదం జరిగినప్పుడు మన క్షమాగుణం
పెరుగుతుందని నా పని ద్వారా తెలుసుకున్నాను. నీవెవర్నైనా క్షమించాలంటే ముందు నీవు ఏదైనా
కోల్పోయి ఉండాలి: నీవు ప్రేమించిన వ్యక్తిని కోల్పోవటం అయినా గానీ, నీ ఆశ ఆవిరవ్వటం
గానీ, ఏదైనా ప్రమాదం గానీ, నష్టం గానీ, అన్యాయం కానీ నీకు జరగకుంటే నీవు
క్షమించేందుకు ఏ కారణం ఉండదు.
లేక్ వాలేశా: ఎక్కడైతే అభివృద్ధి అంతగా జరగని ప్రాంతాలున్నాయో, ఎక్కడైతే ప్రజల కనీస
అవసరాలు తీరట్లేదో అక్కడ ఘర్షణ జరిగే అవకాశం
ఎక్కువ. ఈ అభివృద్ధి అసమానతలు ఘర్షణలకు దారి తీస్తాయి. పాత కాలంలో మానవాళి భూమి కోసం
కష్టపడి/ సంఘర్షించి తమ దేశాలను పెద్ద దేశాలుగా చూసుకోవాలని అనుకున్నాయి. దాన్ని ‘భూ యుగం’ అందాం.
ప్రస్తుత ఆధునిక నాగరికతలో తిండి, బట్ట కంటే, మేధో సంబంధమైన విషయాలపై ఎక్కువ ఖర్చు పెడుతున్నాము. అందువలన మనం వేరే దేశాలకు
వర్తకులుగా మారి పోయాము. వారి వస్తువులను మనం కొంటానికి, వారికి
మనం కావాలి. ఈ అభివృద్ధి స్థాయిలను మనం సమం చేస్తే ఘర్షణలు తక్కువ అవుతాయి.
బెర్టీ ఆహార్న్: సాయుధ ఘర్షణ అనేది మనకు ఒక
శాపం వంటిది. దీన్ని చర్చల ద్వారా, రాజీ, మధ్యవర్తిత్వం, సంభాషణల ద్వారా పరిష్కరించుకోవాలి. ప్రజలు గానీ ప్రభుత్వాలు గానీ తమ అధికారాలను
కోల్పోకుండా ఉండడానికి గానీ, తమ స్థానాలను నిలబెట్టుకోవటానికి
ప్రయత్నించినప్పుడు, చెడు విధానాలున్నప్పుడు ఘర్షణలు జరిగే అవకాశాలెక్కువ.
ఏయే దేశాలలో అయితే ఎక్కువగా గనులుండి అక్కడి ప్రభుత్వాలు ప్రజలను సంప్రదించకుండా
ఇతర దేశాల ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తాయో అక్కడ ఘర్షణలు సంభవిస్తాయి. నైజీరియా
అందుకు ఒక ఉదాహరణ.
దురదృష్టవశాత్తూ, యుద్ధం మొదలయితే
కానీ, అసాధారణ సందర్భాలు ఎదురయితే కానీ ఘర్షణ నివారణ చర్యలు, శాంతి చర్చలు ప్రారంభం కావు. అది మన దురదృష్టం.
మూలం:
https://thoughteconomics.com/war-and-peace/
రచయిత:
వికాస్ షా
https://peacesimplified.blogspot.com/
Comments
Post a Comment