Thought Economics -War and Peace Part 1
శాంతి- ‘హా’ర్థిక
ఆలోచనలు
భాగం-1
ఈ
వ్యాసములో కొన్ని సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల ఇంటర్యూ లు పొందు పరచబడినవి. ఇది కొంచెం
సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు
నలుగురు మరి ఇంకొక ముగ్గురు ఈ
ఇంటెర్వ్యూలో పాల్గొన్నారు. వారు:
1.
ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, చైర్, నోబెల్ విమెన్స్
ఇనీషియేటివ్
2.
డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది,
విద్యావేత్త
3.
ప్రెసిడెంట్ మార్టి అతిసారి (ఫిన్లాండ్ పూర్వ అధ్యక్షులు, క్రైసిస్
మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)
4.
లేక్ వాలేశా (పోలాండ్ పూర్వ అధ్యక్షులు)
5.
మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)
6.
బెన్ ఫెరెఙ్క్జ్ ( పూర్వ ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్
యుద్ధ నేరాల న్యాయస్థానం )
7.
బెర్టీ ఆహార్న్ (పూర్వ ఐరిష్ ప్రధాన మంత్రి)
వీరితో
మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి
చర్చించి తెలుసుకుందాం.
ఇంటర్వూలోకి
వెళ్ళే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. హింస చరిత్రను సమీక్షిస్తే మనం
ప్రతి సారి జరిగిన క్రూరత్వం గమనించి దిగ్భ్రాంతికి లోనవుతాము. మనకు అంతులేని కోపం, అసహ్యం, ఎక్కువ బాధ కలుగుతాయి. మనకు మన వెన్నులో గాయం జరిగినట్లు, జీవం నెమ్మదిగా పోతున్నట్లు, దశాబ్దాల జీవనం కోల్పోయినట్లు అనిపిస్తుంది. హింసకు గురై చేతనా వ్యవస్థ
దెబ్బ తిన్నట్లు, చేతన కోల్పోవాలని అనిపిస్తుంది. చేతన
స్థానంలో భరించలేని నొప్పి చేరుకుని అంతమవ్వాలని అనిపిస్తుంది. ఇది ఒకరికి, ఇద్దరికీ కాదు లక్షల/కోట్లమందికి జరిగితే? మానవ
మనస్సుకు అందలేని సంఖ్యలో ఈ నష్టం వాటిల్లితే? మానవులే తోటి
మానవులకు ఈ కష్టాన్ని కలిగించారని తెలిస్తే? ఇది సహించలేని, భరించలేని వాస్తవం.
మితిమీరిన అతిశయోక్తి అనిపించవచ్చు. ఒక అంచనా ప్రకారం మానవ నిర్ణయం
లేదా అనుమతి వలన 18.7 కోట్ల మంది చనిపోయారు. ఇది కేవలం 75 సంవత్సరాలలో (1914 నుండి
1991 వరకు) జరిగింది. ఈ సమయంలో రెండు ప్రపంచ యుద్ధాలు, రష్యా విఘటన, యూరోప్ లో రష్యా పాత్ర అంతమవ్వటం జరిగాయి.
కానీ పైన చెప్పిన అంకెలు 4.4 కోట్లు తక్కువ (20 వ శతాబ్దము
మొత్తానికి అంచనా) అని, అవాస్తవమని మరికొన్ని అంచనాలు
తెలుపుతున్నాయి. 23.1 కోట్ల మంది చనిపోయారని తెలుపుతున్నాయి. ఈ నష్టం మానవ
మాత్రులు గ్రహించలేని నష్టం. ఈ నష్టం బ్రెజిల్ దేశ జనాభాతో సమానం. నెల వారీ
లెక్కిస్తే ఒక సునామీ వలన జరిగిన నష్టంతో సమానం.
యుద్ధం వలన జరిగే ఆర్థిక నష్టం అంచనాలకు అందనిది. విశ్వ వ్యాప్తంగా
వార్షిక మిలిటరీ ఖర్చు 1.75 ట్రిలియన్ అమెరికా డాలర్లుగా లెక్కించారు. ఇది ప్రపంచ
జిడిపిలో 2.5% అనగా ప్రతి వ్యక్తికీ 20000 రూపాయలు అన్న మాట.
తయారయిన ప్రతి గన్ను, ప్రయోగించిన ప్రతి యుద్ధ నౌక, పేల్చిన ప్రతి రాకెట్టు మొదలగు వాటికయ్యే ఖర్చు , ఆకలితో ఉన్న వారి
నుండి, అన్నం పెట్టబడని వారినుండి,
బట్టలు లేక చలిలో వణికే వారి నుండి
చివరికి దొంగతనం చేసినట్లే అని భావించాలి.
ఆయుధాలతో ఉన్న ఈ ప్రపంచం కేవలం డబ్బు మాత్రమే ఖర్చు పెట్టట్లేదు. శ్రామికుల చెమట, శాస్త్రవేత్తల మేధస్సు, చిన్నపిల్లల ఆశలను తొక్కి వేస్తున్నారు. ఈ జీవనం ఒక జీవనమే కాదు. యుద్ధ
మేఘాల మధ్య జీవించడం మానవాళికి చాలా సవాళ్ళతో కూడినది. యుద్ధానికి, పౌర సేవకు
సరిపడా డబ్బులు ఏ దేశానికి లేవు. రెండూ కలిసి మనుగడ సాధించలేవు.
3500 సంవత్సరాల నమోదు చేయబడిన
మానవ చరిత్రలో కేవలం 270 సంవత్సరాలు మాత్రమే శాంతితో ఉన్నామని ఒక అంచనా. కాబట్టి
ఘర్షణ మానవ స్వభావంలో ఒక భాగమని అనుకుని, ఘర్షణ లేకపోవటం ఒక వింతగా భావించవచ్చా? మనం ఎప్పుడు శాంతియుత సమాజాన్ని చూస్తాం?
పైన పేర్కొన్న ఏడుగురితో ఇంటర్యూలు
చేసి యుద్ధానికి/ ఘర్షణకు కారణాలు, వీటి వలన సమాజం మీద కలిగే ప్రభావం, శాంతియుత ప్రపంచం నిర్మించటానికి ఏమి కావాలి అని చర్చించాము.
ప్రశ్న 1: ఘర్షణ ఏమిటి? యుద్ధం ఏది?
ప్రొఫెసర్ జోడీ విలియమ్స్: నోబెల్ విమెన్ ఇనీషియేటివ్ ఘర్షణ
జరిగిన ప్రాంతాలలో బలాత్కారం, లింగ హింసలను ఆపుటకు అంతర్జాతీయ ప్రచారం చేయాలని భావించినప్పుడు
మేము యుద్ధమా లేదా ఘర్షణ అని తర్జనభర్జన
పడ్డాము. మేము చివరకు ఘర్షణ అని
నిర్ణయానికి వచ్చాము. సామాజిక ఆర్థిక ఘర్షణ హింసకు దారి తీస్తుంది, కానే యుద్ధ స్థాయికి వెళ్ళక పోవచ్చు. లాటిన్ అమెరికా లో జరుగుతున్న
ఫెమిసైడ్స్, మాదక ద్రవ్యాల యుద్ధాలను గమనిస్తే అవి యుద్ధాలు
కావు, కానీ హింస ఎక్కువగా ఉంటుంది.
హింసను, హింస క్రమాన్ని గమనిస్తే సాయుధ ఘర్షణ ఎందుకు వస్తుంది, దాని వేరులు ఎంతవరకు పాకి ఉన్నాయి అని మనకు అర్థం అవుతుంది. వ్యక్తి
స్థాయి నుండి దేశం ఇంకొక దేశాన్ని ఆక్రమించే నిర్ణయం తీసుకునే స్థాయి వరకు మనం
ఆలోచించాలి. ఒక వ్యక్తి తన భార్యను కొట్టాడంటే అతను హింసతో కూడిన ఎంపిక
చేసుకున్నాడని భావించవచ్చును.
మానవులకు హింసా నైజము స్వాభావికంగా ఉంటుంది అనేది మనకు నిరాటంకంగా తరతరాలుగా చెప్పబడుతూ
వస్తున్నది. ఒక్కోసారి వారు అదుపు తప్పితే హింస జరుగుతుంది అనేది వారి భావన.
దానిలో కొంచెం నిజం ఉండవచ్చును. ఒక స్థాయి దాటితే అది హింసకు దారి తీస్తుంది.
అయితే హింస మానవాళి నైజం అని మనం ప్రకటిస్తే మన బాధ్యత నుండి మనం తప్పుకున్నట్లే. హింసా క్రమాన్ని, దాని ఉదాహరణలను మనం బాగా అర్థం చేసుకుంటే,
ప్రజలు హింసనే ఎందుకు ఎంపిక చేస్తారని గమనిస్తే మనం యుద్ధం లేని సమాజము లో
నివసించగలము అనే భావనకు దగ్గరైనట్లే.
సశేషం/ఇంకా ఉంది
మూలం:
https://thoughteconomics.com/war-and-peace/ రచయిత: వికాస్ షా
https://peacesimplified.blogspot.com/
Comments
Post a Comment