Thought Economic- War & Peace- Part 8

శాంతి- హార్థిక ఆలోచనలు

భాగం-8

ఈ వ్యాసములో సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల   ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు నలుగురు  మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో పాల్గొన్నారు. వారు:

1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్

2. డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది, విద్యావేత్త

3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ  అధ్యక్షులు, క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)

4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ  అధ్యక్షులు)

5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)

6. బెన్ ఫెరెఙ్క్జ్  ( మాజీ  ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం )

7. బెర్టీ ఆహార్న్ (మాజీ  ఐరిష్ ప్రధాన మంత్రి)

వీరితో మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి చర్చించి తెలుసుకుందాం.

 

 

ప్రశ్న 23: విడిపోతున్న సమాజాలకు శాంతిని నెలకొల్పే సాధనాలను ఎలా వినియోగించవచ్చును?

బెర్టీ ఆహార్న్: 1980 నుండీ నేను రాజకీయాలలో ఉన్నాను కనుక బహుముఖత్వాన్ని ఎక్కువగా నమ్ముతాను. యూ‌ఎన్‌డి‌పి లాంటి సంస్థలంటే నాకు గౌరవం ఎక్కువ. అయితే గత రెండు సంవత్సరాలుగా బహుముఖత్వాన్ని కొందరు తక్కువ చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. అయితే కొంతకాలంగా ప్రభుత్వాలను పక్కన పెట్టి ఘర్షణ నివారణ చర్యలను బహుముఖ ప్రాతిపదిక మీద చేపడుతున్నారు. అయితే ప్రభుత్వాలను పక్కన పెట్టటం సరైనది కాదు.  ప్రభుత్వాలకు పెద్ద పాత్ర ఇచ్చి నిధులను సేకరించే బాధ్యతనిస్తేనే విజయవంతం అవుతుంది. గత కొద్ది కాలంగా నార్వే మంచి పనులను చేస్తున్నా మిగతా ప్రభుత్వాలు సహకరించకపోతే దానికి విలువ ఉండదు.

ప్రశ్న 24: మానవ హక్కుల సవాళ్లను మనం శాంతిని నెలకొల్పడంలో ఎలా అధిగమించవచ్చును?

డాక్టర్ శిరీన్ యెబడి:  మానవ హక్కులనేవి ఒక సంపూర్ణ/ సమగ్ర భావన. మహిళల, పిల్లల, శరణార్థులు, ఇంకా అనేక వర్గాల హక్కులు మానవ హక్కులలోని భాగం. దేశంలోని కొంత మండి హక్కులను పరిరక్షింక పోతే దేశంలో శాంతి లేనట్లే.   అల్ప సంఖ్యాక వర్గాల హక్కులను రక్షించటాము అధికారంలో వున్న అగ్ర సంఖ్యాక వర్గాల బాధ్యత. ఉదాహరణకు వాక్స్వాతంత్ర్యం గురించి ఆలోచిస్తే మైనారిటీల వాక్స్వాతంత్ర్యం చాలా ముఖ్యం.  

ప్రశ్న 25: యుద్ధ నేరాల విచారణలో    న్యాయం ఎలా  జరుగుతుంది?

బెన్ ఫెరెఙ్క్జ్: నేను హార్వర్డ్ లో శిక్షణ పొందిన న్యాయవాదిని. నాకు న్యాయం మీద అపార నమ్మకం ఉంది. న్యూరెంబర్గ్ విచారణాలలో నేను ఒక బృందానికి ముఖ్య ప్రాసెక్యూటర్ని. నేను సాక్ష్యాలను నమోదు చేసి, నివేదికలను సేకరించి వాటిని బెర్లిన్ లోని ముఖ్య కార్యాలయమునకు పంపించాను. ఈ నివేదికలలో వేర్వేరు బృందాలచే అనేక మంది హత్య కావించబడ్డారని పేర్కొన్నాను. నేరము ఆపాదించబడిన వారితో  ఏ సంభాషణలు జరపకూడదన్నది, స్పష్టమైన సాక్ష్యాలు మీద ఆధారపడాలన్నదే   నా నమ్మకం. సామూహిక హత్యలు చేసిన వారు మామూలు వ్యక్తులుగా నాకు కనిపించి వుండొచ్చు, నేను వారికి ఆకర్షితుడిని అయి కూడా ఉండవచ్చును. అయినా కానీ నేను పత్రాలతో కూడిన సాక్ష్యము  ఆధారంగా పని చేశాను.   

వేలమంది శిశువుల హత్యాకాండల గురించి చదువుతున్నప్పుడు సాధారణంగానే మనం భావావేశం పొందుతాము. కానీ నేరస్తుల విచారణ జరుగుతున్నప్పుడు నేను తటస్థం గానే వున్నాను.

ప్రశ్న 26: యుద్ధ నేరాలకు సరైన శిక్షలు ఎలా వేస్తారు?

బెన్ ఫెరెఙ్క్జ్: సరైన పద్ధతులు తయారు చేసుకోవటం కష్టం కాదు గానీ అటువంటి పద్ధతులు ఏమీ లేని సమాజాలలో పని చేయటం చాలా కష్టం. ప్రపంచ న్యాయం అని పిలచే న్యాయ వ్యవస్థ ఇంకా అందుబాటులో లేదు. మనకు సరిగ్గా అతకని ప్రపంచ సమాజం, న్యాయం  ఉంది. మనకు పనిచేసే న్యాయ వ్యవస్థ ఉంటే మనకు రక్షణ కూడా లభిస్తుంది. న్యాయ వ్యవస్థ బలహీనంగా ఉంటే అంతా గందరగోళంగా ఉంటుంది. మనకు అవసరమైన సరైన పద్ధతులను తయారు చేసుకోవాలి. అదే సమయంలో వీటిని అమలు లోకి తెచ్చేందుకు కావలసిన పద్ధతులను కూడా ఏర్పాటు చేసుకోవాలి, మనం ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాము. హేగ్ లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఉంది. దానిని మరింత బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉంది. లేకపోతే మనం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

 ప్రశ్న 27: సిద్ధాంతాత్మక సంఘర్షణ, తీవ్రవాద నేపథ్యంలో మనం యుద్ధ నేరాలను పునర్నిర్వచనము చేయాల్సిన అవసరం ఉందా?

బెన్ ఫెరెఙ్క్జ్:  ఇవాల్టి వేళ మిలిటరీని పాలించమంటే వెనకటి రోజుల లాగా కాదు. హేగ్ కన్వెంషన్స్ అనే పేరుతో యుద్ధానికి సంబంధించి ఒక ప్రాతిపదికను తెచ్చారు. ఇవాల్టి రోజున ఉన్న యుద్ధ వ్యవస్థకు ఈ కన్వెంషన్స్ ఎందుకూ సరిపోవు. న్యూక్లియర్ బాంబుకు మనం ఆడవాళ్లని, పిల్లలని చంపొద్దని చెప్పలేము. అలాగే గాయపడిన వారిని ఇంకా గాయపరచవద్దు అని చెప్పలేము.   ఆధునిక యుద్ధములో, యుద్ధములో గాయపడినవారి హక్కుల గురించి మాట్లాడటం అవివేకమవుతుంది, అది మన గుర్తించాలి.

దీనికి నిజమైన సమాధానం ఏంటంటే యుద్ధం జరగకుండా ఆపటమే. మన అభిప్రాయ భేదాలను పరిష్కరించడానికి సాయుధ దళాలను వాడడం మానేయాలి. లేకుంటే నేరాల తీవ్రత ఇంకా పెరిగి, మనం సమాజాన్ని నిర్వహించలేని పరిస్థితికి చేరుకుంటాము.   

 

ఇంకా ఉంది

https://peacesimplified.blogspot.com/

మూలం:

https://thoughteconomics.com/war-and-peace/

రచయిత: వికాస్ షా


Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War and Peace- Part 7

Reality of War by Dalai Lama - Translated to telugu