South Cooperation for world Peace

బహుళ  ధృవ ప్రపంచంలో శాంతి అజెండా 

అంతర్జాతీయ వ్యవహారాలను గమనించేవారికి కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు మాత్రమే విశ్వ శాంతి విధానాల అజెండాను మోస్తున్నట్టు అనిపించడం అంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. నిజానికి శాంతికి సంబంధించిన విషయ జ్ఞానము, నిర్ణయాలలో అనేక అసమానతలున్నాయి. దీని వలన ఆ ప్రయత్నాలన్నీ  పై పై మెరుగులు లాంటివి మాత్రమే. ఐక్యరాజ్యసమితిలో ఉన్న చారిత్రాత్మక అసమానతలు ఆ సంస్థ పనిచేసే తీరులో స్పష్టంగా కనిపిస్తాయి.  

అయితే ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన శక్తి మార్పు చోటు చేసుకుంటున్నది. ప్రపంచంలోని (గ్లోబ్) దక్షిణ భాగం నుండి దేశాలు కలిసి “దక్షిణ - దక్షిణ సహకారం (దదస)” అనే సూత్రాన్ని మరింత క్రియా శీలముగా, స్వరం పెరుగుతూ ముఖ్యంగా శాంతి, భద్రతా వ్యవహారాలలో  చురుకైన పాత్ర పోషిస్తున్నాయి.

“దక్షిణ - దక్షిణ సహకారం” అనేది ఒక దృక్కోణం మాత్రమే కాక అది ఉమ్మడి సమస్యలు తీర్చుకునేందుకు  స్వావలంబన, ఉత్తమ పద్ధతులను బలపరిచే ఒక రాజకీయ పిలుపు కూడా. ఈ సహకార అంగీకారాన్ని గ్లోబ్ దక్షిణ భాగం నుండి 135 దేశాలు ఒప్పుకున్నాయి. 

దక్షిణ భాగము లోని దేశాలు ఎక్కువగా సంఘర్షణలకు, అభద్రతలకు గురవుతున్నాయని కాబట్టి ఒక బలమైన దక్షిణ- దక్షిణ అజెండాకు బలమైన పునాదులు పడ్డాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలో సంఘర్షణ నివారణకు బలమైన చర్యలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక శక్తి సంచలనం “దక్షిణ” దిశగా మారుచున్నది. 

శాంతి ప్రక్రియ చలనం

ఐక్యరాజ్యసమితిలో కొన్ని సాముదాయక దేశాలు బహుపాక్షిక శాంతి ప్రక్రియలపై గట్టి పట్టు కలిగి ఉన్నాయి. దురదృష్టవశాత్తూ దక్షిణ భాగ దేశాలు, వాటి ప్రజలు శాంతి ప్రక్రియలో “అందుకునే వారే” కానీ “మూలకర్తలు” కాలేకపోయారు. ఈ అసమానత బహుపాక్షిక వ్యవస్థలు/ సంస్థలు, సంకుచిత విధాన ప్రక్రియలోనూ ప్రతిబింబించింది. శాంతి ప్రక్రియతో పాటు మరింత సైనికీకరణ  చేపట్టటం, రక్షణ వ్యవస్థగా పనిచేయటం, పైనుంచి ఆదేశాలు అందుకునే లాగా, స్వల్ప కాలిక మధ్యవర్తిత్వానికి, బాహ్య చర్యలకు దారి తీసేదిగా, శాంతి ఒప్పందాలను నాంకే వాస్తీ అమలుకు దారి తీస్తున్నాయి.

అయితే ఈ ప్రక్రియ అసమానతను తగ్గించే విధంగా ఉండకపోవచ్చును, అలాగే దక్షిణ దేశాలు తమ గొంతును నొక్కి వినిపించాల్సిందే మరియు తమ ప్రభావాన్ని, నైపుణ్యాన్ని తమ స్థానాన్ని నిలుపుట  కోసం వాడాల్సిందే.

ఐక్యరాజ్య సమితికి ఉన్న మూడు స్తంభాలు: మానవ హక్కులు, శాంతి, భద్రతలను ఈ ప్రక్రియ పరస్పరం బలపరచే విధంగా శక్తిని ఇస్తాయి. వాతావరణ మార్పును నివారించే ప్రయత్నాలను, మహిళా సాధికారిత చేసే ప్రయత్నాలు ఈ “దక్షిణ - దక్షిణ సహకారం (దదస)” లో ఇమిడి వున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా ఉత్పన్నమైన పత్రం మార్గ నిర్దేశనం చేస్తుంది.

ఆసియా దృక్కోణాలు

ఈ ప్రక్రియలో చైనా తనవంతు పాత్రను పోషిస్తూ ఉన్నది. శాంతి ప్రక్రియలో ఆసియా దేశాలు విభిన్నమైన, కలుపుకుని పోయే శాంతి, భద్రత చర్చలు జరిగాయి, జరుగుతున్నాయి.  అయితే చాలా దేశాలు చైనాతో బెల్ట్, రోడ్ ఇనీషియేటివ్ గురించి చర్చలు జరుపుతున్నారు. చైనా ప్రభుత్వ ఈ ప్రయత్నంలో వివాదాలు ఉన్నాయి. చైనా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది.  

అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ (ASEAN) స్థానిక శక్తి సంచలనాలను సమతులనం చేసే ఒక ప్రాతిపదిక. ఈ ఆగ్నేయ ఆసియా దేశాలు శాంతి కోసం శాంతి సంస్థను (ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఫోర్ పీస్ అండ్ రీకన్సిలియేషన్) 2011 లో ఏర్పాటు చేసుకున్నాయి.

ఈ ప్రాంతీయ ప్రక్రియలు స్థానికంగా శాంతిని నెలకొల్పేందుకు దోహదపడుతున్నాయి. ASEAN ఒక ఉదాహరణ మాత్రమే. ఆఫ్రికాలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి శాంతిని నెలకొల్పేందుకు దోహదపడుతున్నాయి.

ఐక్యరాజ్య సమితి  కూడా స్థానిక యంత్రాంగాలను గౌరవించే  సంకేతాలను ఎక్కువ ఇస్తున్నది. జి-7 దేశాల సమూహం కూడా దక్షిణ దేశాల సమూహమే. జి-7 శాంతి, భద్రత, అభివృద్ధి విషయాలలో ప్రముఖ మరియు శక్తివంతమైన  పాత్ర పోషిస్తోంది.

 

మూలం: https://www.opendemocracy.net/en/democraciaabierta/truly-global-peace-agenda-multipolar-world/

https://peacesimplified.blogspot.com/


Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War & Peace- Part 9

Thought Economics- War and Peace- Part 7