Qualities Of Peace

శాంతి లక్షణాలు

1. ఉనికి

శాంతికి నాలుగు లక్షణాలు ఉంటాయి. అందులో ఉనికి మొదటిది. స్పష్టమైన గుణములు కలిగియుంటుంది. ఈ విషయంలో అది (సం)ఘర్షణ స్థాయికి సమానం. ఎలాగైతే సంఘర్షణ కొన్ని ప్రత్యేక/నిర్దుష్ట  ప్రవర్తనలు కలిగి యుంటుందో  అలాగే శాంతి కూడా.  కొన్ని సందర్భాలలో ఘర్షణ, శాంతి రెండూ లేకపోవచ్చు. ఇక్కడ చెప్పవలసినది ఏంటంటే సంఘర్షణ, శాంతి రెండూ జంట ఉనికిని కలిగి ఒకదానితో ఒకటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయి. సంఘర్షణ హెలిక్స్ అనవచ్చు. శాంతిని సామరస్యం, అనుసంధానం, ధర్మం అని కూడా భావిస్తారు. అయితే శాంతికి ఉన్న సాంప్రదాయ నిర్వచన ప్రకారం హింస/ యుద్ధం  లేకుండుట అని మనం భావిస్తే శాంతికి కూడా ఉనికి లేనట్లే. 

2. వైరుధ్యం

శాంతి ఉంది లేదా లేదు. ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అని మాట్లాడుకోవటం/ అనటం వ్యర్థం. అయితే ఒక ప్రభుత్వం పెద్దది  కావచ్చు, లేదా చిన్నది కావచ్చు,  ధనిక లేదా పేద కావచ్చు. అలాగే అనేక కొలమానాల ప్రకారం శాంతి మారవచ్చు. అది విభిన్న రూపాలు, సామాజిక కట్టుబాట్లలో మారుతూ ఉండవచ్చు.  అయితే ఇక్కడ శాంతి ఉంది/ లేదు అనుటకు దాని గుణాలైన రూపం, కట్టుబాటు గురించి తేడాను మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో శాంతి పెరుగుతోంది అనగా ఎక్కువ ప్రభుత్వాలు ప్రబలమైన అంతర్జాతీయ శాంతికి ఒప్పుకుంటున్నాయని అర్థం. అలాగే శాంతి తీవ్రంగా ఉందని అంటే ప్రత్యేక శాంతి ప్రక్రియ రూపు దిద్దుకుంటున్నదని, పరస్పర సహకార చర్యలు పెరుగుతున్నాయని అర్థం.

3. లోపల, బయట

శాంతి లోపల, బయటా ఉంటుంది. ఎందుకంటే శాంతి అనేది ప్రజల, బృందాల మధ్య ఒక సామాజిక ఒప్పందం. ఈ ఒప్పందంలో మానసిక, సామాజిక వాస్తవాలు ఉంటాయి. మానసిక వాస్తవాలు  అనగా భాగస్వాముల అంచనాలను, ఆ అంచనాల అనురూపతను,  పరస్పర హితాలను, సామర్థ్యాలను, కోరికలు అన్న మాట. ఇవన్నీ మానసికమే. సామాజిక వాస్తవం అనగా భాగస్వాముల మధ్య క్రమబద్ధమైన అమచనాలను రూపొందించటము వీటికి  ఒక వ్రాత ఒప్పందం రూపొందించటం లేదా కొన్ని భౌతిక నిర్మాణాలు కట్టటం, పరస్పర సహకారానికి నమూనాలు రూపొందించటము మొదలగునవి వస్తాయి.     

శాంతికి ఉనికి ఉందంటే మనసుల లోని అంచనాలకు, అర్థాలకు, విలువలకు ఒక సామాజిక రూపం వచ్చి అవన్నీ సామాజిక ఒప్పందంలో ప్రతిబింబించటం అన్న మాట. సామాజిక సంబంధాల పై పొరలపై భాగంలో   శాంతి (ఐస్ బెర్గ్ వలె ) కనబడుతుందన్న మాట. 

 

4. క్రియాశీలత

చివరగా ఒక సామాజిక ఒప్పందం  లాంటి శాంతి క్రియాశీలంగా ఉంటుంది, నిష్క్రియాత్మకంగా ఉండదు. చర్చల ద్వారా, సర్దుబాట్ల ద్వారా, తీర్మానాల ద్వారా, నిర్ణయాల ద్వారా శాంతి ఏర్పడుతుంది. దీని ఫలితం పరస్పర సహకారం. అనేక శక్తుల సమతూలనా అనురూపత మీద శాంతి ఉనికి ఆధారపడుతుంది. సంఘర్షనా హెలిక్స్ సంచలనంలో ఇది ఒక దశ మాత్రమే.  హింస, యుద్ధం లేనప్పుడు శాంతి ఒక నిష్క్రియా పరమైనదే. అటువంటి సందర్భాలలో శాంతి ఒక మృతమైనది.

మూలం: https://www.hawaii.edu/powerkills/TJP.CHAP2.HTM

https://peacesimplified.blogspot.com/


Comments

Popular posts from this blog

TWO Countries: Two lives

Thought Economics- War & Peace- Part 10

Gabbita Mruthyunjaya Sastry Biography