Preventing Another World War

ఇంకొక ప్రపంచ యుద్ధాన్ని ఆపేదెట్లా ?


.

ఘర్షణను నివారించటంలో  మనకు 100 సంవత్సరాల అనుభవముంది

(This article is part of the World Economic Forum's Geostrategy platform

ప్రపంచ ఆర్థిక సంస్థకు (World Economic Forum) చెందిన Geostrategy వేదికలో ఈ వ్యాసము ఒక భాగము.)

“మూడవ ప్రపంచ యుద్ధములో ఏ ఆయుధాలను వాడతారో తెలియదు కానీ,  నాల్గవ ప్రపంచ యుద్ధం మాత్రం కర్రలతోనూ రాళ్ళతోనూ జరుగుతుంది”- ఆల్బర్ట్ ఐన్ స్టీన్  

యుద్ధాలన్నింటినీ ముగించే యుద్ధం అని ఒక శతాబ్దం క్రింద హెచ్ జి వేల్స్ తప్పుగా ప్రకటించినప్పటి నుండీ శాంతిని అంతమొందించే శాంతి ప్రయత్నాలు రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసి ఆ తర్వాత ప్రచ్చన్న యుద్ధానికి పరోక్ష యుద్ధాలకీ పరిస్థితులు దారి తీసాయి. దీని వలన హింసతో కూడిన ఘర్షణలు  జరిగి సాధారణ పౌరులను విపరీతంగా ప్రభావం చేసి మారణాయుధాల ఘర్షణల లక్ష్మణ రేఖలను దాటి పోయాయి. ప్రపంచం మొత్తం మీద యుద్ధ సామాగ్రి, మందుగుండు సామాగ్రి నిల్వలు ఊహించ లేనంతగా పెరిగిపోయాయి. మూడవ ప్రపంచ యుద్ధం వలన జరిగే నష్టాలు చాలా ఎక్కువ. అన్నీ రకాల యుద్ధాలను (సాంప్రదాయక, న్యూక్లియర్, ద్రోన్లు, ఎలక్ట్రానిక్) కలిపి మన మిలిటరీ సామర్థ్యం చూస్తే మనలను మనం సంపూర్ణంగా నాశనం చేసుకునే బలం/బలహీనత మనం పూర్తిగా కలిగి వున్నాము.   

మిడిల్ ఈస్ట్, యూరోప్, రష్యా దేశాలు ఉక్రెయిన్ విషయంలో ఘర్షణ పడుతున్నాయి. ఇరాక్ విషయంలో అమెరికా తప్పటడుగులు ఇప్పటికే వేసింది. నాటో దళాలు ఆఫ్ఘనిస్థాన్ నుండి నిష్క్రమించటంతో అక్కడ పరిస్థితి గందరగోళంలో పడింది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదం ఉన్న ద్వీపాల విషయంలో, కొరియా ద్వీపకల్పాల విషయంలోనూ, కాశ్మీర్ విషయంలోనూ ఎప్పుడైనా ఘర్షణ జరిగే అవకాశం ఉంది.   

గత శతాబ్దంలో మనం ఘర్షణను నివారించడంలో అనుభవం గణించాము. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తరాలను ఇంకో రాబోయే  యుద్ధం నుండి కాపాడేందుకు మనం ఐక్య రాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నాము. గత కొన్ని దశాబ్దాలుగా వ్యాపార ఒప్పందాలు చేసే   స్థాయి నుండి యూరప్ మొత్తం శాంతికి కేంద్రంగా మార్చి నోబెల్ శాంతి బహుమతిని పొందే స్థాయికి   యూరోపియన్ యూనియన్ ఎదిగింది. యూరోపియన్ దేశాలు సమిష్టి ప్రయోజనాలకై పని చేసేందుకు నాటో సంస్థ పనిచేసింది. జర్మనీ, ఫ్రాన్స్ మధ్య యుద్ధం ఈ రోజున ఊహించను కూడా ఊహించలేము.

ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్ మరియు అమెరికా ఖండాల ప్రాంతాలలో ప్రాంతీయ సంస్థలను ఏర్పాటు చేసి, ప్రోత్సహించటం జరిగినది. నిరాయుధీకరణ, నిఘా/ భద్రతా ఒప్పందాలు/ఒడంబడికలు కోసం అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేసుకొని పౌర సమాజ నైపుణ్యం పెంపొందించి విశ్వవిద్యాలయాలు అలాగే మేధో బృందాల నైపుణ్యాన్ని పెంపొందించి భవిష్యతులో యుద్ధాలు  రాకుండా  ప్రణాళికలు రూపొందించారు.  

 

1946 నుండి 114 యుద్ధాలు జరిగాయని ఒక అధ్యయనం చెబుతోంది. అంటే 1000కి పైగా చావులున్న యుద్ధాల సంఖ్య ఇది. ప్రచ్చన్న యుద్ధము ముగిసిన  కాలంనుండీ  సాయుధ ఘర్షణలు తగ్గాయనే చెప్పక తప్పదు. 2013 నాటికి పేర్కొన్న 33 సాయుధ ఘర్షణల్లో కేవలం 7 మాత్రమే యుద్ధాలుగా పేర్కొనవచ్చు. 1989 నుండి మనం గమనిస్తే ఇది 50 శాతం తక్కువ.

పరోక్ష యుద్ధాల క్షీణత, ఐక్యరాజ్య సమితి చేపట్టిన శాంతి ప్రక్రియలు, దేశాల ఆర్థిక అభివృద్ధి మొదలగు ప్రక్రియలు సాయుధ యుద్ధాల తగ్గుదలకు కారణాలు. శాంతి చర్చలు, శాంతి ఒప్పందాలు విఫలమైనప్పటికీ హింసతో కూడిన యుద్ధాలను తగ్గించాయని మానవ భద్రతా నివేదిక పేర్కొంది.    

2013లో 6 శాంతి ఒప్పందాల మీద సంతకాలు జరిగితే,  2012 సంవత్సరంలో   4 శాంతి ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా గత కొద్ది కాలంలో మనం శాంతిని కల్పించటం, శాంతి నిర్వహించటం, బలవంతంగా శాంతిని రుద్దటంలో మనం ఆరితేరామని చెప్పకతప్పదు. మనం ఇందుకు వ్యతిరేకంగా భావించినప్పటికీ ఇది మాత్రం నిజం.

ప్రపంచ పౌరులను రక్షించటానికి మనకు సాయుధ ఘర్షణ నివారణ, మానవ హక్కుల చట్టాలతో పాటు, యుద్ధ నేరాల న్యాయస్థానాలు, అంతర్జాతీయ నేర న్యాయస్థానం మాత్రమే కాక ఆర్థిక మరియు సైనిక ఆంక్షలు అలాగే స్థానిక న్యాయ సంస్థలు ఉన్నాయి.  అణ్వాయుధాల వాడకాన్ని నిషేధించే చట్టాలున్నప్పటికీ ప్రపంచ స్థాయిలో నిషేధం జరగలేదు. అయితే అంతర్జాతీయ న్యాయ స్థానాలు రసాయన ఆయుధాలను , జీవాయుధాలను , ల్యాండ్ మైన్స్, క్లస్టర్ ఆయుధాలను, అంధత్వాన్ని కలిగించే లేజర్ మొదలగు వాటిని అంతర్జాతీయ చట్టాలు నిషేధించాయి.

యుద్ధాలు ఎలా మొదలవుతాయి, ఎలా జరుగుతాయి వాటిని ఎలా ఆపాలి అనే విషయాల మీద యుద్ధం అలాగే శాంతి గురించి అధ్యయనం చేసే విద్యారంగాలు సంపూర్ణ జ్ఞానాన్ని రూపొందించాయి. అయితే ఏ పద్ధతిలో అయినా  లోపాలు ఉండే అవకాశం ఉంది. వనరుల లేమి, పర్యావరణ మార్పు, ఆర్థిక ఒడి దుడుకులు, శరణార్థుల ప్రవేశం,  జాత్యహంకారం మొదలగునవి ఘర్షణలకు దారి తీసి యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. చరిత్ర, సంస్కృతి, లింగము మొదలగు వాటి పాత్రను అర్థం చేసుకొని ఘర్షణలను వాటి ఫలితాలను తగ్గించేందుకు వివిధ రాజకీయ వ్యవస్థలు కృషి చేస్తున్నాయి.

2030 నాటికి ప్రపంచం ఇంకా బలహీనపడి, దేశాలు  పరస్పర ఆధారితముగా ఉండి కూడా ఎక్కువ విభజనకు లోనవుతాయి. దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత పెరిగే అవకాశాలు ఎక్కువ.      

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యూరోప్ లో యుద్ధం జరగదని ఎక్కువ మంది భావించారు. చాలా మండి యుద్ధం త్వరగా ముగుస్తుందని భావించారు. కాబట్టి నిర్లక్ష్యాన్ని మనం వదలి పెట్టాలి. మనందరికీ యుద్ధాన్ని నివారించటం బాగా తెలుసు. అయితే యూరోప్ లో, ఆసియాలో రానున్న తరాలకు ఎటువంటి యుద్ధ వాతావరణం లేకుండా చేసేందుకు కృషి చేసిన అందరికీ మనం అందరం ఋణపడి ఉన్నాము. అది కనుక జరగకపోతే  మన సాకులు వినేందుకు ఎవరూ మిగలరు.  

 

మూలం:- https://www.weforum.org/agenda/2018/11/how-to-prevent-world-war-3/

https://peacesimplified.blogspot.com/


Comments

Popular posts from this blog

TWO Countries: Two lives

Thought Economics- War & Peace- Part 10

Gabbita Mruthyunjaya Sastry Biography