Precautions for peace not upto mark?

శాంతి ప్రక్రియలు ఎందుకు విఫలమవుతాయి?

 


 

 

దక్షిణ సూడాన్ కు స్వాతంత్ర్యం వచ్చి 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా హింసా ప్రక్రియ కొనసాగింది. ఐక్యరాజ్య సమితి, స్వచ్ఛంద సంస్థలు  తమ వంతు సహాయంగా పౌరులకు అవసరమైన వస్తువులు, సైనిక సహాయం అందించాయి. దాదాపు 10 లక్షల  జనాభా ఉన్న దక్షిణ సూడాన్ లో శాంతి గత 20 సంవత్సరాలుగా ఎండమావిగానే మిగిలిపోయింది. 2005 ఆగస్టులో వివిధ పక్షాల మధ్య సమగ్ర శాంతి ఒప్పందం కూడా జరిగింది.


 

ఇప్పుడు దక్షిణ సూడాన్, బోస్నియా, ఇరాక్ మరియు అలాంటి దేశాలలో ఎందుకు శాంతిని నిలబెట్టలేక పోతున్నాము, భద్రత, రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి సాధించలేక పోతున్నాము  అనే విషయములో  ఒక పరిశోధన జరిగింది. LaTrobe విశ్వ విద్యాలయం ఈ మధ్యనే ఒక ముఖ్య పరిశోధనను ముగించింది. శాంతి మార్గాలు/ ప్రక్రియలు ఎందుకు విఫలమవుతున్నాయి, యుద్ధము తదుపరి దేశాలకు శాంతిని నెలకొల్పేందుకు ఏమి చేయాలి అని ఈ పరిశోధన అర్థం చేసుకోటానికి ప్రయత్నించింది. చాలా కాలంగా జరుగుతున్న పౌర యుద్ధాలు చాలా సంక్లిష్టమైనవి. వాటిని ముగించడమే సులభ తరం కాదు. అలాగే ఆ దేశాలలో శాంతి వ్యవస్థలు నెలకొల్పటము కూడా సంక్లిష్టమైనదే. త్వరగా ముగించే పరిష్కారాలు ఏమీ ఉండవు. హింసను ప్రయోగించెందుకు వెనుక వుండే రాజకీయ, ఆర్థిక, సామాజిక సంచలనాలను అర్థం చేసుకోవడం – యుద్ధం తదుపరి మంచి, బలమైన శాంతిని నెలకొల్పుటకు చాలా అవసరం.

యుద్ధంలో పాల్గొన్న బృందాల మధ్య ఉన్న అపనమ్మకాల, ఒకరిపై మరొకరికున్న ద్వేషముల మూలాలను   అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. శాంతి నిలబడాలంటే సంఘర్షణ సమయంలో ఏమి జరిగినదో వివరాలను తెలుసుకోవాలి. “నిజాలు మాట్లాడుకోవటం” అన్నది శాంతి ప్రక్రియకు చాలా అవసరం. ఎందుకంటే యుద్ధ సమయంలో ఏం జరిగిందనేది తెలుసుకోవటము చాలా ముఖ్యం, వాస్తవాలను అందరికీ తెలియచేస్తుంది. యుద్ధంలో ఎవరైతే నష్ట పోతారో వారి అనుభవాలను అందరికీ తెలిసేలా చేస్తుంది. వారి మాటలను  వేరేవారు వింటున్నారని బాధపడిన వారికి అర్థమవుతుంది.  

 

దక్షిణ సూడాన్ లో సూడానీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ తదుపరి ప్రభుత్వ వ్యవస్థలలో ముఖ్య భాగం పంచుకుంది. ఈ సైన్యం ఒక పక్షానికి న్యాయవాదులుగా పని చేస్తూ మరి కొన్ని పక్షాలకు కూడా యుద్ధం ముందు పనిచేసింది. అయితే ఈ సైన్యం నిష్పాక్షికంగా ఎలా వ్యవహరిస్తుందనేది అనుమానమే. అయితే ఈ పరిశోధన ప్రకారం నిజాలు మాట్లాడుకోవడం ఒక న్యాయ ప్రక్రియ లాగా ఉండాల్సిన అవసరము లేదు. అలాగే అది నేర/న్యాయ  బద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు.      


 

వారి కథలను వినిపించడము, వేరే వాళ్ళు వినడమే ఒక స్వభావ  మార్పుకు నాంది. అలాగే పాఠశాల పాఠ్యాంశాలలో ఏమి చెబుతున్నారో అది కూడా ముఖ్యమే. యుద్ధం గురించి తమకున్న అవగాహనకు వేరుగా పాఠశాలలో చెబితే శాంతి ప్రక్రియ మీద నమ్మకం సడలుతుంది. యుద్ధము మీద అన్నీ పక్షాల గురించి పాఠశాలలో బోధించే  చరిత్రలో చెబితే మంచిది. అలాగే యుద్ధ నేరాల గురించి లెక్కల మీద కూడా అన్నీ పక్షాల దృక్కోణం నుండి చెబితే ఇంకా మంచిది. అప్పుడే యుద్ధము చేసిన  బృందాల మధ్య పరస్పర నమ్మకం ఏర్పడుతుంది.

1991 లో ముగిసిన ప్రచ్చన్న యుద్ధం తర్వాత జరిగిన ఘర్షణల గురించి ఈ పరిశోధనలో వివరించారు. ఈ మధ్య జరిగిన పౌర యుద్ధాల గురించి కూడా ఈ పరిశోధనలో పొందుపరచారు. బోస్నియా పౌర యుద్ధం తర్వాత సమాచారాన్ని పరిమితం చేయటము, ప్రజలను/ బృందాలను వేరు చేయటం వలన బాల్కన్ యుద్ధం ఈ రోజు వరకూ కొనసాగుతోందని ఈ పరిశోధన తేల్చింది.


 

 

బాల్కన్స్ లో ఈ విభాగాలకు ఎంతటి ప్రాముఖ్యత అంటే మూడు వేర్వేరు ప్రసార మాధ్యమాలు ఉండటం, పాఠశాలల్లో మూడు వేర్వేరు పాఠాలు చెప్పడం, విభిన్న కథనాలు వ్యాపించడం  జరుగుతోంది. ఈ విభజన వలన లాభ పడే వాళ్ళ వలన ఈ పరిస్థితి వచ్చింది.

నిజాలు మాట్లాడటంలో విభిన్న ఉదాహరణలున్నాయి. అవి ముక్కలైన సమాజాలను ఏకీకరించడంలో ఉపయోగ పడ్డాయి. పరివర్తన లో ఉన్న న్యాయ పద్ధతులు అంతిమ శాంతిని కల్పించలేవు. నిజాలు మాట్లాడుట ప్రక్రియ సరిగ్గా జరపక పోతే మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం వుంది.  ఇది మరిన్ని విపరీతాలకు దారి తీయవచ్చు. అందుకే బాధితులను, సమూహాలను  సరిగ్గా గౌరవంతో చూడాలి. అలాగే యుద్ధ నేరాలను సరిగ్గా లెక్కించాలి.  

అయితే నిజాలను మాట్లాడటం నుంచి వచ్చే  ఫలితాలను ప్రభుత్వము, పాలన, భద్రత వ్యవస్థల నిర్మాణంలో సరిగ్గా వినియోగించాలి. ఆర్థిక వ్యవస్థను రూపు దిద్దటం లోనూ వినియోగించి ఈ నూతన ప్రభుత్వ వ్యవస్థలు తమ కోసమే పని చేస్తాయనే భావనను ప్రజల్లో కలిగించాలి.

ఈ విధంగా ఈ పరిశోధన శాంతిని అభిలషించే వారికి, శాంతిని నిర్మించే వారికి అన్నీ విధాలా ఉపయోగం. పౌర యుద్ధాలు ఇప్పట్లో ఆగేలా లేవు. పాత పద్ధతులు పని చేయట్లేదు. అదే సమయంలో యుద్ధానంతరం నిజాలు మాట్లాడటం ఒక్కటే సరిపోదు కానీ ముఖ్యమైనదే.

మూలం: https://www.huffingtonpost.com.au/2016/08/14/war-is-easy-peace-is-hard-why-do-so-many-peace-processes-fail_a_21445470/

https://peacesimplified.blogspot.com/


Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War & Peace- Part 9

Thought Economics- War and Peace- Part 7