peace after war

               యుద్ధం తర్వాత శాంతి 

యుద్ధాలు క్లిష్టమైనవి:

శాంతిని నిర్మించడమనేది డా. వెస్తెండార్ఫ్ రక్తంలో ఉంది. 1996 నుండి 1998 వరకు ఆవిడ పాకిస్తాన్ లోని పెషావర్ లో నివసించింది.  ఆవిడ తల్లిదండ్రులు ఆఫ్ఘనిస్థాన్ లో యుద్ధం జరుగుతున్నప్పుడు మానవతా సహాయ పని వారుగా ఉండేవారు. వారి కుటుంబం పాకిస్తాన్ లోని ఆఫ్ఘన్ శరణార్థులతో లోతైన బంధం కలిగి యుండే వారు. ఆ అనుభవం డా.  వెస్తెండార్ఫ్లో కు  యుద్ధం, శాంతి ప్రక్రియలలో ఆసక్తిని పెంచింది.

పరిశోధనల నిమిత్తం ఆవిడ కాంబోడియా, నేపాల్, ఈస్ట్ టిమొర్, సైప్రస్, పాలస్తీనా దేశాలను పర్యటించారు. ఆసియా, యూరోప్, అమెరికాలలో విస్తృతంగా పర్యటించారు. 2015 లో ఆవిడ ఆక్రమించిన వెస్ట్ బాంక్ లో శాంతిని నిర్మించేవారితో కలసి పని చేశారు.

ఇప్పుడు ఆమె యుద్ధం తర్వాత పరిపాలన, భద్రత, పరివర్తన సమయంలో న్యాయ పద్ధతులలో విధాన పరమైన అభివృద్ధి పై కృషి చేయాలని కోరుకుంటున్నది. యుద్ధం తర్వాత గట్టిగా నిలబడే శాంతి ప్రక్రియలను నిర్మించాలని కోరుకుంటున్నది.  

దాదాపు 30 దేశాలు పౌర యుద్ధాలు లేదా హింసాత్మక ఘర్షణలతో బాధ పడుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.  యుద్ధం జరగకపోయినా అభద్రత పెరిగి  ప్రజలు గౌరవంతో బతకలేక పోవుట , మానవ హక్కులు లేకుండా బతుకుట, ఆరోగ్యం, విద్య వంటి సేవలు పొందలేకపోవుట వంటి స్థితులలో అనేక మంది వున్నారు.

పౌర యుద్ధాలు క్లిష్టమైన అంశాలతో ముడిపడి యుంటాయి. దీర్ఘ కాలంలో అవి పెరిగే కొద్దీ వాటిని ముగించడం చాలా కష్టంతో కూడిన పని. శాంతిగా ఉన్న దేశాలలోని వ్యవస్థలను యుద్ధ ప్రాంతాలలో ప్రవేశ పెట్టటం కష్టమైన పని.

స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరుపట, యుద్దం చేసే వారిని పరిపాలనా వ్యవస్థలలో పాల్గొనేటట్లు చేయుట, యుద్ధ నేరాల విషయంలో నిజం చెప్పించుట, ఏ నేరానికి ఎవరు బాధ్యులు అని నిర్థారించుట చాలా క్లిష్టమన విషయాలు.

ఎందుకంటే యుద్ధం చేసిన బృందాల మధ్య  అదే అపనమ్మకం, భయం కొనసాగుతోంది. ఇది ఆందోళనకు దారి తీసి మరలా యుద్ధానికి గానీ వేరే వారంటే భయానికి గానీ దారి తీయవచ్చును.  స్థూలంగా 1991 తర్వాత ముగిసిన ప్రచ్చన్న యుద్ధం తర్వాత జరిగిన ఘర్షణలపై ఆమె పరిశోధన జరిగింది. అంతర్జాతీయ సమాజం శాంతిని నిర్మించడం, నిరాయుధీకరణ, పరిపాలన వ్యవస్థలు మరియు భద్రతా వ్యవస్థలు  నిర్మించుట మొదలగు అంశాలపై ఆవిడ గురి పెట్టింది.

గతాన్ని అదుపులో వుంచి పరివర్తన న్యాయ వ్యవస్థ ఎలా రూపు దిద్దుకుంటున్నది (యుద్ధ నేరాల ట్రిబ్యూనళ్ళు, నిజాలు చెప్పించే కమిషన్లు, ప్రజలకు ఎలాంటి సేవ జరుగుతున్నది) అనేది ఆమె ఆలోచిస్తుంది. ఆఫ్రికా, ఆసియా, మధ్య తూర్పు, పసిఫిక్ ప్రాంతాలలో జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేసి అంతర్జాతీయ సమాజం భాగస్వామ్యం అయ్యే దశలలో  సారూప్యతలను తెలుసుకుంటుంది.

శాంతి ప్రక్రియలు వివిధ దేశాలు, వివిధ సందర్భాలలో ఎందుకు విఫలమవుతున్నాయి అని ఆవిడ అడుగుతున్నది. శాంతి- శాంతిని నిర్మించుటను  అంతర్జాతీయ సమాజం ఎలా అర్థం చేసుకుంటున్నది అది మరింత అసమానాత్వానికి/అస్థిరతకు దారి తీస్తున్నదా అని తెలుసుకోవాలని ఆమె అంటున్నది.   

ఒక ప్రాథమిక తప్పిదం  :

          ప్రస్తుత ప్రక్రియలు సంఘర్షణ మూలాన్ని అర్థం చేసుకొనవు అలాగే ప్రజలు శాంతిని ఆలింగనం చేసుకునేందుకు తగినంతగా చేయట్లేదు. కొన్ని సార్లు శాంతి ప్రక్రియలు ప్రజలను మరింతగా విడగొడతాయి. అవి సమస్యను మరింత జటిలం చేస్తాయి.  ఉదాహరణకు ఒక సందర్భంలో స్థాన భ్రంశం జరిగిన ప్రజలు, నాశనమైన మౌలిక సదుపాయాలు, బాగా దెబ్బతిన్న పర్యావరణం ఉండవచ్చును. దీని వలన ప్రాంతీయ, విశ్వ వ్యాప్త చిక్కులు ఉండవచ్చును. వీటివలన వ్యాధులు మరింతగా వ్యాప్తి చెందవచ్చును. అలాగే ఆయుధ వ్యాపారం జరిగి, వనరుల ఎక్కువ వాడకం జరిగి  వుండవచ్చును. తీవ్రవాద వ్యవస్థ కూడా వేళ్లూనుకుని ఉండవచ్చును. 

 

ఒకప్పుడు ఆయుధం పట్టిన వాళ్ళు ఇప్పుడు ఏమీ పని, ఆదాయం లేకుండా ఉండవచ్చును. వారిప్పుడు నేరాలకు గానీ కొత్త సాయుధ ప్రక్రియలు చేపట్టవచ్చును.

ఇంతకు ముందు పౌర యుద్ధం జరిగిన నేపథ్యం ఉంటే ఇప్పుడు యుద్ధం జరిగే అవకాశం ఎక్కువ. ఇంకో మాటలో చెప్పాలంటే ఇప్పటి యుద్ధాలు విఫలమైన శాంతి ప్రక్రియల ఫలితాలు. మరి యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎలా  అంతమవుతుంది?

అంతర్జాతీయ సమాజం చేసే ఎంపికలలో మరింత  వ్యావహారిక సత్తా వాదం ఉండాలి. సరైన వ్యవస్థలు, సామాజిక, రాజకీయ ఏర్పాట్ల ద్వారా శాంతి వస్తుందని ప్రజలు అనుకుంటారు. నిజానికి శాంతి అనేది చాలా లోతుగా పోటీ పడేది మాత్రమే కాకుండా అంతరాయం కలిగించేది కూడా.   

సాంకేతికత మీద ఆధారపడే పరిపాలన ఎన్నికలు, రాజ్యాంగము, సుపరిపాలన, అధికారులకు శిక్షణ, అవినీతి అంశాలపై గురిపెడుతుంది. కానీ కొంతమంది ప్రజలు ఆ వ్యవస్థలలో పాల్గొనమంటే ఎలా? ప్రభుత్వ వ్యవస్థలను పట్టించుకోకుండా వారికి కావలసిన వాటిని పొందటం సులభతరం చేసుకోవాలని కోరుకుంటారు. అందుకే ఎన్నికల సమయంలో హింస జరుగుతుంది.

        సయోధ్యకు దారి:  

మనం జీర్ణించుకోలేని అంశం ఒకటి ఉంది. మనం ఇంతకు ముందు వాడిన పద్ధతులు పని చేయట్లేదు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, దక్షిణ సూడాన్ లను చూడండి. ఇప్పుడు వాటి పరిస్థితి మరింత భయానకం. యుద్ధం మరలా ప్రారంభమయ్యింది. మనకు మంచి పరిష్కారాలు కావాలి. సరైన అనుకూల మార్పు లేకుంటే అంతర్జాతీయ శాంతికి వనరులు కల్పించెందుకు ఎవరూ సిద్ధంగా లేరు.

సాంప్రదాయకంగా సూచించే సాంకేతికతతో కూడిన వ్యవస్థ మార్పులు కూడా పనిచేయట్లేదు. ప్రజలు ఎందుకు వాటిలో పాల్గోవట్లేదో ఆలోచించట్లేదు.  

మంచి ప్రణాళికతో, అనువైన, సంచలనమైన శాంతి ప్రక్రియలు నిర్మించవచ్చు. ప్రజలు ఎన్నికల సమయంలో ఎందుకు హింసకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవాలి. యుద్ధ నేర ట్రిబ్యునల్లను రాజకీయ నాయకులు ఎలా లొంగదీసుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో వారి గొంతు వినిపించటానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వారి ఆత్మ విశ్వాసం శాంతికి చాలా అవసరం.

ఈ చర్చ అంతా ప్రపంచంలో “సుస్థిర శాంతి” మరియు “హింసకు అంతం” కోసమే!

Dr Jasmine-Kim Westendorf is lecturer in International Relations in La Trobe University’s Department of Politics, Media and Philosophy, and Director of the Bachelor of International Relations.

మూలం: https://www.latrobe.edu.au/our-work/the-complexities-of-peace/peace-after-war-what-goes-wrong

https://peacesimplified.blogspot.com/



Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War and Peace- Part 7

Thought Economics- War & Peace- Part 9