How to achieve world peace in 10 steps

ప్రపంచ శాంతి సాధనకు 10 అడుగులు

 

మన భూమి మీద, ప్రపంచం మీద ఒత్తిళ్ళు అధికంగా ఉన్నాయి.

అవి మరింతగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మిలిటరీ మీద ఆధారపడటం, దాన్ని

ఉపయోగించటం ప్రపంచం తగ్గించుకోవాలి.  తదుపరి సంఘర్షణలను కూకటి వేళ్ళతో సహా

పెకలించేందుకు కృషి చేయాలి.  

1. ప్రజలకు అవసరమైనవి, రావలసినవాటిని అందేటట్లు చేయడం :

ఎక్కడైతే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండదో, ఎక్కడైతే ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండదో మరియు ఎక్కడైతే ఒక సామాన్య జీవితాన్ని గడపడానికి అవినీతి  ప్రభుత్వాల వలన వీలు పడదో అక్కడ ఆ ప్రదేశాల్లో సంఘర్షణ జరిగే అవకాశం ఎక్కువ అని పరిశోధనలు  సూచిస్తున్నాయి. తమ ప్రజల వెనుకబాటుతనాన్ని, వారిని నిర్లక్ష్యం చేయటాన్ని, వారిని దుర్వినియోగం చేయటాన్ని, వారిని దూరంగా పెట్టటాన్ని ప్రభుత్వాలు ప్రతి చోటా ఆపివేయాలి. “వారు వేరే మనం వేరే” అనే ఆలోచనను ద్వేషాన్ని పెంపొందించే ఆలోచనలను ప్రసార మాధ్యమాలు వ్యాప్తి చేయకుండా మనం వాటిని ఎదుర్కోవాలి.

2 స్త్రీలు, పురుషుల మధ్య నిజమైన సమానత్వాన్ని తీసుకురావడం

ఏ దేశంలో అయితే  స్త్రీలు  పురుషుల మధ్య భేదం ఎక్కువగా ఉంటుందో  అక్కడ హింసతో కూడిన సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తెలుపుతున్నాయి.  లింగ అసమానత్వం స్థూల దేశీయ ఉత్పత్తిని (జి‌డి‌పి), ప్రజాస్వామ్య స్థాయిని ప్రభావితం చేస్తుంది. జాతి/మత గుర్తింపు ప్రాతిపదికగా అంతర్గత/ బాహ్య ఘర్షణలకు లింగ అసమానత్వం మూల కారణంగా తోడ్పడుతుంది. ఎక్కడైతే మహిళలు శాంతి ప్రక్రియలకు తోడ్పడతారో అక్కడ శాంతి ఎక్కువ కాలం నిలిచే/గెలిచే అవకాశం ఎక్కువ.

3  సంపదను నిష్పాక్షికంగా పంచుట

ఎక్కడైతే ఆర్థిక ఆవకాశాలు ఉండవో,  అక్కడ 40 శాతం మంది విప్లవ/ తిరుగుబాటు బృందాల్లో యువత మరియు సభ్యత్వం తీసుకుని తీవ్రవాద కార్యక్రమాలలో పాల్గొంటారని ఒక ప్రపంచ బ్యాంక్ సర్వే చెబుతోంది. సాపేక్ష పేదరికం ఎంత ముఖ్యమో ఎక్కువ స్థాయి నమ్మకంతో కూడిన సరి సమాన సమాజాలు ఉండటమూ అలాగే అతి తక్కువ స్థాయి హింస ఉండటమూ అంతే ముఖ్యం. ప్రజా వనరులు, పన్నులు, పన్నుల ఎగవేత మొదలగు విషయాల్లో ఆర్థిక సరి సమానత్వం పాటించటం ముఖ్యం. సంపన్నుల నుండి పేదవారికి క్రమ పద్ధతిలో సంపద బదిలీ  చేయుట అందరికీ భద్రత కల్పిస్తుంది.

 

4 పర్యావరణ మార్పును సరి చేయుట

తూర్పు ఆఫ్రికాలో భూమి, నీరు అంశాలలో సంఘర్షణలు గ్లోబల్ వార్మింగ్ వలన మరింతగా వాతావరణ మార్పులకు దారి తీస్తున్నవి. ఐక్యరాజ్య సమితి రూపొందించిన పర్యావరణ ఒప్పందం లో లోపాలున్నప్పటికీ యుద్ధానికి బదులుగా సహకారంతో ప్రపంచ దేశాలు తమ సమస్యలను/ సంఘర్షణలను ఎదుర్కోగలరని సూచిస్తోంది. పనిచేసే పర్యావరణ ఒప్పందం అతి ముఖ్యమైన ఒక శాంతి ఒప్పందంగా మనం భావించవచ్చు.  

5 మారణాయుధాల కొనుగోళ్ల నియంత్రణ

మారణాయుధాల కొనుగోళ్లు, వివిధ దేశాల మిలిటరీ/సైనిక సామర్థ్యాలు విశ్వ వ్యాప్త సంక్లిష్ట పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఆయుధాల విశ్వ వ్యాప్తి ఎక్కువ హింసకు వీలు కల్పిస్తోంది.  ఏవైతే ఆయుధాల ఒడంబడికలు జరుగుతున్నాయో వాటి అమలుకు నాయకులు కట్టుబడుతున్నారా లేదా అని మనం గమనిస్తూ ఉండాలి. ఒప్పందాల అతిక్రమణలను మనం కనిపెట్టి అమ్మేవారిని జవాబుదారులుగా చేయాలి. అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టి ఒడంబడికలకు మనం సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉండాలి. వాటిని కలిగి ఉండటము, వాడటం చట్ట విరుద్ధం చేయాలి.

 

6 గర్వాన్ని మరింత తగ్గించుకుని ఎక్కువ విధాన మార్పులు చేయాలి 

తీవ్రవాద నిర్మూలన, మాదక ద్రవ్యాల మీద యుద్ధం, వలస వాద  యుద్ధాలు నెమ్మది నెమ్మదిగా విఫలం అవుతున్నాయి. వినయం, అణకువ ఈ  సందర్భాలలో చాలా ముఖ్యం. పాత తరం తప్పులకు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ వాతావరణంలో ఇవి చాలా ముఖ్యము. స్వార్థ రాజకీయాలకు తెర దించాలి.      

 

 

 

7 రాజకీయ రంగ పరిరక్షణ

యువత, అణగారిన ప్రజలు సంఘంలో భాగంగా భావించాలంటే, వారు అహింసా, ప్రతీకార పద్ధతులను విడనాడాలంటే ప్రభుత్వం “ప్రజలు  అసమ్మతిని వ్యక్తపరచటాన్ని” అనుమతించాలి.  తాత్కాలిక పరిపాలన నియంత్రణ, తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాల దుర్వినియోగం, విచక్షణ లేని అరెస్టులు, నిర్బంధాలు, హత్యలు మొదలగు వాటి నుండి రాజకీయ రంగాన్ని పరిరక్షించుకోవాలి.  

 

8 తరాల మధ్య అంతరాలను తగ్గించుట

సాధారణంగా వృద్ధులచే నడవబడే అవినీతి వ్యవస్థలమీద యువకుల తిరుగుబాటులను మనం గమనిస్తూ ఉంటాము. ఏదైతే దేశాల్లో వయస్సు ఆధారిత పరిపాలన/ సామాజిక వ్యవస్థలుంటాయో అక్కడ యువత తమ అభిప్రాయాలు  వెల్లడించటానికి వీలు పడదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీస్తుంది. ఎవరైతే బాధితులో వారి మీదే నింద పడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో యువతనే “పేలటానికి సిద్ధంగా ఉన్న ఒక టైమ్ బాంబ్ “గా భావించటం జరుగుతుంది.   

9 సమగ్ర శాంతి ఉద్యమాన్ని నిర్మించుట

చురుకైన శాశ్వత శాంతి ఉద్యమాలను నిర్మించుట నెమ్మదిగా మొదలై,  తాత్కాలిక యుద్ధ ఉద్యమాలను స్థాన భ్రంశం చేస్తున్నాయి.  అహింసతో కూడిన ప్రత్యామ్నాయాలను, విజయాలకు మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. వీటిని ఇతర సామాజిక ఉద్యమాలతో జత కలపాలి. యుద్ధ ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొని,  పేదరిక కారణభూతంగా చూస్తూ ఉద్యమాలు వివిధ దేశాలలో జరిగాయి.  

10 స్వీయ పరిశీలన

మీతోనే శాంతి మొదలవుతుంది. సాధారణ పౌరులు కూడా ప్రభావం చూపొచ్చు. నీవు క్షమాపణలు అడిగి ఎన్నాళ్లయింది? నీవు గెలిచినప్పుడు ఎవరు ఓడిపోయారు? నీ చుట్టూ పక్కల ఉన్నవాళ్లు ఎవరైనా వారి అభిప్రాయాలు  వింటానికి కూడా వీలు లేకుండా, తిరస్కారానికి గురై ప్రక్కకు పెట్టేయబడినవారుగా మిగిలిపోయారా? వారి గురించి వారికి ఏం జరుగుతోందో అని ఆలోచించి తగు నిర్ణయం తీసుకో! మీతో విబేధించే చే వారితో మాట్లాడానికి ప్రయత్నం చేయి. “వారు- మేము” అనే భావనను ఎదిరించండి. మన సమాజం శాంతియుతంగా ఉండాలన్నా లేదా  అన్యాయంగా ఉందన్నా మన పాత్ర ముఖ్యంగా ఉంటుంది.    

New Internationalist issue 515 magazine cover

మూలం/ ఆధారం https://newint.org/features/2018/09/18/10-steps-world-peace

https://peacesimplified.blogspot.com/


Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War & Peace- Part 9

Thought Economics- War and Peace- Part 7