Healing Violent Societies Part-1
ప్రపంచము లోని హింసాత్మక సమాజాలకు వైద్యం చేయాలి (భాగం- 1)
శాంతితో ఉన్నామని గొప్పగా
చెప్పుకునే అనేక సమాజాలు నిజానికి శాంతికి దూరంగా ఉండి, స్థానిక హింసను
అనుభవిస్తున్నాయి. హింసను పూడ్చిపెట్టటానికి కొత్త తరం పరిష్కారాలను
ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నమ్మలేనప్పటికీ చరిత్రలో మనకు అత్యంత శాంతి కాలం నడుస్తోంది. గత కొన్ని
శతాబ్దాలుగా నరహత్యలు తగ్గుబాట పట్టాయి. అంతర్జాలంలో భయానక కథనాలు వస్తున్నప్పటికీ
దేశాల మధ్య జరిగే యుద్ధాలలో హింసాత్మక మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్, దక్షిణ సూడాన్, సిరియా మరియు యెమెన్ లలో జరుగుతున్న ఘర్షణతో కూడిన పౌర యుద్ధాల వలన మరణాలు చెప్పలేనంతగా పెరిగాయి. అయినప్పటికీ
ప్రచ్చన్న యుద్ధం ముగియకముందు కాలంతో పోల్చుకుంటే పరిస్థితి మెరుగ్గానే ఉంది అని
చెప్పవచ్చు. అలాగే తీవ్రవాదం వలన జరిగే మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయని
చెప్పవచ్చు.
శాంతి, భద్రత రంగంలో
ఇప్పుడు జరుగుతున్నా శుభ పరిణామాలన్నీ యాధృచ్ఛికంగా జరిగినవి కావు. ప్రచ్చన్న
యుద్ధం ముగియటం ఒక చరిత్రాత్మక పరిణామం. అయితే ఇప్పుడున్న ప్రపంచ శాంతికి ముఖ్య
కారణం యుద్ధప్రక్రియను, తీవ్రవాదమును అంతమొందించేందుకు
విధానాలకు రూపకల్పనకు పెట్టిన పెట్టుబడి. అలాగే మంచి పోలీసింగ్, నేరనివారణకు పెట్టిన పెట్టుబడులు కూడా హింసాత్మక నేరాల తగ్గుముఖానికి
దారితీసింది.
అయితే
దీని వెనకాల ఒక చీకటి కోణం ఉంది. శాంతితో ఉన్నామని చెప్పుకునే అనేక సమాజాలు
నిజానికి శాంతికి దూరంగా ఉన్నాయి. యుద్ధాల సమయం కంటే స్థానిక హింస ఈ ప్రాంతాలలో
జరుగుతోంది. ఈ పరిస్థితులను మెరుగుపరచాలంటే మరింత ఉన్నత స్థాయి పాలనను అందించటమే కాక సాంప్రదాయక శాంతి పద్ధతులను
విడనాడాల్సి రావచ్చు. సాంప్రదాయక భావం ప్రకారం యుద్ధం అని పిలవలేని దేశాలలో , పట్టణాలలో 90 శాతం మరణాలు నేడు జరుగుతున్నాయి. లాటిన్
అమెరికా, కరీబియన్ దేశాలలో మాదక ద్రవ్యాలు అమ్మే గ్యాంగులు, మాఫియా బృందాల హింస అత్యంత ఎక్కువ స్థాయిలో ఉంది. అలాగే ఈ సమయాలలో మరియు
సందర్భాలలో దేశ పోలీస్/సైనిక వ్యవస్థ తమ దేశ ప్రజలతోనే తీవ్ర పోరాటంలో ఉన్నారు.
వ్యవస్థీకృత నేరం, రాజ్య అణచివేత
అందరూ అనుకున్నట్టు వేరువేరు కావు, అవి రెండూ పెనవేసుకుని
అత్యధిక మరణాలకు కారణమవుతున్నాయి. రాజకీయ నాయకులు, పోలీసు, న్యాయనిర్ణేతలు తరచుగా మాఫియా బృందాలతో కుమ్మక్కు అవుతున్నారు. మరణాల
సంఖ్యను, చర్యలను తక్కువగా చూపించడంలో ఈ రెండు పార్టీలు
సిద్ధ హస్తులు. ప్రపంచ స్థాయి నేర, మరణాల సంఖ్యలో ఇవి
కనపడకుండా జాగ్రత్తపడతారు. ఇటువంటి హింసను మనం అదుపులోకి తీసుకురాలేక పోవచ్చు
కూడా!
ఈ సవాళ్లు కేవలం పేద, తేలికగా చీలిపోయే
దేశాలకే పరిమితం కావట్లేదు. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన 50 పేద దేశాల పట్టికతో
ఎక్కువ హింస జరుగుతున్న దేశాల పట్టికతో పోలిస్తే కేవలం 4 దేశాలు రెండు పట్టికలలో
కనిపిస్తున్నాయి. ఇంకా గమనిస్తే మధ్య సరి ఆదాయం/సంపాదన ఉన్న దేశాలు మాత్రమే ఎక్కువ హింసను చవి
చూస్తున్నాయి. కాస్త మంచిగానే సంపాదన
ఉన్న దక్షిణ ఆఫ్రికాలో దక్షిణ సూడాన్ కంటే రెండు రేట్ల మరణాలు/హింస జరుగుతున్నాయి.
ఇరాక్ కంటే ఫిలిప్పీన్స్ లో ఎక్కువమంది పౌరులు చనిపోయారు. ఎక్కువ హింస జరిగే
పట్టణాల పట్టికలో 15 మెక్సికోలో, 14 బ్రెజిల్ లో, 4 అమెరికాలో ఉన్నాయి. పేదరికం కాదు, అసమానతలు ఈ
మరణాలకు/హత్యలకు ముఖ్య కారణం. పేదరికం కిందకు
పడిపోయే కొలదీ, అసమానతలు తరచుగా పెరుగుతున్నాయి.
అంతర్జాతీయ
సమాజం దగ్గర రాజ్య హింసలనూ, నేర మయమైన హింసలను పరిష్కరించేందుకు ఎటువంటి పరికరాలూ లేవు. సంప్రదాయ
శాంతి ఒప్పందాలు/ ఒడంబడికలు, శాంతిని కుదుర్చేవారు ఈ పనులకు
పనికి రావు/రు. అభివృద్ధి సంస్థలకు పాత్ర వుంది- కానీ కేవలం పేదరికం నిర్మూలించే
కార్యక్రమాలు ఇక్కడ పనికి రావు. నిజానికి
దేశ ప్రభుత్వ సామర్థ్యాన్ని మరింత పెంచే చర్యలు సమస్యను మరింత జటిలం చేస్తాయి.
రాజకీయ నాయకులకు హింసను తగ్గించాలనే తలపు
లేనప్పుడు, వారికి సామర్థ్యం లేనప్పుడు అంతర్జాతీయ సమాజం
పాత్ర పరిమితమే- ఎందుకంటే నాయకులు అటువంటి అభివృద్ధి సంస్థలను నిషేధించే అవకాశం
ఎక్కువ. హింసను తగ్గించాలంటే కొత్త
పరికరాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
యుద్ధం, తీవ్రవాదం –
మారుతున్న ముప్పులు
మానవాళి
మనుగడకు/ఉనికికి యుద్ధం ఎల్లప్పుడూ ఒక పెను ముప్పే! నాగరికతనే సర్వనాశనం చేసే
యుద్ధం తన దూర బిందువుని చేరుకుంది. 1940 దశకం చివరి నుండి కొన్ని ప్రత్యేక/
ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకొనడం
ప్రారంభమైంది. దేశాల మధ్య, పౌర యుద్ధాలు బాగా తగ్గినవి. అర్థ శతాబ్దం తర్వాత
అమెరికా, రష్యాలు వైరి పక్షాలకు తమ మద్దతును
ఉపసంహరించుకున్నాయి. 2018 నాటికి యుద్ధ మరణాలు సాలుకి 53000 కంటే తక్కువే జరిగినవి.
అయితే
అమెరికా గుత్తాధిపత్యం బలహీనపడటం, ప్రాంతీయ రాజకీయాలు మరలా తలెత్తటం వలన యుద్ధ ఛాయలు
మరలా కమ్ముకున్నాయి. దీనికి ఉదాహరణ ఇరాక్, సిరియా, యెమెన్ లలో జరుగుతున్న పరిణామాలే. అయితే
ఈ యుద్ధాల గడువు సమయాలు
చిన్నవి. అయినప్పటికీ వీటి
ప్రభావం చాలా ప్రమాదకరం.
మూడు
సమాంతర ధోరణుల
వలన ప్రస్తుత యుద్ధాలను ఆపడం చాలా కష్టం.
మొదటిది పాతతరం దేశాల మధ్య యుద్ధాల
లాంటివి కాదు ఈ యుద్ధాలు. పౌర యుద్ధాలని కూడా వీటిని పిలవకూడదు. ప్రస్తుతం
జరుగుతున్న 52 సంఘర్షణలలో 18 సందర్భాలలో బయటి దేశాలు తమ సైన్యాలను ఏదో ఒక
పక్షానికి పంపుతున్నాయి. ఇవి మరింత ప్రమాదమైనవి,
పరిష్కరించుటకు కూడా జటిలమైనవి. ఈ యుద్ధాలలో హింస ఎక్కువ,
ఎక్కువ కాలం జరుగుతాయి.
రెండవది ప్రభుత్వేతర సాయుధ బలగాలు
యుద్ధంలో పాల్గొనడంతో రక్తపాతం గుణించబడుతోంది. ఒక్కో యుద్ధంలో 3 నుండి 9 వరకు వైరి పక్షాలు వుంటున్నాయి. లిబ్యా, సిరియా సందర్భాలలో నిజంగా వందల కొద్దీ వైరి
పక్షాలు ఉంటున్నాయి. అట్టి సందర్భాలలో యుద్ధాన్ని ఆపటం చాలా కష్టం.
మూడవది. ఇవ్వాల్టి సమయంలో యుద్ధం చేసే వాళ్ళు మాదకద్రవ్యాల
వ్యాపారులతో, నేర బృందాలతో, మాఫియా బృందాలతో, తిరుగుబాటుదారులతో చేతులు కలుపుతున్నారు. అటువంటి సందర్భంలో యుద్ధం నుండి
లాభపడుతున్న వారు ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, పోరాడే వారు శాంతి ప్రక్రియను మరింత జటిలం చేస్తారు.
20వ
శతాబ్దంలో చాలా కాలం చాలా ప్రభుత్వాలు తీవ్రవాదాన్ని కింది స్థాయి సమస్యగా
భావించేవారు. 9/11 సంఘటన తీవ్రవాదాన్ని విశ్వ సమస్యగా మార్చింది. ఒక దశాబ్దం పాటు
తీవ్రవాద ఘటనలు పెరిగిపోయాయి. కానీ 2014 నుండి ఈ సంఘటనలు 44 శాతం తగ్గిపోయాయి.
తీవ్రవాద
ప్రాంతీయ పరిధి క్రమంగా మారింది. కేవలం 7 దేశాలలో 90% తీవ్రవాద సంఘటనలు
జరుగుతున్నాయి. అవి:
1
ఆఫ్ఘనిస్తాన్
2
ఇరాక్
3
నైజీరియా
4
పాకిస్తాన్
5
సోమాలియా
6
సిరియా
7
యెమెన్
10000
కంటే ఎక్కువ తీవ్రవాద హత్యలు (మొత్తం 19000- 2017లో) కేవలం 4 బృందాలచే చేయబడినవి:
స్వయం ప్రకటిత ఇస్లామిక రాజ్యం, తాలిబాన్, అల్ షబాబ్, బొకో హరామ్. గత దశాబ్దంలో సగం పైగా హత్యలకు వీరే కారణం. తీవ్రవాదం ఈ
రోజున ఒక అక్రమ యుద్ధం.
దీర్ఘ
కాలంలో తీవ్ర వాదాన్ని నిర్మూలించాలంటే అది ఎందుకు ఆవిర్భవించిందో అర్థం చేసుకుని
తగు పరిష్కారాలు ఇవ్వాలి. ముఖ్యంగా అసమానతలతో కూడిన పాలన మరియు రాజకీయంగా
సామాజికంగా కొన్ని వర్గాలను దూరం పెట్టుట
తీవ్రవాదానికి ముఖ్య కారణాలు.
https://carnegieendowment.org/2019/10/14/no-war-no-peace-healing-world-s-violent-societies-pub-80034
Comments
Post a Comment