Healing violent Societies Part-2
ప్రపంచ హింసాత్మక సమాజాలకు వైద్యం చేయాలి (భాగం 2)
పెరుగుతున్న రాజ్య హింస
17
వ శతాబ్దంలో ఆధునికముగా దేశాలు ఏర్పాటు అయినప్పటి నుండి అవి తమ జనాభాను హింసతో
నియంత్రించాయి. ఈ బలవంతపు పరిష్కారం- ఉన్న
వ్యాధి కంటే మరింత ఘోరపరిస్థితులకు దారి తీశాయి. ఒక అంచనా ప్రకారం 20 వ శతాబ్దంలో
26.2 కోట్ల మంది ప్రజలను వారి ప్రభుత్వాలే
హత్య చేశాయి. ఈ సంఖ్య అంతర్జాతీయ, పౌర యుద్ధాలలో చనిపోయిన వారి కంటే 6 రెట్లు
ఎక్కువ. చైనా, సోవియట్ యూనియన్,
కాంబోడియా వంటి కమ్యూనిస్ట్ దేశాలలో
ఎన్ని
వాదనలున్నప్పటికీ రాజ్య హింస కొనసాగుతూనే ఉంది. ఈ రోజున పౌరులపై హింసకు ఎక్కువ
కారకులు రాజ్య హింసలే. రాజ్యము, దాని భద్రతా దళాలు, పారా మిలిటరీలు, వ్యవస్థీకృత నేరగాళ్ల కలయికతో ఉన్న
భాగస్వామ్యాల వల్లనే ఈ హత్యలు జరుగుతున్నాయి.

రాజ్య హింస, నేర వ్యవస్థలతో పోరాటం
ముందుగా ఐక్య రాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు
లాంటి బహుపాక్షిక సంస్థలు తమ ప్రమాద/రిస్క్ విముఖతను తగ్గించుకుని ప్రమాదకర దేశాలతో
చురుగ్గా మెలగాలి. ఈనాటి హింసను తగ్గించాలంటే ఆయా దేశాల రాజకీయ, సాంఘిక, ఆర్థిక అసమానతలు తగ్గించాలి. కలుపుకుని
పోయే నిర్ణయ వ్యవస్థను ఏర్పరచాలి. లింగ వివక్షతను, అసమానతలను
తగ్గించడం కూడా హింసను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
భద్రతా
వ్యవస్థ బడ్జెటును పారదర్శకంగా ఉంచాలని ప్రపంచ బ్యాంకు ఒక కార్యక్రమాన్ని
నడుపుతోంది. అయితే వీటి ప్రభావం అంతంత మాత్రమే. వీటి ప్రభావం కూడా కొద్ది కాలమే.
అందుకే పౌరులను, పౌరసత్వాన్ని చురుకుగా చేసేందుకు అంతర్జాతీయ సంస్థలు కృషి చేయాలి.
రాజ్యానికి, పౌరులకు
మధ్య బంధాన్ని మార్చడం ద్వారానే రాజ్య హింసను అరికట్టగలము. మధ్యతరగతి ప్రజలకు సాంఘిక బలోపేతం చేయడం
ద్వారా రాజకీయ, ఆర్థిక మార్పు జరుగుతుంది. అప్పుడే విజయం
దక్కుతుంది. విజ్ఞానమును చొప్పించుటతో
బాటు జవాబుదారీతనాన్ని అమలు చేసేలా చూడాలి.
పౌర
సమాజాన్ని, మాట్లాడే స్వేచ్ఛ, సమావేశమయ్యే హక్కులను
కాపాడేందుకు ప్రభుత్వ/ప్రైవేటు దాతలను భాగస్వామ్యం చేయాలి. చాలా దేశాలలో
ప్రతిపక్షాలు స్థానిక వ్యాపారాల మీద ఆధారపడతాయి. అలాగే ఈ బయటి దాతలు ఎవరికైనా హాని
తలపెట్టకూడదు. ఎక్కడైతే అవినీతి రాజకీయ
నాయకులు హింసను ప్రేరేపిస్తున్నారో విదేశీ ప్రభుత్వాలు భద్రతా సహాయాన్ని
ఆపివేయాలి.
ప్రైవేటు
మరియు సామాజిక రంగాలు చాలా ముఖ్య పాత్రను వహిస్తాయి. దుబాయి, లండన్, న్యూయార్క్, షాంఘై , సింగపూర్
వంటి అంతర్జాతీయ వీత్త /ఆర్థిక/ స్థిరాస్థి
కేంద్రాలు తమ వ్యవస్థలను నియంత్రించి నేరస్తులను,
రాజకీయ నాయకులను కట్టుదిట్టం చేయ వచ్చును.
చివరగా దౌత్య రంగంలో, మధ్యవర్తి విషయాలలో మరింత
పరిశోధన అవసరం. అలాగే శరణార్థుల చట్టాలలో
మార్పు తీసుకురావాలి. సిరియా, లాటిన్/ సెంట్రల్ అమెరికాల, సిరియా మొదలగు దేశాలనుండి శరణార్థులు పెద్ద ఎత్తున వలస పోయారు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తొలినాళ్లలో మేధో, ద్వైపాక్షిక/
బహుపాక్షిక శాంతి ప్రయత్నాలు వెంటనే యుద్ధం రాకుండా పనిచేశాయి. సామూహిక హింస
విశ్వమంతా తగ్గినది. కానీ ఇప్పుడు మరల హింస ఇప్పుడు కొత్త రూపాలు సంతరించుకుని
పెరుగుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం
ప్రతి 6 మందిలో ఒకరు హింసకు గురవుతున్నారు. తమ ఆర్థిక, మేధోపరమైన వనరులను నేర వ్యవస్థను, నేర ప్రభుత్వాలను
నిలువరించేందుకు అంతర్జాతీయ సమాజం ఉపయోగించేందుకు సమయం ఆసన్నమైంది.
ముగింపు
మూలం https://carnegieendowment.org/2019/10/14/no-war-no-peace-healing-world-s-violent-societies-pub-80034
Comments
Post a Comment