5 honorable personalities and their efforts to achieve World Peace
ప్రపంచ
శాంతిని, అహింసను ప్రోత్సహించిన
5 ప్రముఖులు
అహింసను పాటించడం ద్వారా కోట్లమంది ప్రజల ప్రేమను,
గౌరవమును పొందవచ్చని జీవితములో అత్యున్నత ఆశయాలను అందుకోవచ్చని దలైలామా, మార్టిన్
లూథర్ కింగ్,
మహాత్మా గాంధి, జైన్
తీర్థంకర ఋషభనాథ, గౌతమ
బుద్ధ రుజువు చేశారు. వారి క్లుప్త వివరాలు
ఇక్కడ పొందుపరచబడినవి.
1. గౌతమ బుద్ధ
క్రీ పూ 6 వ శతాబ్దంలో సిద్ధార్థ గౌతమ గా గౌతమ బుద్ధ
జన్మించారు. ఈయన బోధనలు బుద్ధ మతానికి జన్మనిచ్చాయి. ఈయన ఆధ్యాత్మిక నాయకులు . ఈయన
తన యుక్త వయస్సులో వివిధ మతాల బోధనను
అధ్యయనం చేసి తర్వాత ఒక మునిగా కాలం గడిపారు. తద్వారా మరియు తదనంతరం మత
నాయకుని పాత్ర వహించారు.
మునిగా జీవించటంలో ఆత్మ జ్ణానము పొందలేక మధ్యంతర మార్గంగా జీవించడం
ప్రారంభించారు. ఇది మంచి ఫలితాన్నిచ్చి జీవితాన్ని సంతులనాత్మకతో జీవించాలని
ప్రజలు మధ్యే మార్గంలో పయనించాలని బోధించడం ప్రారంభించారు. తీవ్రమైన హింసా మార్గాలను
విడనాడాలని సూచించారు.
మానవుల బాధలకు
కారణాలను కనుగొనాలని ఒక రాత్రంతా ధ్యానం చేసి శుద్ధ ఆత్మ సాక్షాత్కారం పొందారు. ఈ
సందర్భంలో ఆయన “బుద్ధ” గా పేరు పొంది ఆయన నేర్చుకున్న విషయాలను అందరికీ బోధించడం
ప్రారంభించారు. ఈయన బోధనలు ‘అష్టాంగ మార్గం, నాలుగు విలువైన సత్యాలు”గా పేరు పొందాయి. ఈ రెండూ బుద్ధ మతానికి
పునాదులుగా ఏర్పడ్డాయి. వర్గాలు, వర్ణాలు, జాతులు, లింగ, నేపథ్యం వంటి
వివక్ష లేకుండా తన అనుచరులలో ఏకత్వం ఉండేలాగా తన ఉద్యమాన్ని బలపరచారు. మానవ బాధలను
అంతమొందించుట, ఆత్మ జ్ణానము పొందుట సాధించుట మీద ఆధారపడిన ఆయన బోధనలు, ఆలోచనలు ఇతర మతాల మీద ప్రభావం చూపించాయి. ఇతర మత రచనలు, ఆధ్యాత్మిక నమ్మకాలమీద కూడా బుద్ధుని ఆలోచనలు ప్రభావితం చూపాయి.
2. జైన తీర్థంకర ఋషభ నాథ :-
జైన మతానికి
సంబంధించి మొదటి ప్రబోధకులు ఋషభ నాథ. క్రీ పూ మొదటి శతాబ్దం నుండి ఋషభ నాథున్ని
కొలుస్తున్నారని ఆధారాలున్నాయి అని పేర్కొనబడినది. ఆదిమ నాగరికత నుండి వ్యవస్థీకృత
జీవనశైలికి మారటము లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఆయన పరిపాలన ప్రజా రంజకంగా
శాంతియుతముగా సాగింది. ఆయనకు ఒక యోధుని శరీర ఆకారం ఉన్నప్పటికీ అహింస, శాంతిని ప్రోత్సహించారు. ఆయన కఠినమైన, ఆర్భాటాలకు
పోని జీవన శైలిని పాటించారని చెబుతారు. ఈ సమయంలో ఆయనకు సర్వ జ్ణానమ్ పొంది జైన మత
సందేశాన్ని వ్యాపింప చేశారు. అహింస, ఆస్తుల మీద ప్రేమ
లేని భావన, నిరంకుశత్వము లేని సమాజం జైన మతంలో ప్రధాన
భావనలు. జైన మతస్తులు ఇప్పటికీ ఈ భవనాలు నమ్ముతూ ఉంటారు. వారు ఈ జీవన శైలిని
పాటిస్తూ, శాకాహారం, ప్రార్థన, ధ్యానం, ఇతర మానవులతో శాంతియుత సంబంధాలు కొనసాగిస్తారు.
3. మహాత్మా గాంధీ
ప్రపంచం
మొత్తం అహింస, శాంతి విషయంలో మీద అత్యంత ప్రాచుర్యం మరియు గౌరవం పొందిన నాయకులలో మహాత్మా
గాంధీ బహుశా మొదటివారు. ఆయన బ్రిటన్ ప్రభుత్వం నుండి భారత దేశానికి స్వాతంత్రం
సంపాదించే శాంతియుత ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన పాటించిన శాంతియుత పద్ధతులు ప్రపంచం
మొత్తములో పౌర ధిక్కార పద్ధతులకు మార్గదర్శకం అయినవి. పెద్ద ఎత్తున భారత దేశం
అంతటా బహిష్కరణ ఉద్యమాలను గాంధి నడిపారు. ఆయన నడిపిన శాంతియుత ఉద్యమాలలో మచ్చుకు
కొన్ని:
·
పిల్లలను
పబ్లిక్ స్కూళ్ళకు పంప వద్దని తల్లితండ్రులను కోరుట
·
బ్రిటిష్
ప్రభుత్వానికి పని చేయవద్దని ప్రభుత్వ అధికారులను కోరుట
·
మిలిటరీ
సిబ్బందిని తమ తమ ఉద్యోగాలకు పని చేయవద్దని, రాజీనామా చేయమని కోరుట
·
ప్రభుత్వానికి
పన్నులు చెల్లించవద్దని పౌరులను కోరుట
·
బ్రిటిష్
ప్రభుత్వ వస్తువులను కొన వద్దని,
ప్రోత్సహించవద్దని కోరుట
గాంధి గారు
ముస్లిముల హిందువుల మధ్య శాంతి నెలకొల్పేందుకు కూడా కృషి చేశారు.
ఉప్పు
సత్యాగ్రహం, దండి మార్చ్ ఆయన
చేపట్టిన కార్యక్రమాలలో ముఖ్యమైనవి. ప్రజలు దండి మార్చ్ కొరకు దాదాపు 240 మైళ్ళు
ప్రయాణించి అరేబియన్ సముద్రం చేరుకుని అక్కడ ఉప్పును పండించి దానిని సేకరించి బ్రిటిష్
ఉప్పు చట్టాన్ని ధిక్కరించుట ఉప్పు సత్యాగ్రహంలో భాగమే. 24 మందితో ప్రారంభమయిన ఈ
ఉద్యమం సముద్రాన్ని చేరేటప్పటికి 60000 మండి భాగస్వామ్యం ఆయారు. 78 సంవత్సరాల
వయస్సులో సాటి ముస్లిములతో సఖ్యత కోరని హిందువు చేతిలో గాంధి మరణించారు. ప్రపంచ
శాంతి కోరెవారి మదిలో గాంధీజీ ఒక గట్టి జ్ణాపకం గా గుర్తుండిపోతారు. ఆయన శాంతి
వాదం, పౌర ధిక్కారణ పద్ధతులు ప్రపంచమంతటి అణగారిన మరియు
నిమ్న వర్గాలకు మార్గ దర్శకం. ఆయన పుట్టిన 2 అక్టోబర్ నాడు భారతదేశము అంతటా సెలవు
పాటిస్తారు.
4. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్
మార్టిన్
లూథర్ కింగ్ జూనియర్ ఒక అహింసతో కూడిన పౌర హక్కుల ఉద్యమ ప్రముఖ కార్యకర్త. అలాగే
ఆయన బాప్టిస్టు దూత కూడా. 1950/60 దశకాల్లో అమెరికాలో జాతి విభజన/ వర్గీకరణ
విధానాలకు వ్యతిరేకంగా శాంతియుత ఉద్యమాలకు నాయకత్వం వహించారు. రాజకీయ అన్యాయానికి
వ్యతిరేకంగా పోరాటానికి, ప్రదర్శనలకు ఆయన
నాయకత్వం వహించారు. జాతి సమానతను
పెంపొందించే విధంగా పౌర ధిక్కార నిరసనలు
ఆయన ముందుండి నడిపారు. అమెరికా దేశమంతా ఆయన తిరిగి ప్రసంగిస్తూ ఆయన పౌర హక్కుల
నిరసనకారులకు నాయకత్వం అందించారు. “ నాకూ
ఒక కల” ఆయన ప్రసంగాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఏదో ఒక రోజు అందరూ
ప్రజలూ సోదర సమానులుగా గుర్తింపబడతారని ఆ ప్రసంగం ముఖ్యాంశం. 28 ఆగస్టు 1963 నాడు వాషింగ్టన్ లోని లింకన్ మెమోరియల్ వద్ద 2 లక్షల మండి
ప్రజలనుద్దేశించి ఈ ప్రసంగం జరిగింది.
అహింస తో కూడిన కార్యక్రమాలతో ఆయన నిర్మించిన
ఉద్యమం అమెరికా పౌర హక్కుల రంగంలో పెను మార్పులు తెచ్చింది. ఆఫ్రికా- అమెరికా పౌరులను
వేరుగా చూసే చట్టాలు రద్దు అయ్యాయి. అదనంగా
పౌర హక్కుల చట్టం, 1964 మరియు ఓటు
హక్కుల చట్టం, 1965 రూపొందించారు. 1964 లో నోబెల్ శాంతి
బహుమతిని లూథర్ కింగ్ పొందారు.
1968లో ఆయన
హత్య చేయబడ్డారు. సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఏకైక అమెరికా
నాయకునిగా ఆయన పేరు పొందారు. అమెరికా దేశము ఆయన స్మృతి అలాగే గౌరవం కోసం ఒక రోజును
దేశ సెలవు దినంగా ప్రకటించారు. అలాగే అనేక భవనాలకు, పాఠశాలలు, స్మృతి మందిరాలకు ఆయన పేరును
పెట్టారు.
5. దలై లామా
టిబెట్ లోని బుద్ధుల ఆధ్యాత్మిక గురువు దలై లామా. అంతే కాకుండా ఆయన ఒక
ముఖ్యమైన రాజకీయ నాయకులు కూడా. తన మీద వ్యతిరేకత పెరగడంతో పాటు తనపై హత్య జరిగే
హెచ్చరికలు పెరగడంతో ఆయన మరియు ఆయన అనుచరులు టిబెట్ వదిలేసి ఉత్తర భారతదేశంలోని
ధర్మశాలలో శరణార్థి గా ఉంటున్నారు. ఇక్కడనుంచి ఆయన మరియు అనుచరులు కలిసి ప్రత్యామ్న
ప్రవాస టిబెట్ ప్రభుత్వమును నడుపుతూ ఉన్నారు. ఈ ప్రవాస ప్రభుత్వము తమ టిబెటన్
పౌరులకు హక్కుల పత్రాన్ని రూపొందించి వారికి అన్నీ సాంఘిక హక్కులు (మాట, మతం, కదలిక మొ.వి)
కల్పించారు.
అహింసతో కూడిన వ్యతిరేకత, మానవతతో కూడిన సేవ, మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం మొదలగు విలువలను దలై లామా పూర్తిగా పాటించారు. ఆయన
ప్రపంచమంతటా పర్యటించి టిబెటన్ల బాధలు, కష్టాలపై పుస్తకాలు, సమావేశాలు, కార్యశాలలు,
ప్రసంగాలు నిర్వహించి చైతన్యపరుస్తున్నారు. ఆయన ప్రతి ప్రజా ప్రకటనలోనూ మత సామరస్యాన్ని, ప్రాపంచిక అవగాహనను వ్యక్తపరుస్తున్నారు. టిబెట్ విముక్తికి ఆయన
రూపొందించిన “ఐదు విషయాల శాంతి ప్రణాళిక” శాంతి మార్గాన్ని,
చైనాతో ఒడంబడికను సూచిస్తున్నది. ఆయన 1989 లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
శాంతియుత సహజీవనానికి, పర్యావరణ పరిరక్షణకు టిబెట్ ఒక
సంరక్షణ కేంద్రం కావాలని ఆయన భావిస్తున్నారు.
https://peacesimplified.blogspot.com/
Comments
Post a Comment