War is the last confrontation needed on Planet Earth
మన ముందరున్న, తప్పక పరిష్కరించాల్సిన సవాల్ యుద్ధమే!
మనముందరున్న అనేక సవాళ్లలో యుద్ధానికి మించిన ప్రమాదకరమైనది మరొకటి
లేదు. యుద్ధమంటే సైనికవాదం, యుద్ధ సంస్కృతి, సైన్యాలు,
మారణాయుధాలు, యుద్ధ పరిశ్రమలు, వాటికి
సంబంధించిన విధానాలు, ప్రణాళికలు,
ప్రచారం, పక్షపాతాలు, హేతుబద్ధతలు
మొదలగునవి అన్నీ వస్తాయి. ఇవి సంఘర్షణను, సంఘర్షణ వాతావరణాన్ని మరింత దారుణంగా పెంచుతున్నాయే గానీ తగ్గించటం లేదు.
దీనికి
సమాధానం ఒక్కటే! యుద్ధానికి మించిన అత్యవసర సమస్య/ సవాల్ మరొకటి లేదు. పర్యావరణ
మార్పు, వాతావరణ కాలుష్యం, అత్యధిక జనాభా, అణచివేత, పేదరికం, అసమానతలు, ఆకలి, వ్యాధి (కోరోనాతో సహా) మొదలగు సమస్యలన్నీ
యుద్ధం తర్వాతి ప్రాధాన్యతను కలిగి ఉంటాయి.
పైన
పేర్కొన్న ఏదైనా సమస్యకు సమాధానం కోసం
వెతికితే యుద్ధాలను ఆపటానికి కూడా తగు ప్రయత్నాలను చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
మొదటగా యుద్ధము ఆయా సమస్య(ల)ను మరింత తీవ్రతరం చేయటమే కాక శాశ్వతం చేసే అవకాశం
ఉంది. అలాగే ఉన్న కొద్ది నిధులను/ వనరులను తొందరగా ఖాళీ చేసే అవకాశం ఉంది. యుద్ధం
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం మాత్రమే కాక నియంతృత్వాన్ని, మూఢత్వాన్ని పెంచి
పోషిస్తుంది. యుద్ధం ప్రజలను చంపివేయటమే కాక పేదలుగా,
రోగులుగా మారుస్తుంది. ప్రకృతిని
సర్వనాశనం చేస్తుంది. యుద్ధం పెద్ద సమస్యే కాక మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది.
యుద్ధాన్ని నిర్మూలిస్తేనే ఇతర సామాజిక రుగ్మతలను ఆపేందుకు,
పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది.
మానవ
జాతి ఎదుర్కునే అనేక సమస్యలన్నింటిలోనూ పరిష్కరించడానికి సులువైనది యుద్ధం
మాత్రమే. యుద్ధం ప్రకృతి వైపరీత్యం కాదు ఎందుకంటే మన నియంత్రణలోనే ఉంటుంది కదా!
మనం సృష్టించేది అలాగే మన మానవ ఎంపికల
ఉత్పత్తి యుద్ధం. ప్రపంచంలోని కొన్ని ముఖ్య నాయకులు నిర్ణయిస్తే యుద్ధం
ఆగిపోతుంది.
అన్నిటికీ
మించి యుద్ధం ఒక నైతిక నేరం. అమెరికా గానీ వేరే దేశాలు గానీ యుద్ధం చేసి దేశాలను
ఆక్రమిస్తే వారిని కపట దేశాలుగా అంతర్జాతీయ సమాజం చూస్తున్నది. మానవ ప్రగతిని ఈ
ప్రక్రియ అవహేళన చేస్తున్నది. యుద్ధం గానీ యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు మనలను మనం
పౌర సమాజంగా భావించకూడదు.
యుద్ధ
నేరాలు, మరణాలు తగ్గాయి. గత కొన్ని దశాబ్దాలుగా హఠాత్తు రోడ్డు మరణాలకంటే యుద్ధ
మరణాలు తక్కువే. కానీ అణ్వాయుధాలు భారీగా కలిగిన మన సమాజంలో యుద్ధం అనేది కొన్ని
బటన్లు నొక్కితే జరిగేదే , దాని వల్లన జరిగే పరిణామాలు చాలా
వినాశకరమైనవి. అమెరికాకు చెందిన ఒక్క డ్రోన్ వలన ఒక చిన్న పిల్లాడు చనిపోయినా
ఇస్రాయల్ రాకెట్ వలన కానీ, సిరియన్ రాకెట్ వలన కానీ మొత్తం
మానవ జాతి వినాశనానికి దారి తీయవచ్చు.
ఈనాటి ప్రపంచంలో సిరియా, ఉక్రెయిన్, గాజా, ఆఫ్ఘనిస్థాన్,
పాకిస్తాన్, ఇరాక్ దేశాలలో అమెరికా బాంబులేస్తున్నది. ఇవి
చాలా కాలం నుండి సాగుతున్నవే. వీటి నియంత్రణ మన చేతుల్లో ఉన్నప్పటికీ ఇవి
ఆగట్లేదు. ఆయుధాలు కలిగి యుండి, ప్రమాదకరమైన ప్రస్తుత స్థితి
నుండి యుద్ధం కానీ యుద్ధ హెచ్చరిక కానీ మాయమయ్యే స్థాయికి మనం మార్పు చెందడం మన
ముందున్న పెద్ద సవాల్.
ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఒక పెద్ద సైనిక శక్తిని
కలిగియుండటమే కాక ఆయుధాలను సరఫరా చేసే ఒక వ్యాపారి కూడా. అనేక యుద్ధాలను
ప్రారంభించడమే కాక లక్షల మందిని చంపింది
కూడా అమెరికానే.
అనేక
సర్వేల ప్రకారం ప్రజలు యుద్ధాన్ని ఒక తప్పని సరి/నియంత్రణ లేని పరిణామంగా అలాగే
అది శాశ్వతంగా సాగిపోయే మానవాళి చర్యగా భావిస్తున్నారు. ఈ మూఢ వాదం/ నమ్మకం
నైతికంగా, అనుభావికంగా తప్పు. ఈ దృక్పథం ప్రాణాంతకమైనది. సైన్సు, చరిత్ర మనకు చెబుతున్నా దానికి ఇది వ్యతిరేకం. సమాధానాలను అన్వేషించడానికి
ఈ భావన వ్యతిరేకం.
మనలో
ఎవ్వరినైనా యుద్ధం లేని ప్రపంచంలో
బతుకుతారా అంటే అవుననే సమాధానం ఇస్తారు. ప్రతి ఒక్కరికీ శాంతి కావాలి. యుద్ధాలను
అంతమొందించాలనే మన ప్రయత్నాలు విజయవంతమవ్వాలనీ, ఎప్పుడో సుదీర్ఘ భవిష్యత్తులో కాకుండా సమీప
భవిష్యత్తులోనే ఇది సాధ్యం కావాలనీ ఆశిద్దాం.
మూలం: https://blogs.scientificamerican.com/cross-check/war-is-our-most-urgent-problem-let-8217-s-solve-it/
https://peacesimplified.blogspot.com/
Comments
Post a Comment