Preventing World War-3

మూడవ ప్రపంచ యుద్ధము  జరిగేనా ?

 

 

Preventing World War III

(మృత సైనికుల కోసం నిర్మించబడిన స్మారక ఫలకాలు)

ఈ సమయంలో 1909 లో నార్మన్ ఏంజెల్ రాసిన “the Great Illusion”(ఒక గొప్ప భ్రాంతి) గురించి తప్పక చెప్పుకోవాలి. రాసిన కొద్ది సంవత్సరాల తర్వాత ఈ పుస్తకము పూర్తిగా తప్పని నిరూపించబడింది. ఇందులో పేర్కొనబడింది.  గొప్ప అధికార సంఘర్షణ అని పేర్కొనబడిన ఈ పుస్తక ప్రాతిపదిక మరుగుపడి కొద్ది సంవత్సరాలకే చరిత్రలోనే పెద్ద యుద్ధం జరిగింది.  ప్రపంచీకరణ శక్తుల అభివృద్ధి, ఆర్థిక అనుసంధానం, సాంకేతిక అభివృద్ధి యుద్ధాన్ని నివారిస్తాయని, దేశాల మధ్య అటువంటి యుద్ధ చర్యలు ఊహించను కూడా ఊహించలేమని  ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేర్కొన్నారు.   

 

కొరోనా ధాటికి ప్రపంచం మొత్తం విలవిల్లాడుతున్న ఈ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధంతో పోలిస్తే మరింత ఎక్కువ సర్వ నాశనం కలిగించే సాంకేతిక బలం కలిగియుండి, మరింత ఆర్థిక అనుసంధానం జరిగి ఉన్న ఈ సమయంలో యుద్ధాన్ని ఎలా నివారించాలి అనే ప్రశ్నను మనకు మనం  వేసుకోవాలి: ఏంజెల్ రాసిన “గొప్ప భ్రాంతి” కాస్తా గొప్ప మాయగా మిగిలిపోయింది. అభివృద్ధి చెందుతున్న జర్మనీతో కుంగిపోతున్న యునైటెడ్ కింగ్డం తో యుద్ధాన్ని పసి కట్టలేకపోయింది. యుద్ధాన్ని నివారించుటకు అమెరికా ఎటువంటి అడుగులూ వేయలేదు.

 

ప్రస్తుత  సమయంలో నాలుగు ఖండాలలో మాయ/భ్రాంతి తో కూడిన ఆలోచనలు  వ్యూహాత్మక స్పందనను, నివారించే చర్యలను కమ్ముకుంటున్నాయి.  ఆ నాలుగు భ్రాంతులు ఇవే:

1. అమెరికా, చైనా మధ్య సంఘర్షణను ఊహించను కూడా ఊహించలేము.

2. యూరోప్ అంతా బాగానే ఉంది. అమెరికా అట్లాంటిక్ సంయుక్త చర్యలకు అంత ప్రాముఖ్యం లేదు

3. మధ్య తూర్పు సమస్యలను అధిగమించవచ్చు

4. అమెరికా విశ్వ నాయకత్వం నమ్మదగినదే    

 

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మాత్రమే అమెరికా, దాని మిత్ర దేశాలు కొన్ని మైత్రి బంధాలను, కొన్ని సంస్థలను కొన్ని పద్ధతులను, కొన్ని బంధాలను ఏర్పాటు చేసుకున్నాయి. వీటివలన సుదీర్ఘమైన శాంతి, అభివృద్ధి మనకు లభించాయి. ఐక్య రాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి, నాటో, మన ఆసియా బృందాలు ఇటువంటి వాటికి ఉదాహరణలు. అవి సందర్భం బట్టి రూపాంతరం చెందేందుకు రూపు దిద్దినప్పటికీ అవి ఎదుగుతున్న శక్తులను సమాధానపరచటంలో , వస్తున్న ప్రమాదాలను పసిగట్టటంలో  అంతా చురుకుగా పాల్గొనలేకపోయాయి. అందువలన ఘర్షణలు పెరిగిపోయాయి.

 

మన ముందు తరం వాళ్ళు విశ్వ సహకారం మొత్తం మనం బతకటం కోసం పరిణామం చెందాలని ఒక ప్రముఖ వ్యక్తి అన్నారు.   కాబట్టి పైన పేర్కొన్న 4  భ్రాంతులలో మన బతుకు ఎలా కనపడుతోంది?

 

భ్రాంతి 1: అమెరికా, చైనా మధ్య సంఘర్షణను ఊహించను కూడా ఊహించలేము

 

అమెరికా, చైనా మధ్య అంతకంతకూ పెరుగుతున్న పోటీతత్వం ఎప్పటికైనా యుద్ధానికి దారి తీసేటట్లు  వ్యూహాల నిపుణులు ఒకరు చెబుతున్నారు. ఈ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం కంటే దారుణంగా ఉంటుందని వారు అంటున్నారు.

 

చైనా నాయకులు  జిన్ పింగ్ మరియు అమెరికా నాయకులు ట్రంప్ మధ్య పోటీ ఆర్థిక, సైన్యం విషయాలలో చాలా బాధపడే స్థాయికి చేరుకుంది. ఆసియాలో ఈ మధ్య మూడు ముఖ్య సమావేశాలు జరిగాయి. అయినా అమెరికా,  చైనా మధ్య ఆర్థిక, సైనిక విషయాలలో రాజీ పడకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందువలన వెరీ మధ్య ఒక వ్యూహాత్మక సమావేశం చాలా అవసరం. తగినన్ని వ్యవస్థలు, నిర్మాణాలు, అలవాట్లు, పద్ధతులు రూపొందించవలసిన అవసరం ఎంతైనా వుంది. అప్పుడే ఈ మాయ నుండి బయట పడతాము.   

 

భ్రాంతి 2. యూరోప్ అంతా బాగానే ఉంది. అమెరికా అట్లాంటిక్ సంయుక్త చర్యలకు అంత ప్రాముఖ్యం లేదు

 

యూరోప్ అంతా గొప్పగా అయితే లేదు. ఇందులో అమెరికా పాత్ర ఎంతో కొంత ఉంది. ప్రస్తుత పరిస్థితి పరస్పర వైరుధ్యాలతో నిండి ఉంది. అమెరికా యూరప్లో తన నిబద్ధత పెంచుకొంది. రష్యా పాత్రకు ప్రాముఖ్యం పెరిగింది. అయితే యూరప్ లో ఎన్నో విభజనలు, ఇబ్బందులు ఉన్నాయి. ట్రంప్ పక్కన ఉండగానే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ యూరోప్ సైన్యము గురించి మాట్లాడారు.  ఫ్రాన్స్, జర్మనీ లలో యూరోప్  సైన్యం గురించి,  అలాగే యూరోప్ స్వతంత్ర ప్రతిపత్తి గురించే  ఇప్పుడే మాట్లాడటం ప్రారంభించారు.  ఈ ప్రక్రియ యూరోప్ ను ఇంకా ఎక్కువ విభజిస్తుంది. రష్యా తన తత్వం చూపించినప్పుడు అమెరికా పక్కన ఉండదనేది కొన్ని దేశాల భయం.

 

భ్రాంతి 3. మధ్య తూర్పు సమస్యలను అధిగమించవచ్చు

 

విశ్వ స్థాయి తీవ్రవాదం మరియు తీవ్రమైన శరణార్థుల తరంగాలు మొదలగు మధ్య తూర్పు సమస్యలు మధ్య తూర్పుకే పరిమితం కావు. ఇరాన్ తో అమెరికా సంఘర్షణ, సౌదీ అరేబియాలో హత్యలు, యెమెన్ లో, లిబ్యా, సిరియా లలో  పౌర యుద్ధాలు రాబోయే ప్రమాదాలను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ ప్రమాదాలను ఉత్తీకే వ్యర్థం కాకుండా ఉండాలని అమెరికా మరియు వారి యూరోప్ మిత్రులకు సందేశం వెళ్లింది.  

 

పది కాలాలు ఉంది పోయేటటువంటి వ్యూహాత్మక సమాధానం ఇచ్చి ప్రాంతీయ యుద్ధాలు ఆపి యువతను భాగస్వామ్యం చేయవలసిన అవసరం ఇప్పుడు ఎక్కువ ఉంది.

 

ప్రాంతీయ వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకుంటే పై సూచన కష్టతరమే. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య  ఇస్రాయెల్, పక్క దేశాల మధ్య సరైన వ్యవస్థలను నిర్మించి శాంతి నెలకొల్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. యెమెన్ లో శాంతి చర్యలు చాలా అవసరం. నాటో వంటి సంస్థను మధ్య తూర్పు దేశాల కోసం, సౌదీ అరేబియా  మధ్య శాంతి ప్రక్రియలు చాలా అవసరం. 

 

భ్రాంతి 4. అమెరికా విశ్వ నాయకత్వం నమ్మదగినదే

 

మన ఇష్టం వచ్చినట్లు మన భవిష్యత్తు రూపొందించుకునే అవకాశం దాటిపోతుందనే చెప్పవచ్చు. సంచలనం, ఆర్థిక వనరులు, మానవ వనరులు మొదలగు విశ్వ నాయకత్వ లక్షణాలు అమెరికాకు చాలా ఉన్నాయి. అయితే అమెరికాను ఆర్థికంగా అధిగమించే బలం చైనాకు ఉన్నది. కానీ నాయకత్వ విషయం లో చైనా పరపతి తక్కువే. దీన్ని బట్టి అమెరికా నాయకులు మరింత వ్యూహాత్మకంగా సహకార దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అమెరికాకు ఇప్పుడవన్నీ ఉన్నాయని అనుకుంటే అది మనలను మనం అపార్థం చేసుకున్నట్లే. 

 

మూలం: https://www.atlanticcouncil.org/content-series/inflection-points/preventing-world-war-iii/

https://peacesimplified.blogspot.com/


Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War & Peace- Part 9

Thought Economics- War and Peace- Part 7