Military budgets 2019 analysis
మిలిటరీకి
ఇంత ఖర్చు అవసరమా?
స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటు లెక్కల ప్రకారం 2019 లో విశ్వ వ్యాప్తంగా 1917 బిలియన్ల డాలర్ల మిలిటరీ ఖర్చు జరిగి గత దశాబ్దంలో అత్యధికముగా నమోదైంది.
ప్రాంతాల
వారీగా విశ్వ మిలిటరీ ఖర్చు 1988-2019 World military expenditure,
by region, 1988–2019
2018 కన్నా 2019 లో 3.6 శాతం ఖర్చు పెరిగింది. 2010 నుండి మనం గమనిస్తే
ఇది అత్యధిక పెరుగుదల. వీటిలో అత్యధిక ఖర్చు పెట్టిన 5 దేశాలు: అమెరికా, చైనా, ఇండియా, రష్యా మరియు సౌదీ అరేబియా. విశ్వ వ్యాప్త ఖర్చులో
ఈ ఐదు దేశాలు 62% ఖర్చు పెట్టాయి. రెండు ఆసియా దేశాలు ఈ స్థానాలలో ఉండటం ఇదే మొదటి
సారి.
విశ్వ జిడిపి (GROSS DOMESTIC PRODUCT) లో 2.2% మిలిటరీకి వినియోగిస్తున్నారు. ఇది ఒక వ్యక్తికి రూ. 19000 (249
డాలర్లు) చొప్పున ఖర్చు పెడుతున్నట్లు. ఈ మధ్య
కాలంలో (2010 తో పోలిస్తే ) ఇది చాలా ఎక్కువగా పెరిగింది. 2008లో జరిగిన విశ్వ ఆర్థిక విపత్తుతో పోలిస్తే అత్యధిక స్థాయికి
వెళ్లిందని చెప్పవచ్చు.
అమెరికాదే ఎక్కువ ఖర్చు:
అమెరికా మిలిటరీ ఖర్చు 5.3% పెరిగి 732
బిలియన్ల డాలర్లకు చేరి విశ్వ వ్యాప్త ఖర్చులో 38%గా ఉంది. 2019లో అమెరికా ఎక్కువగా
ఖర్చు పెట్టిన మొత్తం 2019 లో జర్మనీ మిలిటరీ
ఖర్చుతో సమానం. అమెరికా పెట్టిన ఖర్చు చూస్తే గొప్ప శక్తుల మధ్య పోటీ వాతావరణం నెలకుందని
పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఆసియాలో చైనా, భారత్ లవే ఎక్కువ ఖర్చు:
విశ్వ వ్యాప్తంగా మిలిటరీ ఖర్చులో చైనా, భారత్ లు రెండు, మూడు స్థానాలలో ఉన్నారు. చైనా 261 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టగా, 2018తో పోలిస్తే 5.1% ఎక్కువ. ఇదే సమయంలో భారత్ 6.8% పెంచి 71.1 బిలియన్ డాలర్లు
ఖర్చు పెట్టింది. భారత్ కు చైనా, పాకిస్తాన్ దేశాలతో ఉన్న ఉద్రిక్తతలు, శతృత్వం ఈ పెరుగుదలకు కారణం.
జపాన్ (47.6 బిలియన్ డాలర్లు ), దక్షిణ కొరియా (43.9 బిలియన్ డాలర్లు)లు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాయి. 1989 నుండి ఈ ప్రాంతంలో మిలిటరీ
ఖర్చు పెరుగుతూ ఉంది).
యూరోప్ లో జర్మనీదే ఎక్కువ ఖర్చు:
2019లో జర్మనీ ఖర్చు 10% పెరిగి 49.3
బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2019 లో బాగా ఖర్చు పెట్టిన 15 దేశాలలో జర్మనీ పెరుగుదలే
అగ్ర స్థానం. రష్యాతో తనకున్న విభేదాలే దీనికి ముఖ్య కారణం. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్ ల
ఖర్చు స్థిరత్వానికి వచ్చాయి.
బల్గేరియా, రుమేనియాల ఖర్చులు
కూడా గణనీయంగా పెరిగాయి. 29 నాటో దేశాల ఖర్చు 2019 లో 1035 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఈ సమయంలో రష్యా ప్రపంచ వ్యాప్తంగా 4వ స్థానంలో
ఉంది. యూరోప్ లో రష్యాదే అగ్రస్థానం.
సంఘర్షణలో ఉన్న ఆఫ్రికన్ దేశాలలో చంచల
మిలిటరీ ఖర్చులు:
సబ్ సహారా ఆఫ్రికాలో సాయుధ సంఘర్షణ చంచల
మిలిటరీ ఖర్చులకు ముఖ్య కారణం. సహేల్, లేక్ చాద్ ప్రాంతంలో చాలా సాయుధ సంఘర్షణల వలన బుర్కినా
ఫాసో, కామెరూన్, మాలి దేశాల ఖర్చులు బాగా
పెరిగాయి. ఇదే సమయంలో చాద్, నిగర్, నైజీరియా
దేశాలలో ఖర్చులు కొంచెం తగ్గాయి. మధ్య ఆఫ్రికా
దేశాలలో మిలిటరీ ఖర్చు గణనీయంగా పెరిగాయి.
ఇతర ప్రాంతాలు:
దక్షిణ అమెరికా: 52.8 బిలియన్ల డాలర్ల
ఖర్చు వద్ద స్థిరముగానే ఉంది. దీనిలో 51 శాతం బ్రెజిల్ దే.
·
ఆఫ్రికా: ఆఫ్రికాలో ఖర్చు 2019 లో 41.2 బిలియన్ డాలర్లు. గత 5 సంవత్సరాలలో
పెరగడం ఇదే మొదటి సారి.
ఆగ్నేయ ఆసియా: 4.2% పెరిగి 40.5 బిలియన్ డాలర్లకు చేరింది.
·
జీడీపీ పరముగా చూస్తే అమెరికా ఖండంలో 1.4%, ఆఫ్రికాలో 1.6%, ఆసియా లో 1.7%, యూరోప్ లో 1.7%, మధ్య తూర్పు దేశాలలో 4.5% సగటు మిలిటరీ ఖర్చు భారము ఉంది.
https://peacesimplified.blogspot.com/
Comments
Post a Comment