Lessons learnt from Syria War
సిరియా యుద్ధం నుండి
నేర్చుకోదగిన పాఠాలు
ట్రంప్ నుండి పచ్చ జండా
అందుకున్న తర్వాత టర్కీ తన మిలిటరీ సైన్యాన్ని ఈశాన్య సిరియాకు పంపించటం వలన సిరియా
సుదీర్ఘ బహుళ పక్ష యుద్ధ రక్త చరిత్రలో
భయంకరమైన అథమ స్థానానికి అమెరికా పడిపోయింది. శరణా ర్థుల శిబిరాలలో తల దాచుకున్న ఐసిస్, పౌరులతో యుద్ధం చేసిన కుర్ద్
శక్తుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిపోయింది. అయితే ఈ అశుభ సందర్భం చేరుకోవటానికి గల కారణాలపై పునరాలోచన చేయాల్సిన
అవసరం ఎంతైనా ఉంది. ఈ అనుభవం నుండి భవిష్యత్తులో మరిన్ని ఓటములు
రాకుండా కాపాడుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
అసాధారణ ఆశయాలతో, అసలుకే సాధ్యం కానీ లక్ష్యాలతో సిరియాలో అమెరికా జోక్యం ప్రారంభమైంది. బాషర్ అల్ అస్సాదును
తొలగించెందుకు 2011 లో పుట్టుకొచ్చిన అరబ్ స్ప్రింగ్ సంస్కరణ ఉద్యమాన్ని, సిరియా, దాని ఆవల రష్యన్,
ఇరాన్ ల ఆశయాలను అడ్డుకొనడమే అవకాశాలుగా
అమెరికా అధికారులు భావించారు. ఒబామా, ట్రంపు ల ప్రభుత్వాలు
కొన్ని హింసాత్మక బృందాలతో కలసి “కాలిఫెట్ “ అనే ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి
అనుకునే కొన్ని తీవ్రవాద బృందాలను
ఓడించాలని అనుకున్నాయి. దమాస్కస్ లో ప్రభుత్వ మార్పు ప్రయత్నాలు ఐసిస్ ను
ఎదుర్కునే ప్రయత్నాలను తగ్గించినాయి. ఐసిస్
బలం పెరుగుతున్న కొద్దీ కుర్దుల సహకారం తీసుకోవటం అమెరికా చేసింది. ఈ సహ కారం
టర్కీకి (నాటో లో స్నేహితులు) ఇచ్చిన మాటలకు విరుద్ధం. ఇందులో ముఖ్యంగా కొన్ని తీవ్రవాద
(మార్క్సిస్ట్- లెనినిస్ట్) బృందాలకు అమెరికా సహాయ సహకారాలివ్వటం , టర్కీకి అసహనం కలగ చేసింది.
ఇంకొక రకంగా చెప్పాలంటే 68 ఏళ్ల
ఒప్పందం ద్వారా మిత్రులైన దేశానికి విరుద్ధంగా ఒక అనధికార భాగస్వామ్యం కు వరుసగా ఉన్న అమెరికన్ పాలకులు తెరలేపారు. ఈ
మధ్య కాలంలో సిరియాలో తమ సైన్యాలన్నింటినీ
వెనక్కి తీసుకు రావాలనే తలంపును వెలిబుచ్చారు. అలాగే టర్కీను బలపరచే విధంగా కుర్ద్
సైన్యానికి తమ సహాకారం వెనక్కి తీసుకోవాలని కూడా భావించారు. అయితే తమ పరిపాలన
విభాగాలనుంచి, విదేశే వ్యవహార విభాగాల నుంచి
తనకు ప్రతికూలత ఎదురయ్యింది. కాబట్టి తన ప్రతిపాదనను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు.
అయితే సిరియా నుండి వెనక్కి రావాలనే ఆలోచనలో ట్రంపు స్థిరంగా ఉన్నారని
తెలుస్తోంది.
సైన్యాన్ని వెనక్కు తీసుకోవడం
అనివార్యం, న్యాయమైనదే. ఇప్పటికే రష్యా, ఇరాన్ ల సహకారంతో సిరియాలో చాలా భాగంపై గత ఎనిమిది ఏళ్లుగా పట్టును బషర్
అల్ అసాద్ సాధించారు. అమెరికా చిన్న పాత్రతో పెద్దగా సాధించేది లేదు. స్వేచ్ఛాయుత
ఎన్నికలను నిర్వహించటము, అస్సాదును నియంత్రించచటము, కుర్డులను రక్షించటము, రష్యాను ఆపటము జరిగేవి కావు.
ఇంకా సైన్యం, డబ్బు, దౌత్యం లతో కూడిన అదనపు వనరులు, పునరుద్ధరించిన నిబద్ధత కొన్ని ఉద్దేశాలను కూడా సాధించలేదు. అమెరికన్లు
కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ముఖ్యంగా సిరియా ప్రయత్నం అమెరికా జాతీయ భద్రతకు ఏ మాత్రం ఉపయోగపడదు. ఐసిస్ నుండి వచ్చే ముప్పు పెద్దగా ఏమీ లేదు.
ఇస్లామిక్ ప్రభుత్వ పరిస్థితే అయోమయంగా ఉంది.
సిరియా రాజకీయ చిత్రాన్ని
అమెరికా మార్చగలదని ఆశించటం కూడా అత్యాశే. కొన్ని వేల సైన్యం కూడా ఏమీ చేయలేదు. ఇరాన్, రష్యా ల నుండి అస్సాదు ను
విడదీయలేదు. తన అంతర్జాతీయ పాత్రను
అమెరికా తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తన మిత్రులను జాగ్రత్తగా ఎంచుకోవలసి
ఉంది. కొంతమందిని వదిలించుకోవలసిన అవసరముంది. నాటో నుండి కూడా ఉమ్మడి అవసరాలకు
నిబద్ధత లేని వారిని కూడా తొలగించ వలసిన అవసరం ఉంది. పరస్పర వైరుధ్యం ఉన్న నిబద్ధతలను అనేక మంది మిత్రులకు
ఇవ్వకూడదు.
https://peacesimplified.blogspot.com/
Comments
Post a Comment