Is World Peace achievable?
ప్రపంచ శాంతి సాధ్యమే
ప్రపంచ
శాంతి నిజంగా సాధ్యమేనా అన్న ప్రశ్న చాలా దశాబ్దాలుగా వాదనలకు ప్రతివాదనలకు
గురవుతోంది. ప్రపంచ శాంతి
విషయములో ఎవరి సమాధానం వారికి ఉంటుంది. ఒకానొక సర్వేలో 57 శాతం
మంది ప్రపంచ శాంతి సాధ్యం కాదని భావించగా 43 శాతం మంది సాధ్యమే అని భావించారు.
ప్రతి
దేశం మరొక దేశంతో సహజీవనం చేసే ప్రపంచంలో మనం శాంతితో జీవించటం సాధ్యమేనా?
ప్రపంచ శాంతి విషయానికి వచ్చేటప్పటికి యుద్ధం, హింస,
చంపడాలు లేదా హింస మనం అనగా మనుషులవల్లనే జరుగుతుందని అర్థం చేసుకోవాలి. దేశాలు
తమంతట తామే యుద్ధానికి వెళ్లలేదు. సైన్యాన్ని శాసించే సత్తా ఉన్న దేశ నాయకులు దేశాల మధ్య యుద్ధానికి కారణమయ్యారు. ఈ ప్రపంచం
లో నివసిస్తున్న వ్యక్తులు ప్రపంచ
గమనాన్ని తీర్చి దిద్దుతారు.
ప్రపంచ
శాంతి సాధన గురించి మనం మాట్లాడుకోవాలంటే దేశ ప్రజలు మరియు వారిని పాలించే నాయకులు
యుద్ధ నిర్ణయాన్ని తీసుకుంటారని మనం అర్థం చేసుకోవాలి. నాయకులు కూడా మన సామాన్య ప్రజలు లాగే
భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రపంచం లోని మిగతా ప్రజల లాగానే వారికీ అలాంటి
బలహీనతలు ఉంటాయి. వారికీ కోపతాపాలు, ఇగోలు ఉంటాయి.
వాటికి లోనై సైన్యాన్ని యుద్ధానికి పంపుతారు.
నియంత్రణ/ కట్టడి లేని మానవ ప్రవర్తనలోనే యుద్ధాలకు కారణాలు దాగి
ఉన్నాయి. కాబట్టి ప్రపంచ శాంతి సాధించాలంటే భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ
సంస్కారులై శాంతియుత నైజము కలిగియుండాలి.
ముఖ్యంగా నాయకులకు ఇవి తప్పని సరి.
మనకు
మనం మెరుగు పరుచుకోవటము, మన ఆశయాలను అదుపులో ఉంచుకోవడము, ఇగోలు
మరియు దురాశ మన బుర్రలను నియంత్రించకుండా చూసుకోవడము శాంతియుత ప్రపంచం
సృష్టించడానికి మనకు చాలా అవసరం.
మానసిక
శాస్త్రజ్ఞుల ప్రకారం జ్ఞానమును, ఆనందమును సాధించుట ద్వారా జీవనంలో నిపుణులు కావచ్చు. ప్రజలు ఆనందంగా ఉంటే విజ్ఞత పొందుతారు అలాగే విజ్ఞత కలిగియుంటే ఆనందం
పొందుతారు. ప్రపంచంలో చాలా మంది ఆనందంగా
విజ్ఞతతో ఉంటే హింస తక్కువై సంఘర్షణలు తక్కువగా ఉంటాయి. ఎక్కడైతే మంచి జీవనానికి ఆశ కూడా లేదో,
ఇతరులతో సహనం తో కూడిన జీవనం సాధ్యం కాదో, వారి
వారి ప్రతికూల ప్రవర్తనలు ప్రభావితం
చేస్తాయో అటువంటి సందర్భాలలో యుద్ధాలు, అహింస రాజ్యం ఏలతాయి.
పరివర్తన చెందిన సంస్కృతి ద్వారా
ప్రపంచ శాంతి
మొదటి
ప్రపంచ యుద్ధం తర్వాత యుద్దాలను త్యజించాలని అమెరికన్లు జాతీయ విధానంగా
ఏర్పరచుకున్నారు. అది చట్ట రూపం దాల్చి మిగతా కొన్ని దేశాలు కూడా అందుకు ఒప్పుకున్నాయి. ఈ ఒప్పందం
ఎక్కువ కాలం నిలబడలేదు. కానీ ప్రపంచ శాంతికి ఆశా కిరణంగా అది నిలబడవచ్చు. ఉదాహరణకు
కోస్టారికా, పనామా లాంటి దేశాలు ఇప్పటికీ
అధికారిక సైన్యాన్ని కలిగి వుండట్లేదు. అలాగే
స్పెయిన్ లోని “మరినేలడా” పట్టణానికి పోలీస్ వ్యవస్థ ఉండదు.
ఈ
ప్రపంచంలో శాంతిని నెలకొల్పటంలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంది. నిజానికి మన పరిసరాలు
ఇప్పటికే మంచి వైపు మారుతున్నాయి. “శాంతి సంస్కృతి” దిశగా ఐక్య రాజ్య సమితి
ఇప్పటికే కొన్ని తీర్మానాలు చేసింది.
మానవుల
ఆలోచనలు, ప్రవర్తనలు ప్రపంచ శాంతి దిశ వైపు
పయనించేందుకు ముఖ్య పాత్ర వహిస్తాయి.
ప్రపంచ ప్రజలు “ పర్యావరణం,
భూగ్రహాన్ని రక్షించుట, బంధాలు, శాంతి, సామాజిక న్యాయం, ఆత్మ జ్ఞానము, ఆధ్యాత్మికత, భావ ప్రకటన” వైపు చాలా మండి
ప్రపంచ ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఒక
సర్వేలో తెల్సింది.
మొక్కల
ఆధారిత శాకాహారానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని తెలుస్తోంది. ఇస్రాయెల్, ఇటలీ,
స్వీడెన్, జర్మనీ వంటి దేశాలలో దాదాపు 10%
మండి శాకాహారం వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. జంతువులతో మంచి ప్రవర్తన కలిగి వుండాలనే ప్రజలు
నెమ్మదిగా ఎక్కువ అవుతున్నారు. వ్యవసాయ ఆధార వ్యవస్థ లోనూ జీవ హింస
తగ్గుతోంది.
వ్యక్తి స్థాయి నుండే ప్రపంచ
శాంతి ప్రారంభం
ఒక అంతర్జాతీయ వార్తా పత్రిక కథనం ప్రకారం ప్రపంచ శాంతి ప్రతి
మనిషి నుండి ప్రారంభం అవుతుంది. వ్యక్తులు మూడు సులభమైన పద్ధతుల ద్వారా ప్రపంచ శాంతికి దోహదపడ
వచ్చును. ఆ 3 సులభమైన
పద్దతులు ఈ విధంగా ఉన్నాయి:
1. ఆత్మ
శాంతిని సాధించండి
ఆందోళనకరమైన ఆలోచనల నుండే
హింస పుడుతుంది. కాబట్టి హింసను వదిలించుకోవాలంటే ముందర ఆత్మ శాంతి సాధించాలి.
దగ్గర దగ్గర 44% మంది ప్రజలు గత ఐదు
సంవత్సరాలకంటే ఇప్పుడు ఎక్కువ ఆందోళనకు గురవుతున్నారని ఒక అధ్యయనం తెలుపుతోంది.
ధ్యానం,
వ్యాయామం ద్వారా ఆత్మ ను చేరుకోవచ్చు. ఈ ప్రపంచం సమాజాలతో,
సమాజాలు వ్యక్తులతో ఏర్పడుతుంది. వ్యక్తిగా ఆత్మ శాంతి పొందటము ప్రపంచ శాంతికి
తొలి మెట్టు.
2. దయ, దాన
కార్యక్రమాలు చేపట్టండి
స్వార్థం
లేని దయా కార్యక్రమాలు మన చేతనను,
తెలివిని పెంచి మనకు సౌకర్యాన్ని, ఓదార్పును కలగచేస్తాయి.
“లోపల్లోపల మనం ఒకరొకరిని ప్రేమిస్తాము. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. ప్రపంచము
మొత్తము మనం ఆ స్థాయికి వెళ్ళాలి. అది మనకు అవసరం” అని ఒక ప్రఖ్యాత వ్యక్తి
అన్నారు.
3. సంతోషంగా ఉండాలని తీర్మానం చేసుకోండి
మీరు సంతోషంగా/ ఆనందంగా ఉన్నప్పుడు మీ చుట్టుప్రక్కల ఉన్న ఇతరులను మీరు ప్రోత్సహిస్తారు అలాగే
కొట్లాడాలని గానీ ఘర్షణ పడాలని గానీ కోరుకోరు. ప్రజలు సంతోషంగా లేరని భావించే
నాయకులు యుద్ధ నిర్ణయాలు తీసుకుంటారు. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం మీ
ఆనందం/ సంతోషం మీ చుట్టూ ప్రక్కల వారిని మాత్రమే కాక మీ నెట్వర్క్ లో ఇతరులను కూడా
ప్రభావితం చేస్తుంది.
ప్రపంచ శాంతి సాధ్యమే!
నిజానికి
ఈ ప్రపంచంలో నివసిస్తున్న మనమందరం ప్రపంచ శాంతికి అవరోధం కల్పిస్తున్నాము. ఒక
వ్యక్తి తన భవిష్యత్తును, తన చుట్టూ ఉన్నవారి భవిష్యత్తును
నిర్ణయిస్తారు. కాబట్టి మనం మన జీవనాన్ని నడపటంలో నైపుణ్యం సాధించి మన చేతనను,
తెలివినీ పెంచుకుంటే ప్రపంచ శాంతి సాధ్యమే.
అయితే
ప్రపంచ శాంతి వెంటనే సాధ్యం కాకపోవచ్చు. ప్రతి వ్యక్తి శాంతికి కారకులైతే
ప్రపంచంలో అది సాధ్యం కావచ్చు. మహాత్మా గాంధీ చెప్పినట్లు “ప్రపంచంలో ఏ మార్పు
కావాలని నీవు ఆశిస్తున్నావో ఆ మార్పు నీలో ముందర రావాలి”. కనుక శాంతి వైపు మార్పు నీతో ప్రారంభమైతే ప్రపంచ
శాంతి సాధ్యమే!
మూలం: http://www.thewisdompost.com/peace/will-ever-possible-achieve-world-peace/2077
https://peacesimplified.blogspot.com/
Comments
Post a Comment