GOOD BOOKS
మంచి పుస్తకాలు
మిత్రులకు నమస్కారం!
ఇటీవల కొద్దిరోజుల క్రితం నేను “మంచి
పుస్తకం” అనే సంస్థను సందర్శించాను. ఈ సంస్థను శ్రీ కొసరాజు సురేశ్ గారు
ముందుండీ నడిపిస్తున్నారు. ఈ సంస్థ కేవలం తెలుగులో బాల సాహిత్యం
కోసమే పని చేస్తున్నది. వారు ప్రపంచ శాంతి గురించి కొన్ని పుస్తకాలను
ప్రచురించారు. వాటిలో కొన్ని:
1. షిన్ మూడు చక్రాల సైకిల్- జపనీస్
భాషనుండి అనువదించబడినది. వెల రూ. 25- హిరోషిమా అణుబాంబు నేపధ్యంలో రాసినది
2. సదాకో, కాగితపు పక్షులు- జపనీస్
భాష నుండి అనువదించబడినది. వేల రూ. 8- హిరోషిమా అణుబాంబు నేపధ్యంలో రాసినది
3. సేనాధిపతి- జెనెట్ చార్టర్ రాసిన పుస్తకానికి అనువాదం- వెల రూ. 8- మంచి
సేనాధిపతి తన రాజ్యం, దాని
పర్యావరణాన్ని కాపాడుతారు అనే నేపథ్యంలో రాసినది.
4. ఆన్ ఫ్రాంక్- డేవిడ్ ఎ ఎడ్లర్
రాసిన పుస్తకానికి అనువాదం - వెల రూ. 8- రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఆన్ ఫ్రాంక్
డైరీనుండి సంగ్రహించిన కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి.
5. యుద్ధోన్మాది అమెరికా-
మిలిటరిజాన్ని అమెరికా ఎందుకు వదలి పెట్టలేకపోతోంది అనే ప్రశ్నకు సమాధాన్నిస్తూ
బొమ్మల కథగా జోయల్ ఆండ్రూస్ రాసిన పుస్తకానికి అనువాదం. జన విజ్ఞాన వేదిక దీనిని
ప్రచురించారు. వెల రూ. 100/-
ఇంకా చాలా పుస్తకాలను వీరు ప్రచురించారు.
అన్నింటినీ స్వల్ప ధరలలో అందిస్తున్నారు.
వీరి చిరునామా:
మంచి
పుస్తకం, 12-13-439, వీధి నెం 1, తార్నాక, సికింద్రాబాదు 500017
ఫోన్:
94907 46614, email: info@manchipustakam.in
Website: www.manchipustakam.in
Comments
Post a Comment